newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

ఢిల్లీ కల ఖల్లాస్.. మరి బెంగాల్ కథేంటి?

14-02-202014-02-2020 09:00:25 IST
2020-02-14T03:30:25.712Z14-02-2020 2020-02-14T03:30:16.883Z - - 14-08-2020

ఢిల్లీ కల ఖల్లాస్.. మరి బెంగాల్ కథేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా బీజేపీ కల చెదిరిపోతోందా?

ఒక్కో రాష్ట్రం కమలం చేజారిపోతోందా?

మొన్న మహారాష్ట్ర, నిన్న జార్ఱండ్, ఇప్పుడు ఢిల్లీ

రాబోయే రోజులు కమలానికి కష్టకాలమేనా?

బెంగాల్ లో బీజేపీ వ్యూహం ఏంటి? 

కేజ్రీవాల్ కి కలిసొచ్చిన బీజేపీపై వ్యతిరేకత

పీకే స్ట్రాటజీ దీదీకి ప్లస్ అవుతుందా? 

ఢిల్లీ ఓటమిపై బీజేపీలో అంతర్మథనం 

దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. ఢిల్లీలో ఎలాగైనా విజయం సాధించాలని భావించిన బీజేపీ నేతలకు ఫలితాలు దిమ్మతిరిగేలా చేశాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో.. రానున్న పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై భారతీయ జనతా పార్టీ అంతర్మథనం చెందుతోంది. పౌరసత్వ సవరణ చట్టం అమలు, ఎన్నార్సీలపై ఆలోచనలో పడింది. వీటిపై వైఖరి కారణంగానే దేశరాజధానిలో ఆప్ ఘన విజయం సాధించిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

2021లో పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బెంగాల్ లో ఈసారి బీజేపీ జెండా ఎగురవేయాలని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా భావిస్తున్నారు. అందుకు తగిన విధంగా బెంగాల్ సమస్యలను ప్రస్తావించడం, వాటి పరిష్కారానికి కేంద్రం స్థాయిలో ప్రయత్నించడం ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని యోచిస్తోంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. అధికార టీఎంసీని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సమాయత్తమవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన ఫలితాలే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం కావు. 

ఈ విషయం ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలే స్పష్టం చేశాయి 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. మొత్తం 42 స్థానాలకు గానూ 18 సీట్లను గెలుచుకుంది. లోక్‌సభ ఎన్నికలతో పోల్చుకుని.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తామని బీజేపీ నేతలు భావిస్తే.. ఆప్ వారి ఆశలపై నీళ్ళు చల్లింది. గతంలో కంటే సీట్లు పెంచకున్నా.. అది బీజేపీకి సంతృప్తిని ఇవ్వలేదు. 

ఢిల్లీలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 7 స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఊహించని పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి వస్తోంది. జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలకు, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పట్టం కట్టారు దేశరాజధాని ఓటర్లు. పశ్చిమబెంగాల్లో అదే జరిగితే బీజేపీకి షాక్ కొట్టడం ఖాయం.  రాష్ట్ర ఎన్నికలకు ప్రత్యేక వ్యూహాలు అమలుచేయనున్నారు. 

ఢిల్లీ ఎన్నికలపై పోస్ట్ మార్టమ్ నిర్వహించుకుని, బెంగాల్ కు తగిన వ్యూహం అమలుచేయాలని అమిత్ షా భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది బీజేపీ.  గురువారం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమయంలోనే నేతలు బెంగాల్ ఎన్నికల గురించి ప్రస్తావించారు. మరో సంగతి ఏంటంటే బెంగాల్ ఎన్నికలకు కూడా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పనిచేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో జగన్, ఢిల్లీలో కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చారు. బెంగాల్లో కూడా పీకే రంగంలోకి దిగితే మమతకు మంచి సపోర్ట్ దొరికినట్టు అవుతుందంటున్నారు. 

దేశంలో కరోనా కేసులు 23 లక్షలు.. 24 గంటల్లో 60 వేల కేసులు

దేశంలో కరోనా కేసులు 23 లక్షలు.. 24 గంటల్లో 60 వేల కేసులు

   12 hours ago


ట్రంప్ నెత్తిన హారిస్ పిడుగు.. అమెరికన్ భారతీయుల్లో ఆశలు

ట్రంప్ నెత్తిన హారిస్ పిడుగు.. అమెరికన్ భారతీయుల్లో ఆశలు

   15 hours ago


నాన్న ఆరోగ్యం ఇక భగవంతుడి ఇష్టమే.. ప్రణబ్ కుమార్తె ప్రకటన

నాన్న ఆరోగ్యం ఇక భగవంతుడి ఇష్టమే.. ప్రణబ్ కుమార్తె ప్రకటన

   18 hours ago


రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   12-08-2020


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   12-08-2020


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   12-08-2020


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle