newssting
BITING NEWS :
* శనివారం మధ్యాహ్నమే కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్ని రేపటికి ప్రీ పోన్ చేసిన ఏపీ సర్కార్ *కాకినాడలో దారుణం..రేచర్లపేటలో నాలుగేళ్ల చిన్నారి మీద అత్యాచారం..చిన్నారి మీద అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు మైనర్లు *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం*ఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్*ఆస్తుల కేసులో హాజరుకాలేనని సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్ పిటిషన్... విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. ఈ రోజు హాజరుపై సీఎం జగన్‌కు మినహాయింపు ఇచ్చిన సీబీఐ కోర్టు*అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *అమరావతిలో 31వ రోజుకు చేరిన ఆందోళన.. లోకేష్ బైక్ ర్యాలీ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు * టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే

డాక్టర్లకు యువతుల ఎర.. మోడీ ఆగ్రహం!

15-01-202015-01-2020 11:05:12 IST
2020-01-15T05:35:12.357Z15-01-2020 2020-01-15T05:35:03.576Z - - 17-01-2020

డాక్టర్లకు యువతుల ఎర.. మోడీ ఆగ్రహం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దాదాపుగా అన్ని ప్రముఖ ఫార్మా కంపెనీల దగ్గర నుండి నిన్న మొన్న పుట్టుకొచ్చిన కంపెనీల వరకు అందరూ ఆ రంగాన్ని దాదాపుగా వ్యాపారంగానే చూస్తారు. ఓ మనిషికి ఆయువునిచ్చే మందుల తయారీ తమ బాధ్యతగా భావించే కంపెనీలు చాలా అరుదుగానే ఉన్నాయి అని చెప్పుకోవాలి. కొత్త కంపెనీలు.. ప్రముఖ కంపీనీలతో పోటీ పడాలని భావించే కంపెనీలు వారి సేల్స్ రిప్రజెంట్స్ కి టార్గెట్స్ ఇచ్చి మార్కెట్ మీదకి వదులుతారు.

రిప్రజెంట్స్ వైద్యుల దగ్గరకి వెళ్లి వాళ్ళకి తమ కంపెనీ మందులను ప్రిఫర్ చేస్తే వాళ్ళకి ఇచ్చే కమిషన్ తో పాటు సాంపిల్స్.. విదేశీ యాత్రలను కూడా బోనస్ గా ఇస్తారు. ఇదంతా ఆ రంగంలో షరా మామూలుగా జరిగిపోతుంది. అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని కొత్త కంపెనీలు మరో అడుగు ముందుకేసి వైద్యులకు వీకెండ్ పార్టీలు.. బడా హాస్పటిల్స్ వైద్యులకు కాల్ గర్ల్స్ కూడా సరఫరా చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

ప్రతి నెలా వైద్యులు తమ కంపెనీ మందులకి సంబంధించి టార్గెట్స్ పూర్తి చేస్తే వారికి బోనస్.. సాంపిల్స్ తో పాటు విదేశీ యాత్రలు అక్కడ కాల్ గర్ల్స్ ను ఏర్పాటు చేసి తమ మార్కెట్స్ పెంచుకుంటున్నారని సాథీ అనే ప్రభుత్వేతర సంస్థ తాజాగా నివేదిక విడుదల చేసింది. అందులో ప్రైవేట్ రంగంలో మెడికల్ దోపిడీ ఎలా ఉంటుంది.. ప్రస్తుత ఫార్మా పరిస్థితితులపై పూర్తి వివరాలను విడుదల చేసింది.

ఈ నివేదిక విడుదలైన తర్వాత ముఖ్యమైన ఫార్మా కంపెనీలతో పీఎంవో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ.. వైద్యులను లోబర్చుకుని వారిచేత తమ మందులకు ప్రిస్క్రిప్షన్ రాయించుకుంటున్న వైనంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టర్లకు యువతులను ఎరవేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇకపై వైద్యులను విదేశీ విలాస యాత్రలకు పంపుతూ, ఖరీదైన వస్తువులను బహుమతులుగా ఇచ్చే సంప్రదాయాలను మానుకోండని ఫార్మా కంపెనీలకు హితవు పలికారు. మోడీతో ఈ సమావేశంలో జైడస్‌ కాడిలా, టోరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌, వోక్‌హార్ట్‌, అపోలో సహా అనేక ప్రముఖ మందుల తయారీ, విక్రయ కంపెనీలు ఉండగా ప్రధాని వారిని తీవ్రంగా హెచ్చరించారు.

ఇకనైనా మార్కెటింగ్‌లో నీతి, విలువలు పాటించండి. లేదంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. తీవ్రమైన చట్టాలు చేస్తాం తీవ్ర స్వరంతో హెచ్చరించారు. మరోవైపు ఫార్మా కంపెనీలతో పాటు వ్యవసాయ రసాయనాలు, పురుగు మందుల కంపెనీలు కూడా ఇదే బాటలో ఉన్నాయని.. దీనిపై సమగ్రనివేదికతో పాటు చర్యలకు ఆదేశించినట్లుగా తెలుస్తుంది. మరి కంపెనీలు ఎంతవరకు ఈ ఆజ్ఞలను, హెచ్చరికలను పరిగణలోకి తీసుకుంటాయో వేచి చూడాల్సి ఉంది.

 

 

నిర్భయ నిందితులకు రాష్ట్రపతి షాక్.. క్షమాభిక్ష పిటిషన్ డిస్మిస్

నిర్భయ నిందితులకు రాష్ట్రపతి షాక్.. క్షమాభిక్ష పిటిషన్ డిస్మిస్

   6 hours ago


ఇస్రో కీర్తిపతాక.. జీశాట్-30 ప్రయోగం విజయవంతం

ఇస్రో కీర్తిపతాక.. జీశాట్-30 ప్రయోగం విజయవంతం

   11 hours ago


కాశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం... ఐదుగురి అరెస్ట్

కాశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం... ఐదుగురి అరెస్ట్

   12 hours ago


గాంధీకి బదులు లక్ష్మీదేవి.. స్వామి సలహాను మోడీ పాటిస్తారా?

గాంధీకి బదులు లక్ష్మీదేవి.. స్వామి సలహాను మోడీ పాటిస్తారా?

   16-01-2020


బ్రేకింగ్: నిర్భయ కేసులో కీలక మలుపు.. నలుగురి ఉరికి లైన్ క్లియర్

బ్రేకింగ్: నిర్భయ కేసులో కీలక మలుపు.. నలుగురి ఉరికి లైన్ క్లియర్

   14-01-2020


సీఏఏ‌పై సత్య నాదెళ్ళ.. చట్టం బాధాకరం అంటూ కామెంట్స్

సీఏఏ‌పై సత్య నాదెళ్ళ.. చట్టం బాధాకరం అంటూ కామెంట్స్

   14-01-2020


ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

   14-01-2020


భారత వృద్ధిరేటు 5 శాతమేనా.. నివ్వెరపరుస్తున్న నిప్పులాంటి నిజాలు

భారత వృద్ధిరేటు 5 శాతమేనా.. నివ్వెరపరుస్తున్న నిప్పులాంటి నిజాలు

   13-01-2020


యువత ఉసురు తీస్తున్న నిరుద్యోగం, ఆర్థికమాంద్యమే కారణమా?

యువత ఉసురు తీస్తున్న నిరుద్యోగం, ఆర్థికమాంద్యమే కారణమా?

   13-01-2020


ఢిల్లీలో ఉగ్రకలకలం.. ముగ్గురు అరెస్ట్

ఢిల్లీలో ఉగ్రకలకలం.. ముగ్గురు అరెస్ట్

   09-01-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle