newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

డేటా సామ్రాజ్యవాదాన్ని సహించం.. ఐటీ మంత్రి స్పష్టీకరణ

08-11-201908-11-2019 14:08:48 IST
2019-11-08T08:38:48.485Z08-11-2019 2019-11-08T08:38:38.206Z - - 19-11-2019

డేటా సామ్రాజ్యవాదాన్ని సహించం.. ఐటీ మంత్రి స్పష్టీకరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వాట్సాప్‌లో భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించి ఇజ్రాయెల్ స్పైవేర్ సంస్థ చేసిన నిర్వాకం ఫలితంగా కోట్లాది మంది భారతీయుల వాట్సాప్ ఖాతాలు చోరీకి గురైన నేపథ్యంలో కేంద్రప్రభుత్వం డేటా చౌర్యం పట్ల సీరియస్‌గా దృష్టి పెడుతోంది. దేశ పౌరుల గోప్యతను ప్రత్యేకించి సమాచార సంబంధమైన గోప్యతకు భద్రత కల్పించడంలో కఠినంగా వ్యవహరిస్తామని, డేటా సామ్రాజ్యవాదాన్ని సహించబోమని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.

కొలంబోలో జరుగుతున్న కామన్వెల్త్ న్యాయశాఖ మంత్రుల సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన రవిశంకర్ ప్రసాద్ డేటా రక్షణకు సంబంధించి భారత ప్రభుత్వవైఖరిని సదస్సుకు వివరించారు. మనం ఇప్పుడు సమాచార సాంకేతికతా యుగంలో జీవిస్తున్నాం. డిజిటల్ ఎకానమీ ప్రక్రియలో డేటా అత్యంత కీలకపాత్ర పోషించబోతోంది. గోప్యతను భారత్ సీరియస్‌గా పరిగణిస్తోంది. సమాచార గోప్యత దాంట్లో అంతర్గత అంశమే. ఒక వ్యక్తి తన వివరాలకు సంబంధించిన డేటాపై ఆజమాయిషీ కలిగి ఉండాలి. దాన్ని ఎవరూ వాణిజ్య ప్రయోజనాలకు వాడుకోకూడదు అని మంత్రి చెప్పారు.

భారతీయ డేటా చట్టాల పరిణామ క్రమాన్ని, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను, ప్రజలతో జరిపిన చర్చలను మంత్రి సదస్సుకు వివరించారు. పార్లమెంటులో త్వరలో డేటాభద్రత, గోప్యతా పరిరక్షణకు సంబంధించిన త్వరలో బిల్లు ప్రవేశపెడుతున్నామని ఐటీ మంత్రి చెప్పారు. 

డేటా రక్షణ చట్టం ఏదైనా సరే  వ్యక్తుల స్వేచ్చాయుత అంగీకారం ఉండాలని. అనుమతించిన పరిధులకు మించి ప్రజల సమ్మతిని ఎవరూ దుర్వినియోగం చేయకూడదు. డేటా ప్రాసెసింగ్‌లో న్యాయబద్ధమైన యంత్రాంగం ఉండాలి. ముఖ్యంగా గోప్యతకు సంబంధించి సృజనాత్మకత, వ్యాపారం మధ్య సమతూకం పాటించాలని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.

అభివృద్ది చెందుతున్న, వర్ధమాన దేశాల్లో విస్తారమైన పరిణామంలో డేటా తయారవుతోందని, కానీ దాని ప్రాసెసింగ్ మాత్రం అభివృద్ధి చెందిన ప్రపంచంలోనే జరుగుతోందని ఇలాంటి డేటా గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి హెచ్చరించారు.

మానవసమాజం మొత్తంగా తయారు చేస్తున్న డేటాపై కొన్ని కంపెనీలు లేక కొన్ని దేశాలు గుత్తాధిపత్యం వహించడాన్ని డేటా సామ్రాజ్యవాదం అనే చెప్పాల్సి ఉంటుందని దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించకూడదని ఐటీమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేసారు.

డిజిటల్ ఇండియా, ప్రత్యక్ష నగదు పంపిణీ, డిజిటల్ ఇన్‌‌క్లూజన్ అనేవి భారతప్రభుత్వం చేపడుతున్న సృజనాత్మక ఆవిష్కరణలని మంత్రి చెప్పారు

 

సియాచిన్‌లో మంచు తుపాను బీభత్సం..ఆరుగురు సైనికులు మృతి

సియాచిన్‌లో మంచు తుపాను బీభత్సం..ఆరుగురు సైనికులు మృతి

   8 hours ago


 పరిశ్రమల్లో భయం.. పౌరుల్లో అవిశ్వాసమే కారణం: మన్మోహన్ సింగ్

పరిశ్రమల్లో భయం.. పౌరుల్లో అవిశ్వాసమే కారణం: మన్మోహన్ సింగ్

   8 hours ago


సుప్రీంకోర్టు 47వ చీఫ్ జస్టిస్‌గా అరవింద్ బాబ్డే ప్రమాణం

సుప్రీంకోర్టు 47వ చీఫ్ జస్టిస్‌గా అరవింద్ బాబ్డే ప్రమాణం

   18-11-2019


ఢిల్లీ  జేఎన్‌యూ దగ్గర ఉద్రిక్తత.. 144 సెక్షన్ అమలు

ఢిల్లీ జేఎన్‌యూ దగ్గర ఉద్రిక్తత.. 144 సెక్షన్ అమలు

   18-11-2019


ఎయిర్ ఇండియాను అమ్మేస్తాం.. టెలికాంని ఉద్ధరిస్తాం : నిర్మలా సీతారామన్

ఎయిర్ ఇండియాను అమ్మేస్తాం.. టెలికాంని ఉద్ధరిస్తాం : నిర్మలా సీతారామన్

   18-11-2019


శ్రీలంక అధ్యక్షుడిగా.. ఎల్టీటీఈని నిర్మూలించిన గోటబయ రాజపక్స

శ్రీలంక అధ్యక్షుడిగా.. ఎల్టీటీఈని నిర్మూలించిన గోటబయ రాజపక్స

   18-11-2019


వాడివేడిగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

వాడివేడిగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

   18-11-2019


అయోధ్య తీర్పుపై రివ్యూ... ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం

అయోధ్య తీర్పుపై రివ్యూ... ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం

   18-11-2019


 21 రాష్ట్రాల రాజధానుల్లో కుళాయి నీళ్లు కల్తీ: కేంద్రం షాకింగ్ రిపోర్ట్

21 రాష్ట్రాల రాజధానుల్లో కుళాయి నీళ్లు కల్తీ: కేంద్రం షాకింగ్ రిపోర్ట్

   17-11-2019


దంతాలు పాడైతే గగన్‌యాన్‌కు అనర్హులే..

దంతాలు పాడైతే గగన్‌యాన్‌కు అనర్హులే..

   16-11-2019


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle