newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

డ్రాగన్ కంపెనీలపై ఆధారపడటం తగ్గించుకుంటే భారత్‌కి గొప్ప భవిష్యత్తు.. మైక్ పాంపియో

24-07-202024-07-2020 08:35:53 IST
2020-07-24T03:05:53.385Z24-07-2020 2020-07-24T03:05:45.741Z - - 05-08-2020

డ్రాగన్ కంపెనీలపై ఆధారపడటం తగ్గించుకుంటే భారత్‌కి గొప్ప భవిష్యత్తు.. మైక్ పాంపియో
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇదివరకు ఎన్నడూ లేని విధంగా అమెరికా ఆగ్రరాజ్యంతోపాటు ప్రపంచం నమ్మకాన్ని భారత్ చూరగొందని. తన వాణిజ్య అవసరాల కోసం చైనాపై అతిగా ఆధారపడటం తగ్గించుకుంటే అన్ని రంగాల్లో భారతదేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో విభేదాలు తారస్థాయికి చేరుకున్న వేళ అమెరికా సీనియర్ మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. భారత్ ఈరోజు తన చరిత్రలోనే ఒక బలమైన స్థానాన్ని సాధించిందంటే అమెరికాతో సహా ప్రపంచంలోని పలు దేశాల నమ్మకాన్ని అది సంపాదించుకోవడమే కారణమన్నారు.

అమెరికా అగ్రరాజ్యంతోపాటు ప్రపంచంలోని వివిధ దేశాల నమ్మకం చూరగొన్న భారత్‌కు చైనా నుంచి తరలిపోతున్న అంతర్జాతీయ స్థాయి కంపెనీలను ఆకర్షించగల సత్తా ఉందని మైక్ పాంపియో పేర్కొన్నారు. అదే విధంగా వాణిజ్య అవసరాల కోసం భారత్‌ డ్రాగన్‌ కంపెనీలపై ఆధారపడటం తగ్గించుకోవాలని..  అప్పుడే చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ సృష్టిస్తున్న అవాంతరాలను సులభంగా అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇటీవల జరిగిన యూఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌(యూఎస్‌ఐబీసీ)- ‘‘ఇండియా ఐడియాస్‌ సమ్మిట్‌’’లో వర్చువల్‌ సమావేశంలో పాంపియో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా- భారత్‌ కలిసి పనిచేస్తే ఎంతో బాగుంటుందని.. అయితే అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌ మరింత సానుకూల వాతావరణం కల్పించాల్సి ఉంటుందన్నారు.

అలాగే, తాము కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాబోమని.. తమకు ఉన్న అతికొద్ది నమ్మకమైన, ఒకే ఆలోచనా విధానం కలిగిన దేశాల్లో భారత్‌ కూడా ఒకటి అంటూ అమెరికా మంత్రి ప్రశంసలు కురిపించారు. భారత్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు సుముఖంగా ఉన్నామని.. జీ-7 సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించిన విషయాన్ని ఈ సందర్భంగా పాంపియో గుర్తు చేశారు. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా టిక్‌టాక్‌ సహా 59 చైనీస్‌ యాప్‌లను భారత్‌ నిషేధం విధించిన విషయాన్ని ప్రస్తావించారు. 

చైనాలోని వుహాన్‌ నగరంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్‌ కల్లోలం కారణంగా ఆర్థిక వ్యవస్థలు, ప్రైవేటు రంగం కుదేలైన విషయాన్ని గుర్తు పెట్టుకుని ప్రపంచ దేశాలు ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. కాగా భారత్‌లోని ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, రక్షణ, ఇంధన, వ్యవసాయం, బీమా రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలంటూ అమెరికా కంపెనీలకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆహ్వానం పలికిన విషయం తెలిసిందే.

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   an hour ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   5 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   7 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   8 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   9 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   a day ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle