newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ట్రంప్ నిర్ణ‌యం సరైనది కాదు : బిల్‌గేట్స్‌ .. నిధులు పెంచుతామన్న చైనా

16-04-202016-04-2020 08:01:52 IST
2020-04-16T02:31:52.880Z16-04-2020 2020-04-16T02:31:50.478Z - - 27-07-2021

ట్రంప్ నిర్ణ‌యం సరైనది కాదు : బిల్‌గేట్స్‌ .. నిధులు పెంచుతామన్న చైనా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని స్తంభింపచేస్తున్న సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు ఆపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి హేతువూ లేదని మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో, వితరణశీలి బిల్‌గేట్స్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ మానవాళి ఆరోగ్యమే కరోనా వైరస్ దెబ్బకు సంక్షోభంలో కూరుకుపోతున్నప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు కట్ చేయడం ఏ రకంగా చూసినా ప్రమాదకరమే అనిపిస్తోందని బిల్ గేట్స్ చెప్పారు. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో ఇలాంటి నిర్ణ‌యాలు స‌హేతుకం కాద‌ని పేర్కొన్నారు. 

క‌రోనా వ్యాధి నియంత్ర‌ణ‌కు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని, ఈ సంస్థ అవ‌స‌రం ప్ర‌పంచానికి ఎంతైనా ఉంద‌ని ట్వీట్ చేశారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అహర్నిశలూ శ్రమిస్తోందని, నిధుల కొరతతో వారి పని నిలిచిపోతే దాని స్థానాన్ని ప్రపంచంలో మరే సంస్థా పూరించలేదని గేట్స్ చెప్పారు. ప్రపంచానికి డబ్లు‌హెచ్ఓ అవసరం ఇప్పుడే మరింతగా ఉందని బిల్ గేట్స్ నొక్కి చెప్పారు.

జ‌న‌వ‌రి చివ‌ర్లో క‌రోనా వైర‌స్‌ను ప‌బ్లిక్ ఎమ‌ర్జెన్సీగా డ‌బ్యూహెచ్‌వో ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో బిల్‌, మెలిండా గేట్స్ ఫౌండేష‌న్ త‌ర‌పున 100 మిలియ‌న్ డాల‌ర్ల విరాళాన్ని బిల్‌గేట్స్ ప్ర‌క‌టించింది. ఇంత భారీ మొత్తం విరాళాన్ని ప్ర‌క‌టించడం ఇది మొద‌టిసారేం కాదు. గ‌తంలోనూ చైనాలో క్ష‌య వ్యాధి నియంత్ర‌ణ‌కు 10 మిలియ‌న్ డాల‌ర్ల విరాళాన్ని ప్ర‌క‌టించింది. ఇక అమెరికాలో క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్ అమ‌లు చేయాలంటూ బిల్‌గేట్స్ స‌హా ప‌లువురు నిష్ణాతులు కోరినా ట్రంప్ అవేమీ ప‌ట్టించుకోలేదు. ఫ‌లితం అమెరికాలో క‌రోనా క‌రాళ నృత్యం చేస్తూ ప్ర‌జ‌ల‌ను అల్లాడిస్తోంది.

అయితే కోవిడ్‌ సంక్షోభంలో చిక్కుకొని ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకి వచ్చే నిధుల్ని నిలిపివేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్‌పై పోరాటంలో చురుకైన పాత్ర పోషిస్తున్న డబ్ల్యూహెచ్‌ఓకి ఇలాంటి సమయంలో నిధుల్ని ఆపేయడం సరైంది కాదని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరాస్‌ అన్నారు.   ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధుల్ని ఆపేస్తే దాని ప్రభావం అందరి మీద  పడుతుందన్నారు. ప్రపంచదేశాలన్నీ ఐక్యమత్యంగా ఉంటూ రాబోయే విపత్తును ఎదుర్కోవాల్సిన తరుణంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని అన్నారు.

అయితే తన నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమర్థించుకున్నారు. ప్రతి ఏడాది అమెరికా 50 కోట్ల డాలర్ల నిధుల్ని డబ్ల్యూహెచ్‌ఓకి కేటాయిస్తోంది కానీ ఆ సంస్థ చైనాకి కొమ్ముకాస్తూ ప్రపంచదేశాలను ముప్పులో పడేసిందని ట్రంప్‌ ఆరోపించారు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థకి విడుదల చేసే నిధుల్ని వెంటనే ఆపేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నాను’ అని ట్రంప్‌ వెల్లడించారు. ఏడాదికి 400 నుంచి 500 మిలియన్‌ డాలర్ల చొప్పున అమెరికా డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు సమకూరుస్తోందని... కాబట్టి సంస్థ వ్యవహారశైలిపై ప్రశ్నించడం తమ కర్తవ్యంలో భాగమని పేర్కొన్నారు. కేవలం 40 మిలియన్‌ డాలర్లు లేదా అంతకన్నా తక్కువ నిధులు ఇస్తున్న చైనాకు డబ్ల్యూహెచ్‌ఓ వత్తాసు పలికి.. కరోనా గురించి నిజాలను దాచిందని ఆరోపణలు గుప్పించారు.

కాగా డ‌బ్యూహెచ్‌వోకు నిధులు నిలిపివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యంపై అమెరిక‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ స్పందించింది. ప్ర‌పంచం మొత్తం  సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ స‌మ‌యంలో ట్రంప్ నిర్ణ‌యం ప్ర‌మాద‌ర‌క‌ర‌మైనందంటూ అభిప్రాయ‌ప‌డింది. ఈ మేర‌కు డాక్ట‌ర్ ప్యాట్రిస్ హారిస్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ట్రంప్ త‌న నిర్ణ‌యాన్ని మ‌రోసారి స‌మీక్షించాలంటూ పేర్కొన్నారు.

అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థకి అమెరికా నిధుల్ని నిలిపివేయడంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలో  నిధుల్ని ఆపేస్తే, ఆ దేశంతో సహా అందరిపైనా ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. తాము ఇకపై నిధులు పెంచుతామంటూ సంకేతాలు ఇచ్చింది. ఇప్పటికే 2 కోట్ల  డాలర్లు ఇచ్చామని వెల్లడించింది. అమెరికా నిర్ణయం ప్రపంచ ఆరోగ్య సంస్థ సామర్థ్యాలను బలహీనపరిచేలా ఉంది. మహమ్మారిపై పోరులో అంతర్జాతీయంగా పరస్పర సహకారం అందించుకొనే అంశానికి విఘాతం కలిగించేలా ఉంది’’ అని చైనా అధికారి జావో లిజియన్‌ ఆరోపించారు.

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

   19 hours ago


దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

   21 hours ago


హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

   25-07-2021


పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   25-07-2021


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   24-07-2021


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle