newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

ఢిల్లీ ఎన్నికల నగారా.. పార్టీలన్నీ గెట్ రెడీ

07-01-202007-01-2020 08:29:36 IST
Updated On 07-01-2020 12:38:17 ISTUpdated On 07-01-20202020-01-07T02:59:36.243Z07-01-2020 2020-01-07T02:58:23.522Z - 2020-01-07T07:08:17.805Z - 07-01-2020

ఢిల్లీ ఎన్నికల నగారా.. పార్టీలన్నీ గెట్ రెడీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశరాజధాని ఒకవైపు చలితో వణికిపోతోంది. సీఏఏ నిరసనలు, జేఎన్ యూ ఘటనలతో అట్టుడికిపోతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం మరింత వేడిని రాజేసింది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అయింది. ఎన్నికల సంఘం నగారా మోగించడంతో పార్టీలు తమ అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం 70 అసెంబ్లీ స్థానాలకు జనవరి 14న నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

ఫిబ్రవరి 8న పోలింగ్‌, ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. సమయం తక్కువగా ఉండడంతో ఎన్నికలు అన్నీ ఒకే విడతలో నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. సోమవారం నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 22తో ఢిల్లీ అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ గడువుకు ముందే ఎన్నికల తంతు ముగియనుంది. అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్‌ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. 

మరిన్ని సంక్షేమ పథకాలు, ఉచిత తాయిలాలపై నమ్మకంతో మరోసారి అధికారంలోకి రావాలని ఆప్‌ ప్రయత్నిస్తోంది. అయితే గత అనుభవాల దృష్ట్యా బీజేపీ, కాంగ్రెస్‌ పరువు నిలుపుకునేందుకు  తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

గత ఎ‍న్నికల్లో రికార్డు స్థాయిలో 67 స్థానాలను దక్కించుకుని అరవింద్‌  కేజ్రీవాల్‌ తన సత్తా చాటారు. దేశ రాజధాని కావడంతో ఈ ఎన్నికల కోసం దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బీజేపీ మాత్రం ఎలాగైనా విజయం సాధించాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, జార్ఖండ్ చేజారిపోయాయి. దీంతో ఢిల్లీ పీఠంపై కమలనాథులు కన్నేశారు.

మరోవైపు ఎన్నికలకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అంటూ పీకె తన క్యాడర్ కు  పిలుపునిచ్చారు. ‘ప్రజల బలం చూసేందుకు ఫిబ్రవరి 11న సిద్ధంగా ఉండండి’ అంటూ ట్వీట్‌ చేశారు. ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఆయన ఎన్నికల సలహాదారుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఆప్‌ విజయానికి దోహదపడేందుకు ఇప్పటికే ప్రశాంత్‌ కిషోర్‌ బృందం గ్రౌండ్‌ వర్క్‌ను ప్రారంభించింది. ప్రచారం, పథకాలు, అభ్యర్థుల ఎంపిక వంటి కీలక అంశాల్లో కేజ్రీవాల్‌కు సలహాలిస్తున్న సంగతి తెలిసిందే. ఇటు కేజ్రీవాల్ కూడా విజయంపై ధీమాగా వున్నారు.

గడిచిన ఐదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతామన్నారు. ఢిల్లీలోని ప్రతి గడపగడపకు తమ ప్రచారాన్ని చేరవేస్తామని అన్నారు. 

ప్రశాంత్ కిషోర్ వ్యూహంతో ఏపీలో జగన్ సీఎం అయ్యారు. అదే విధానంతో కేజ్రీవాల్ కూడా విజయం సాధిస్తారని పీకే ధీమాతో వున్నారు. ఈ ఎన్నికలు ప్రశాంత్ కిషోర్ కి ఇజ్జత్ కా సవాల్ కానున్నాయి. 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   2 hours ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   6 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   8 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   9 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   9 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   10 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   04-08-2020


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle