newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

ట్విట్టర్ ఖాతాతో క్యాంపెయిన్ కూత

11-02-201911-02-2019 16:27:45 IST
2019-02-11T10:57:45.317Z11-02-2019 2019-02-11T10:57:43.310Z - - 21-08-2019

ట్విట్టర్ ఖాతాతో క్యాంపెయిన్ కూత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ప్రియాంకగాంధీని ప్రకటించినప్పుడు దేశవ్యాప్తంగా వ్యంగ్యాస్త్రాలొచ్చాయి. పాలిటిక్స్ గురించి ఏమాత్రం జ్ఞానం లేని ప్రియాంకను స్పెషల్ ఎట్రాక్షన్ కోసమే రంగంలోకి దించారని, అంతే తప్ప ఆమె వల్ల ఒరిగేదేమీ లేదని కామెంట్స్ వచ్చాయి. సినిమాల్లో క్యామియో రోల్‌లాగా కాంగ్రెస్‌లో ఆమె పాత్ర నామమాత్రంగానే ఉంటుందని, ఫక్తు పొలిటీషియన్‌లా నిత్యం యాక్టివ్‌గా ఉండదని వాదనలూ వినిపించాయి.

అయితే... ఇప్పుడా విమర్శకుల నోళ్ళు మూసుకుపోయేలా ప్రియాంకాగాంధీ తన రాజకీయ ప్రస్థానాన్ని అనూహ్యంగా ప్రారంభించారు. తన సోదరుడు రాహుల్‌గాంధీతో కలిసి లక్నోలో రోడ్‌షో నిర్వహించిన ఆమె ప్రజలతో మమేకయ్యారు. అంతేకాదు... వారితో నిత్యం టచ్‌లో ఉండేందుకు సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లోనూ ఖాతా తెరిచారు. ప్రజలు, కార్యకర్తలతో మమేకం అయ్యేందుకు ఇదో సులువైన మార్గం. దాదాపు పార్టీలన్నీ ఈ ‘పిట్ట’ మార్గం ద్వారానే తమ పొలిటికల్ పంథాలు కొనసాగిస్తున్నాయి.

ప్రియాంక ట్విట్టర్‌లోకి అడుగిడటమే ఆలస్యం... కొన్ని గంటల వ్యవధిలోనే వేలాదిమంది ఫాలోవర్స్ వచ్చేశారు. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి 60 వేలకుపైగా ఫాలోవర్స్ రావడం విశేషం! ఆరంభమైతే అదిరిగింది కానీ... ప్రియాంక తన జోరు ఇలాగే కొనసాగిస్తారా? లేక మూణ్ణాళ్ళ ముచ్చట అన్న చందంగా కొన్నిరోజులకే చతికిలపడతారా? వేచి చూడాల్సిందే!


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle