newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ట్రంప్ పని అయిపోయిందా? అభిశంసనకు ఓకె

19-12-201919-12-2019 09:29:41 IST
Updated On 19-12-2019 11:19:33 ISTUpdated On 19-12-20192019-12-19T03:59:41.192Z19-12-2019 2019-12-19T03:59:35.743Z - 2019-12-19T05:49:33.854Z - 19-12-2019

ట్రంప్ పని అయిపోయిందా? అభిశంసనకు ఓకె
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పని అయిపోయిందా?

 ఆయనపై అభిశంసన వెనుక ఏం జరుగుతోంది?

సెనేట్‌లో ఆయనకు ఉపశమనం కలుగుతుందా? 

అభిశంసన తగిలిన నాలుగో అధ్యక్షుడు ట్రంప్ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అధ్యాయం త్వరలో ముగిసిపోయే అవకాశాలున్నాయి. ట్రంప్ కి అభిశంసన షాక్ తగిలింది. యూఎస్ దిగువ సభలో ట్రంప్‌పై అభిశంసనకు ఓటింగ్ జరిగింది. దిగువ సభలో 230 ఓట్లు ఇందుకు అనుకూలంగా పడగా.. 197 ఓట్లు ప్రతికూలంగా పడ్డాయి. అభిశంసనను ఎదుర్కొంటున్న మూడో అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అయితే సెనేట్‌లో ఆయనకు ఎదురుగాలి వీయకపోవచ్చు. ఆ సభలో రిపబ్లికన్లదే మెజార్టీ. దిగువ సభ చైర్ పర్సన్ పెలోసీ ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రతిపాదించారు.

సెనేట్ లో అభిశంసన తీర్మానం ఆమోదం పొందితేనే ట్రంప్ కు ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే అలాంటి పరిస్థితి రాకపోవచ్చు అంటున్నారు. వచ్చే నెలలో ఈతీర్మానం ఓటింగ్ కు రానుంది. ఇదిలా ఉంటే.. తనపై అభిశంసన తీర్మానం ప్రక్రియను నిలిపివేయాలంటూ ట్రంప్ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్పీ పెలోసికి లేఖ రాయడం హాట్ టాపిక్ అవుతోంది. డెమోక్రటిక్ సభ్యుల తీరుపై ఆయన మండిపడ్డారు. రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేయడమే అంటున్నారు. 

''మీరు అమెరికా ప్రజాస్వామ్యం మీద బహిరంగ యుద్ధం ప్రకటించారు. చాలా అసహ్యకరమైన 'అభిశంసన' అనే పదం ప్రాధాన్యాన్ని చాలా చౌకబారుగా మార్చారు'' అని ఆ లేఖలో పెలోసీని నిందించారు. ఈ అభిశంసన మొదలైనప్పటి నుంచీ నాకున్న కనీస రాజ్యాంగబద్ధ హక్కులను కాలరాశారు. సాక్ష్యం ఇచ్చే హక్కు సహా రాజ్యాంగం కల్పించిన అత్యంత ప్రాథమిక హక్కులనూ నాకు నిరాకరించారు'' అని ట్రంప్ లేఖలో ఆరోపించారు.

తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉక్రెయిన్ మీద ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలకు సంబంధించి ట్రంప్ మీద ప్రతినిధుల సభ అభిశంసన విచారణ చేపట్టింది. ట్రంప్ లేఖపై నాన్సీ పెలోసీ మండిపడ్డారు .ఆమె  విలేకరులతో మాట్లాడుతూ.. ట్రంప్ తనకు రాసిన లేఖను తాను పూర్తిగా చదవలేదనీ. దాని సారాంశాన్ని చూస్తే చికాకుగా అనిపించిందని చెప్పారు.

2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్‌ నాయకుడు జోయ్‌ బైడన్‌ నుంచి ట్రంప్‌కి గట్టి పోటీ ఉందన్న వార్తల నేపథ్యంలో… బైడన్‌ను రాజకీయంగా దెబ్బ తీయడానికి ట్రంప్‌ ఉక్రెయిన్‌ సహకారాన్ని తీసుకుంటారని ఆరోపణలు వెలువెత్తాయి. బైడన్‌, ఆయన కుమారుడిపై అవినీతి కేసుల విచారణ వేగవంతం చేయాలంటూ ఉక్రెయిన్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు డెమొక్రాట్లు ఆరోపించారు.

అమెరికా చరిత్రలో అభిశంసన ప్రక్రియను ఎదుర్కొంటున్న నాలుగో అధ్యక్షుడు ట్రంప్ కావడం విశేషం. వీరిలో ఆండ్రూ జాన్సన్, బిల్ క్లింటన్ ప్రతినిధుల సభలో అభిశంసనకు గురయ్యారు. సెనేట్ దోషులుగా తేల్చకపోవడంతో వీరు పదవి కోల్పోలేదు.  రిచర్డ్ నిక్సన్ ప్రతినిధుల సభలో ఓటింగ్ జరగక ముందే 1974 ఆగస్టులో రాజీనామా చేసి వైదొలిగారు. అభిశంసన ద్వారా పదవి పోతుందనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకొన్నారు.

 

కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   9 hours ago


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   12 hours ago


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   16 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   18 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   20 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   21 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   a day ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle