newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ట్రంప్ వింత సలహా షాక్ లో డాక్టర్లు

25-04-202025-04-2020 11:29:35 IST
Updated On 25-04-2020 11:40:49 ISTUpdated On 25-04-20202020-04-25T05:59:35.904Z25-04-2020 2020-04-25T05:59:33.596Z - 2020-04-25T06:10:49.940Z - 25-04-2020

ట్రంప్ వింత సలహా షాక్ లో డాక్టర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోవిడ్‌–19 అమెరికాను అతలాకుతలం చేస్తూ ఉంటే చేష్టలుడిగి చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అత్యంత ప్రమాదకర సలహాలు ఇవ్వడానికీ వెనుకాడటం లేదు. అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ తాజా అధ్యయనంలో సూర్యరశ్మి, గాలితో తేమ కరోనా వైరస్‌ను చంపేస్తుందని తేలింది. దీంతో ట్రంప్‌ కోవిడ్‌ రోగులకు వైరస్‌ను నాశనం చేసే రసాయనాలు ఇంజెక్ట్‌ చేయాలని, అతినీలలోహిత కిరణాలను రోగుల శరీరంలోకి పంపించి వైరస్‌ను చంపాలని సలహా ఇచ్చారు. 

ఏరకంగా చూసినా ట్రంప్ చేసినవి అనాలోచిత వ్యాఖ్యలేనని అమెరికన్ మీడియా దుయ్యబడుతోంది. కాగా తన వ్యాఖ్యలపై వస్తున్న దుమారం చూసిన తర్వాత తాను కేవలం వ్యగ్యంగా మాత్రమే అలా వ్యాఖ్యానించాను తప్పితే మీడియానే తమ మాటలను వక్రీకరించిందని ట్రంప్ పాత్రికేయులపైనే బండ వేశారు

వైట్‌‌హౌస్‌లో రెండు రోజుల క్రితం జరిగిన  విలేకరుల సమావేశంలో హోంల్యాండ్‌ సెక్యూరిటీ చేసిన అధ్యయనం ఫలితాలను ఆ శాఖ సహాయ మంత్రి బిల్‌ బ్రయాన్‌ వెల్లడించిన వెంటనే ట్రంప్‌ ఒక్కసారిగా రంగంమీదికి వచ్చారు. కోవిడ్‌ రోగుల్లోకి వైరస్‌ను చంపేసే రసాయనాలు ఇంజెక్ట్‌ చేయాలని సలహా ఇచ్చారు. 

‘రసాయనాలు, ఎండ తీవ్రతకి వైరస్‌ కేవలం నిముషంలోనే చచ్చిపోవడం చూస్తున్నాం. కోవిడ్‌ రోగుల ఊపిరి తిత్తుల్లోకి అల్ట్రావయోలెట్‌ కిరణాల్ని పంపించి చంపలేమా అది ఎలా చేయాలో ఆలోచించండి’అంటూ వ్యాఖ్యానించడం అందరినీ విస్మయంలోకి నెట్టేసింది.  

ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయనపై విమర్శలు కూడా అదే స్థాయిలో వెల్లువెత్తాయి. రోగుల ప్రాణాలతో ఆడుకునే అలాంటి ప్రమాదకరమైన సలహాలు పాటించవద్దంటూ ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు.

ఈ మొత్తం వివాదానికి మూలమైన వివరాల్లోకి వెళితే.. ప్రపంచ ప్రజలకు భయకంపితుల్ని చేస్తున్న కరోనా వైరస్, సూర్య కిరణాలకు కొన్ని క్షణాల్లో నశించిపోతుందని ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సైన్స్‌ అండ్‌ సెక్యురిటీ’ ఓ అధ్యయనంలో కనుగొంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అడ్వైజర్‌ విలియం బ్య్రాన్‌ గురువారం రాత్రి వైట్‌హౌజ్‌ వద్ద అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 

అల్ట్రావయొలెట్‌ కాంతితో రేడియేషన్‌ ప్రసరింప చేయడం వల్ల కరోనా వైరస్‌లో జన్యువులు నశించి పోయాయని పర్యవసానంగా అది పునరుత్పత్తి శక్తిని కోల్పోయిందని తెలిపారు. సూర్యుడి కిరణాల్లో కూడా ఈ అల్ట్రావయొలెట్‌ కిరణాలు ఉంటాయి కనుక, వాటివల్ల కరోనా వైరస్‌ నశించి పోతుందని ఆయన చెప్పారు. ఉష్ణం, ఉక్క వల్ల కూడా వైరస్‌ నశిస్తుందని ఆయన అన్నారు. భూ ఉపరితలంపైనే కాకుండా గాలిలో ఉన్న వైరస్‌ను కూడా సూర్య కిరణాలు చంపేస్తున్నట్లు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు, శాస్త్రవిజ్ఞాన సంస్థలు నిర్ధారించాల్సి ఉంది. 

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సైన్స్‌ అండ్‌ సెక్యురిటీ సలహాదారు విలియం బ్ర్యాన్ అలా ప్రకటించారో లేదే ట్రంప్ వెంటనే అందుకుని కరోనా వైరస్‌ను అల్ట్రావయొలెట్‌ కిరణాలతో చంపేయండని పిలుపునిచ్చారు.

ట్రంప్ వ్యాఖ్యలకు బిత్తరపోయిన అమెరికన్ మీడియా తమ అధ్యక్షుడి తెంపరితనానికి, అనాలోచిత వ్యాఖ్యలను గగ్గోలు పెడుతోంది. అమెరికాలో ఎక్కడ చూసినా ట్రంప్ వ్యాఖ్యల పట్ల నవ్వులు, విమర్శలు, దూషణలు మిన్నంటుతున్నాయి. దీంతో తాను నిండా ఇరుక్కుపోయానని గ్రహించిన ట్రంప్ అడ్డం తిరుక్కున్నారు. నేనేదో వ్యంగ్యంగా, పరిహాసం ప్రాయంగా ఆ మాట అంటే మీడియా దాన్ని పట్టుకుని ఇంత మార్చి రాస్తేస్తుందా అంటూ మండిపడుతున్నారు ట్రంప్.. 

వాస్తవానికి ట్రంప్ విలేఖరితో అలా మాట్లాడలేదు.హోమ్ లాండ్ సెక్యూరిటీ విభాగాధిపతి బిల్ బ్రియాన్‌ను ఉద్దేశించి ట్రంప్ అలా ప్రశ్నించాడు. తీరా పరువుపోయాక తాను వ్యగ్యంగా విలేఖరితో అలా మాట్లాడానని, మీడియా దాన్ని పట్టుకుని ఇంతగా కథ అల్లేసిందని ట్రంప్ వాదిస్తున్నారు.

ఒకసారి ట్రంప్ మొహాన్ని, ఆయా సందర్భాల్లో అనవసర వ్యాఖ్యలు చేసి అభాసుపాలవుతున్న ట్రంప్ వ్యవహారాన్ని చూస్తే మనకు గిరీశం గుర్తుకు రావడం లేదా.. నూట పాతికేళ్ల క్రితం గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకంలో కింద పడినా తనదే పైచేయి అని ప్రతిసారీ సమర్థించుకునే గిరీశం పాత్రధారిని  నేడు ట్రంప్ గుర్తు చేయడం లేదా..

మరోవైపున అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ శుక్రవారం విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం 50వేల మరణాలు దాటాయి. గత 24 గంటల్లోనే 3,176 మంది మరణించినట్లు తెలిపింది. ప్రపంచంలోకెల్లా అత్యధిక మరణాలు నమోదైన దేశం అమెరికానే కావడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో మూడొంతుల్లో ఒక వంతు అగ్రరాజ్యంలోనే ఉన్నాయి.

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   6 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   9 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   a day ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle