newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

ట్రంప్ రూల్‌కి బ్రేక్.. భారతీయ విద్యార్ధులకు రిలీఫ్

15-07-202015-07-2020 10:19:08 IST
Updated On 15-07-2020 12:18:17 ISTUpdated On 15-07-20202020-07-15T04:49:08.214Z15-07-2020 2020-07-15T04:48:28.674Z - 2020-07-15T06:48:17.004Z - 15-07-2020

ట్రంప్ రూల్‌కి బ్రేక్.. భారతీయ విద్యార్ధులకు రిలీఫ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిక్క శంకరయ్యలాంటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన వివాదాస్పద నిర్ణయాలతో అందరినీ టెన్షన్ పెడతాడు. తాజాగా భారతీయ విద్యార్ధుల గుండెల్లో రైళ్ళు పరిగెట్టించారు ట్రంప్. ఒక వైపు కరోనాతో బయటకు వెళ్ళాలంటేనే జనం భయపడిపోతున్న వేళ ట్రంప్ ఆన్ లైన్ తరగతులకు హాజరయ్యేవారికి పిడుగులాంటి వార్త వినిపించారు. ఆన్‌లైన్ ద్వారా క్లాసుల‌కు హాజ‌రవుతున్న విదేశీ విద్యార్థుల వీసాల‌ను ర‌ద్దు చేయాల‌ని జూలై 6వ తేదీన అమెరికా ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో లక్షలాదిమంది విదేశీ విద్యార్ధులు టెన్షన్ పడ్డారు. అయితే ట్రంప్ స‌ర్కార్ ఇప్పుడు ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంది. 

ఈ నిర్ణయంపట్ల దేశ‌వ్యాప్తంగా విద్యాసంస్థ‌ల నుంచి ఆందోళ‌న‌లు వ్య‌క్తం అయ్యాయి. దీంతో అమెరికా ప్ర‌భుత్వం వివాదాస్పద వీసా విధానాన్ని ర‌ద్దు చేసింది. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో చాలా వ‌ర‌కు విద్యాసంస్థ‌లు ఆన్‌లైన్ పాఠాల‌కు మొగ్గుచూపుతున్నాయి. ప్రపంచమే ఈ విధానాన్ని ఆచరిస్తున్నవేళ ట్రంప్ మొండి వైఖరి ప్రదర్శించారు. ట్రంప్ స‌ర్కార్ ఓ కీల‌క ఆదేశం జారీ చేసింది.  ఆన్‌లైన్ పాఠాలు వింటున్న విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల‌ని ఆదేశించింది. ట్రంప్ ప్ర‌భుత్వం తీసుకున్న ఆ నిర్ణ‌యం ప‌ట్ల హార్వ‌ర్డ్‌, మ‌సాచుసెట్స్‌ యూనివ‌ర్సిటీలు.. కోర్టులో దావా వేశాయి.

అమెరికా ఇమ్మిగ్రేష‌న్‌, క‌స్ట‌మ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ)పై కేసును ఫైల్ చేశాయి. ఈ నేప‌థ్యంలో త‌మ నిర్ణ‌యాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాలంటూ ఐసీఈ జారీ చేసిన ఆదేశాల‌ను త‌క్ష‌ణ‌మే నిలిపివేయాల‌ని హార్వ‌ర్డ్‌, మిట్ వ‌ర్సిటీలు కోర్టును కోరాయి. ప్రభుత్వం నిర్ణ‌యం వ‌ల్ల విద్యార్థులు వ్య‌క్తిగ‌తంగా, ఆర్థికంగా దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంద‌ని వ‌ర్సిటీలు త‌మ పిటిష‌న్‌లో ఆరోపించాయి. దీంతో ట్రంప్ స‌ర్కార్ వెన‌క్కి త‌గ్గ‌డం.. ఒక‌ర‌కంగా భార‌తీయ విద్యార్థుల‌కు రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. 

రాబోయే విద్యా సంవత్సరానికి పూర్తి స్థాయిలో  ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించేందుకు నిర్ణయించిన స్కూళ్లలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు షాకిచ్చింది.వీరికి  వీసాలు జారీచేయడం లేదని, అలాంటి వారిని యూఎస్‌ కస్టమ్స్‌ అండ్‌ బార్డర్‌ ప్రొటెక్షన్‌ దేశంలోకి అనుమతించరన్నారు. నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా కింద అమెరికాలో వున్న విదేశీ విద్యార్ధులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాల్సి వుంటుంది. వీరికి జారీచేసిన ఎఫ్‌-1 ఎం-1-తాత్కాలిక  వీసాలు తీసుకుని అమెరికాలో ఉండి ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్న వాళ్లు దేశం విడిచి వెళ్లాలని ట్రంప్ గతంలో ఆదేశాలిచ్చారు. 

విదేశీ విద్యార్ధులకు అమెరికా షాక్.. తిరిగి రావాల్సిందేనా?

 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   4 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   12 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   13 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle