newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్‌.. తిప్పికొట్టిన సంస్థ సీఈఓ

29-05-202029-05-2020 16:36:57 IST
Updated On 29-05-2020 18:55:48 ISTUpdated On 29-05-20202020-05-29T11:06:57.973Z29-05-2020 2020-05-29T11:06:55.889Z - 2020-05-29T13:25:48.751Z - 29-05-2020

ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్‌.. తిప్పికొట్టిన సంస్థ సీఈఓ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచి మీడియాపై ఉరుముతున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాజాగా సోషల్ మీడియా కింగ్ ట్విట్టర్‌పై విరుచుకుపడ్డారు. తాను చేసిన ట్వీట్లలో నిజానిజాలు ఏమిటో నిర్దారించుకోవాలని ట్విట్టర్ యాజమాన్యం ఆ ట్వీట్లకు ట్యాగ్ తగిలించడంతో ట్రంప్ ఆగ్రహంతో ఊగిపోయారు. ట్విట్టర్‌తోపాటు సోషల్ మీడియాను నియంత్రిస్తాం, లేదంటే మూసిపారేస్తాం అంటూ బెదిరింపు ధోరణితో తాజాగా ట్వీట్ చేశాడు.  ‘వాళ్లు మా గొంతు నొక్కేస్తున్నారు. భారీ చర్య కోసం ఎదురు చూడండి’ అని మరో ట్వీట్‌చేశారు. 

సామాజిక మాధ్యమం ట్విట్టర్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కోపం తగ్గలేదు. తన ట్వీట్లలో నిజానిజాలు నిర్ధారించుకోవాలని ట్విట్టర్‌.. ఆ ట్వీట్లకు ట్యాగ్‌ తగలించడంతో ట్రంప్‌ మండిపడటం తెల్సిందే. ‘వాటిని (ట్విట్టర్‌) నియంత్రిస్తాం. లేదంటే మూసేస్తాం’ అని తాజాగా ట్వీట్‌చేశారు. 

కాగా, సామాజిక మాధ్యమాలకు సంబంధించి అధ్యక్షుడు ఒక ఎగ్జిక్యుటివ్‌ ఆర్డర్‌పై సంతకం పెట్టనున్నారని వైట్‌హౌస్‌ పత్రికా కార్యదర్శి కైల్‌ మెకీనాని చెప్పారు. ఏ రకమైన ఆదేశాలు జారీ చేస్తారన్న అంశంసై స్పష్టత లేదు. గురువారంకల్లా ట్రంప్‌ సంతకం పెడతారని తెలుస్తోంది. 

బెదిరింపులకు వణికిపోం.. ట్విట్టర్ సీఈఓ

ట్విట్టర్‌ను అమెరికాలో మూసివేయడానికి గల  అవకాశాలను పరిశీలించాల్సిందిగా ట్రంప్ సమాచార ప్రసార విభాగాలను ఆదేశించే అవకాశముందని కూడా నిపుణులు చెప్పారు. కాగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించిన తప్పుడు లేక వివాదాస్పద సమాచారంపై తమ సంస్థ ధోరణి నుంచి వైదొలిగి ఛాన్సేలేదని ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే తేల్చిచెప్పారు. పైగా ఈ వివాదానికి సంబంధించి తమ సంస్థ ఉద్యోగులను వారి మానానా వారిని వదిలేయాలని ట్రంప్ కు సలహా కూడా ఇచ్చారు.

సత్యాన్ని తేల్చిపడేసే మధ్యవర్తులం కాము. ఎన్నికల సమయంలో రాజకీయ నేతల ప్రకటనల్లోని లోపాలను, తప్పులను ఎత్తిచూపి వాటిపై ప్రజలే నిర్ణయించుకునేలా చేయడమే తమ ఉద్దేశమని, మానుంచి యూజర్లు పారదర్శకతను మాత్రమే కోరుకుంటారని అందుకే మా ప్రతి చర్యకూ నిర్దిష్టమైన ఉద్దేశాలు ఉంటాయని గమనించాలని ట్విట్టర్ సీఈవో పేర్కొన్నారు.

సత్యాన్ని నిగ్గుదేల్చడమే మాపని. ఒక సంస్థగా మా ప్రతి చర్యకూ మేం జవాబుదారీతనం వహిస్తాం. నాతో సహా దీన్ని అందరం పాటిస్తాం. దయచేసి మా ఉద్యోగులను తమ పని తాము చేసుకోనివ్వండి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల సమయంలో వస్తున్న ప్రతి తప్పు సమాచారాన్ని, వివాదాస్పద అంశాను మేం ఎత్తి చూపుతూనే ఉంటాం. ఈ క్రమంలో మానుంచి ఏదైనా తప్పు జరిగితే శషభిషలు లేకుండా వాటిని అంగీకరిస్తాం అని ట్విట్టర్ సీఈఓ చెప్పారు.

ఈ నవంబర్‌లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మెయిల్ ద్వారా ఓటింగ్‌కు ఎక్కువ అవకాశాలు కల్పిస్తే అది రిగ్గింగుకు దారితీసే ప్రమాదముందని రెండు రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశాడు. అయితే ఎన్నికల్లో దీనివల్ల రిగ్గింగ్ జరిగే అవకాశంపై ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందున మెయిల్ ఇన్ బ్యాలట్స్‌ గురించిన వాస్తవాలను నిర్ధారించుకోవాల్సిందిగా ట్విట్టర్ అమెరికా అధ్యక్షుడి ట్వీట్‌కు ట్యాగ్ చేసింది. 

అసలే మీడియా తనపై చేస్తున్న చెడుప్రచారం గురించి కాకమీద ఉన్న డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ తన ట్వీట్‌నే అనుమానించడంతో రగిలిపోయాడు. ఒకరకంగా ట్విట్టర్ ట్రంప్‌ను చెంపదెబ్బ కొట్టినట్లే. దానికి తట్టుకోలేకే ట్రంప్ ట్విట్టర్ పనిపడతానని హెచ్చరించారు.

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   4 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   7 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   20 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle