newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

ట్రంప్ టూర్ సక్సెస్.. ఇండో-అమెరికన్ల మనసు గెలిచేనా?

26-02-202026-02-2020 14:43:25 IST
2020-02-26T09:13:25.306Z26-02-2020 2020-02-26T09:11:37.330Z - - 12-08-2020

ట్రంప్ టూర్ సక్సెస్.. ఇండో-అమెరికన్ల మనసు గెలిచేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల భారత్‌ పర్యటన ముగిసింది. రాష్ట్రపతి భవన్‌లో విందు అనంతరం ఢిల్లీ విమానాశ్రయం నుంచి అమెరికాకు ట్రంప్‌ బృందం బయలుదేరింది. భార్య మెలానియాతో కలిసి అమెరికాకు ట్రంప్‌ తిరుగు పయనమయ్యారు. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ భారత సందర్శన  నిర్దిష్ట ప్రయోజనం పునాదిగానే సాగింది. రెండు రోజుల తన భారత పర్యటనలో భారతీయుల అపూర్వ స్వాగతం, ఆతిథ్యం అందుకున్న ట్రంప్ మంగళవారం రాత్రి అమెరికా వెళ్లడానికి ముందు వచ్చే దపా ఎన్నికల్లో కూడా తనదే గెలుపు అనే గొప్ప ఆత్మవిశ్వాసంతో కనిపించారు. 

సోమవారం అహ్మదాబాద్ లోని ప్రపంచంలో అతిపెద్దదైన మొతెరా స్టేడియంలో లక్షా పాతికవేలమంది హాజరైన బహిరంగ సభలో భారతీయుల ప్రతిభా పాఠవాలను మనస్ఫూర్తిగా అభినందించిన ట్రంప్ తర్వాత సబర్మతి లోని గాంధీ ఆశ్రమాన్ని సందర్శించారు. అనంతరం ఆగ్రాలోని తాజ్ మహల్ చారిత్రక కట్టడాన్ని తన కుటుంబంతో కలిసి సందర్శించారు. 

మంగళవారం రోజు పొడవునా బిజీ షెడ్యూల్‌తో గడిపిన ట్రంప్ మొదట రాజ్ ఘాట్‌లో విశ్రమించిన మహాత్మాగాంధీ సమాధిని దర్శించి అక్కడ పూలమొక్క నాటారు. మహాత్ముడి దార్శనికత అయిన బలమైన, సార్వభౌమాధికారంతో కూడిన అద్భుతమైన భారతదేశాన్ని అమెరికన్ ప్రజలు ప్రేమిస్తారు, బలపరుస్తారు అని ట్రంప్ రాజ్ ఘాట్ లోని సందర్శకుల పుస్తకంలో రాశారు.

ఆ తర్వాత ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌కు ట్రంప్ దంపతులు తరలివెళ్లారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు ప్రదాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రధాని బృందంతో చర్చల్లో ట్రంప్ బిజీగా ఉన్నప్పుడు ప్రథమ మహిళ ఢిల్లీలోని సర్వోదయ కో ఎడ్యకేషన్ పాఠశాలను సందర్శించి అక్కడి పిల్లలతో మమేకమయ్యారు

ప్రధాని నరేంద్ర మోదీతో హైదరాబాద్‌ హౌజ్‌లో చర్చలు జరిపిన అనంతరం ట్రంప్‌.. ఢిల్లీలో ఉన్న అమెరికా ఎంబసీలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. భారత పర్యటనకు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అమెరికా నుంచి భారత్‌ కొనుగోళ్లు జరపడం మంచి విషయమని.. భారత పర్యటన విజయవంతమైందని పేర్కొన్నారు. 

ట్రంప్-మోడీ చర్చల అనంతరం భారత్-అమెరికా 300 కోట్ల డాలర్ల విలువైన రక్షణ రంగ ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఇంధనరంగంతో సహా మూడు అవగాహనా పత్రాలపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా తమ ఇరుదేశాల మధ్య సంబంధాలను అంతర్జాతీయ భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లాలని తాము నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ ఇరుదేశాలు 3బిలియన్ డాలర్ల విలువైన రక్షణ రంగ ఒప్పందాలను కుదుర్చుకున్నాయని సమగ్ర వాణిజ్య ఒప్పందంపై తాము దృష్టి పెట్టామని చెప్పారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎన్నడూ లేనంత చక్కగా ఉన్నాయని తమ రెండు దేశాలు అద్భుతమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని ట్రంప్ తెలిపారు.

వాణిజ్య చర్చలు ముగిశాక ప్రెస్‌తో మాట్లాడిన ట్రంప్ వచ్చే ఎన్నికల్లో తాము తప్పక విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మూడేళ్లలో అమెరికాలో ఎంతో అభివృద్ధి చేశామని... ఒబామా కేర్‌ను మించిన ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. గత అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లకు స్పష్టమైన మెజారిటీ వచ్చినందు వల్ల అమెరికాలో పలు కీలక సంస్కరణలు ప్రవేశపెట్టడం సాధ్యమైందని ట్రంప్ తెలిపారు. డెమొక్రాట్లు పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు.

ప్రస్తుతం తాము అధికారంలోకి వస్తేనే స్టాక్‌మార్కెట్లు పుంజుకుంటాయని పేర్కొన్నారు.  హెల్త్‌కేర్‌, మిలిటరీ, ఉద్యోగాల విషయంలో తాము మెరుగైన ఫలితాలు రాబట్టామని తెలిపారు. తాము కఠినంగా వ్యవహరించడం వల్లే అమెరికాలో ప్రతీ పౌరుడు సురక్షితంగా ఉన్నాడని పేర్కొన్నారు.

ఆ తర్వాత భారత పరిశ్రమలకు చెందిన అగ్రగామి సీఈఓలతో ట్రంప్ సమావేశమయ్యారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, ఆదిత్యా బిర్లా గ్రూఫ్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా వంటి భారత పారిశ్రామిక దిగ్గజాలతో ట్రంప్ భేటీ అయ్యారు. అమెరికాలో పెట్టుబడికి అనుకూలంగా చట్టాలను మరింత సులువుగా మారుస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. 

అమెరికాలో తాము ఇప్పటికే పెట్టిన పెట్టుబడుల గురించి, అక్కడ తమ అవకాశాల గురించి భారతీయ పారిశ్రామిక వేత్తలు ట్రంప్‌కు వివరించారు. వారి కృషిని విశేషంగా ప్రశంసించిన ట్రంప్ భారత్‌లో, అమెరికాలో మీ విజయానికి అభినందిస్తున్నానిని చెప్పారు. మీరంతా అమెరికా వచ్చి మరిన్ని బిలియన్ల కొద్దీ పెట్టుబడి పెడతారని ఆశిస్తున్నాను. అయితే మీ మదుపులను బిలియన్ల రూపంలో కాకుండా ఉద్యోగాల రూపంలో నేను చూస్తానని ట్రంప్ చెప్పారు.

ఆ తర్వాత భారత రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ ఇచ్చిన విశిష్ట విందుకు ట్రంప్ దంపతులు కుటుంబంతో సహా హాజరయ్యారు. పరిమిత సంఖ్యలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పత్రికాధిపతులు, సెలబ్రిటీలు హాజరైన ఈ విందులో భారతీయ, అమెరికన్ వంటకాలను ట్రంప్ దంపతులు ఆస్వాదించారు.

అనంతరం తమ భారత్ పర్యటన అన్ని రకాలుగా విజయవంతమైందన్న ఆత్మవిశ్వాసంతో అమెరికా అధ్యక్షుడు మంగళవారం రాత్రి స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   4 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   11 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   13 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle