newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ఢిల్లీలో మహిళ మృతి.. భారత్‌లో రెండో కరోనా మరణం.. దేశమంతటా హై అలర్ట్

14-03-202014-03-2020 11:23:58 IST
Updated On 14-03-2020 11:23:55 ISTUpdated On 14-03-20202020-03-14T05:53:58.935Z14-03-2020 2020-03-14T05:53:30.422Z - 2020-03-14T05:53:55.592Z - 14-03-2020

ఢిల్లీలో మహిళ మృతి.. భారత్‌లో రెండో కరోనా మరణం.. దేశమంతటా హై అలర్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత రెండు నెలలుగా కరోనా వైరస్ గురించి పెద్దగా పట్టించుకోని భారత్.. కరోనా పాజిటివ్ అని తేలిన మహిళ దేశరాజధానిలో మృతి చెందడంతో అప్రమత్తమైంది. గురువారం కర్నాటకలో కోవిడ్‌ –19 కి సంబంధించి తొలి మరణం నమోదు కాగా, శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో మరో మరణం సంభవించింది. దీంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.

కరోనా నిర్ధారణ అయిన 68 ఏళ్ల మహిళ ఢిల్లీలో మరణించిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆమె మధుమేహం(డయాబెటిస్‌), రక్తపోటు(బీపీ)తో బాధపడుతున్నారని, ఇటీవల ఆమెకు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిందని వెల్లడించారు. ఆమె రామ్‌ మనోహర్‌ లోహియా(ఆర్‌ఎంఎల్‌) ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు తెలిపారు.

ఫిబ్రవరిలో స్విట్జర్లాండ్, ఇటలీల్లో పర్యటించి వచ్చిన ఆమె కుమారుడికి కూడా కోవిడ్‌–19 నిర్ధారణ అయిందని వెల్లడించారు. అతడికి ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. వారి కుటుంబ సభ్యులను వేరుగా ఉంచి, పరీక్షిస్తున్నట్లు తెలిపారు.  దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 82కు పెరిగింది.

కరోనా మరణాల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పలు రాష్ట్రాలు వైరస్‌ వ్యాప్తిని నిరోధించే దిశగా చర్యలను ముమ్మరం చేశాయి. ముఖ్యంగా ఐటీ రాజధాని బెంగళూరు నగరం సహా కర్నాటక వ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. షాపింగ్‌ మాల్స్‌ను, సినిమా థియేటర్లను, పబ్‌లు, నైట్‌ క్లబ్‌లను తక్షణమే మూసేయాలని ఆదేశించారు.

అన్ని రకాల ఎగ్జిబిషన్లు, సమ్మర్‌ క్యాంప్‌లు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సదస్సులు, పుట్టినరోజు వేడుకలు, వివాహ కార్యక్రమాలు, క్రీడా కార్యక్రమాలను శనివారం నుంచి వారం రోజుల పాటు నిలిపేయాలని ముఖ్యమంత్రి యెడియూరప్ప శుక్రవారం రాష్ట్ర ప్రజలకు సూచించారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలను వారం పాటు మూసేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోకూడదని ప్రజలకు సూచించారు.

స్కూళ్లను మూసేయాలని, ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. 10వ తరగతి పరీక్షలతో పాటు సహా అన్ని పరీక్షలు యథావిధిగా జరుగుతాయన్నారు. ఐటీ నిపుణులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసేలా విధుల్లో మార్పులు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ కార్యకలాపాలు యథావిధిగా జరుగుతాయన్నారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ఉపయోగించే ఫేస్‌ మాస్క్‌లు, గ్లవుజులు, హ్యాండ్‌ శానిటైజర్లను నిత్యావసర వస్తువులుగా కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. వీటిని నిత్యావసర వస్తువుల చట్టం–1955 పరిధిలోకి తీసుకువచ్చింది. దాంతో, వీటి ఉత్పత్తి, నాణ్యత, సరఫరా, ధరలను నియంత్రించే అవకాశం రాష్ట్రాలకు లభిస్తుంది. జూన్‌ 30 వరకు అవి నిత్యావసరాల జాబితాలో ఉంటాయని, వాటిని అక్రమంగా పెద్ద ఎత్తున నిలవ చేయడం నేరమని కేంద్రం పేర్కొంది. వీటి ధరలను పెంచి అమ్మడం కూడా నేరమని పేర్కొంది. అవసరాలకు తగినంతగా వీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. 

కరోనా భీతి విస్తరిస్తున్న నేపథ్యంలో దేశంలో అనేక విచిత్రాలు జరుగుతున్నాయి. ముంబైలోని సిద్ధి వినాయక ఆలయ పూజారులు తొలిసారిగా మాస్కులు ధరించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం వింతగొలిపింది. కల్బుర్గిలో మరణించిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న 46 మందిని కూడా ప్రత్యేకంగా ఉంచారు. సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఈ సోమవారం నుంచి అత్యవసర కేసులు తప్ప మిగిలినవేవీ విచారణ చేపట్టకూడదని నిర్ణయించింది. కోర్టు హాలులోకి లాయర్లను మినహా మరెవరినీ అనుమతించరు.  

కరోనా కట్టడికి ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధామూర్తి పలు సూచనలు చేశారు. వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని కర్నాటక ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. షాపింగ్‌ మాల్స్‌ను, సినిమా టాకీస్‌లను తక్షణమే మూసేసి, నిత్యావసరాలైన ఫార్మసీ, కిరాణా, పెట్రోల్‌ బంక్‌లను మాత్రమే తెరిచి ఉంచాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 21 నుంచి రెండు రోజుల గుజరాత్‌ పర్యటనను వాయిదా వేసుకున్నారు.

దేశమంతటా పాఠశాలలను, కళాశాలలను మార్చి 31 వరకు మూసివేసే ప్రక్రియ మొదలైపోయంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే దీనిపై ఆదేశాలు జారీ చేశాయి కూడా. దేశరాజధానిలో సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ ని కూడా మూసివేయడంతో జనం ఇళ్లకు పరిమితం కావాల్సివస్తోంది. మార్చి 31 వరకు జేఎన్‌యూ సహా అన్ని విద్యాసంస్థలను  మూసివేశారు. 

ఇటలీలో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకురావడానికి ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానం మిలాన్‌కు వెళ్లింది. ఆదివారం ఉదయానికి భారతీయుల్ని వెనక్కి తీసుకురానుంది. మరోవైపు ఇరాన్‌ నుంచి రెండో విడత 44 మంది యాత్రికుల్ని వెనక్కి తీసుకువచ్చారు. ముంబై విమానాశ్రయంలో దిగిన వారిని జైసల్మీర్‌లో ఆర్మీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు.  

ముంబై, నవీముంబై, పుణె, థానె, నాగపూర్, పింప్రి చించ్వాడాలలో మార్చి 30 వరకు మాల్స్, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్‌లను మూసివేశారు.  ఉత్తరప్రదేశ్‌లో 11 కరోనా కేసులు నమోదు కావడంతో అన్ని పాఠశాలలు, కళాశాలల్ని మార్చి 22 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. అయితే పరీక్షలు మాత్రం యధావిధిగా జరుగుతాయి.  

వాఘా సరిహద్దుల ద్వారా విదేశీయులెవరినీ శుక్రవారం సాయంత్రం నుంచి దేశంలోకి అనుమతించడం లేదు. ఏప్రిల్‌ 15వరకు భారత్, బంగ్లాదేశ్‌ సరిహద్దుల వెంబడి ప్రయాణికుల రాకపోకల్ని నిలిపివేశారు. 

ఒక్కమాటలో చెప్పాలంటే.. భారత్ ఇప్పుడు నిజంగా కరోనా వైరస్ కాకను అనుభవిస్తోంది. 

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   9 hours ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   17 hours ago


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   18 hours ago


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   03-08-2020


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   02-08-2020


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle