newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

ట్రంప్‌ నిర్ణయంతో 2.19 లక్షల మంది తాత్కాలిక వర్కర్ల ఉద్యోగాలు ఫట్.. టెక్ దిగ్గజాల తీవ్ర అసమ్మతి

24-06-202024-06-2020 06:45:14 IST
Updated On 24-06-2020 10:47:29 ISTUpdated On 24-06-20202020-06-24T01:15:14.426Z24-06-2020 2020-06-24T01:15:11.242Z - 2020-06-24T05:17:29.400Z - 24-06-2020

ట్రంప్‌ నిర్ణయంతో 2.19 లక్షల మంది తాత్కాలిక వర్కర్ల ఉద్యోగాలు ఫట్.. టెక్ దిగ్గజాల తీవ్ర అసమ్మతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్‌1బీ వీసాను తాత్కాలికంగా రద్దు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన అమెరికన్లకు సహాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్‌ వెల్లడించారు. దీనిపై గూగుల్, ఆల్ఫాబెట్‌ సంస్థ సీఈవో సుంద‌ర్ పిచాయ్.. అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ట్విట్టర్‌ ద్వారా స్పందించిన సుంద‌ర్ పిచాయ్.. ‘ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యం త‌న‌ను నిరుత్సాహాప‌రిచింది.  అమెరికా ఆర్థిక ప్ర‌గ‌తిలో ఇమ్మిగ్రేష‌న్ విధానం ఎంతో తోడ్ప‌డింది. ఆ కార‌ణంగానే అమెరికా టెక్నాల‌జీ రంగంలో గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా మారింది. ఈ రోజు గూగుల్ కంపెనీ ఇలా ఉందంటే, అది ఇమ్మిగ్రాంట్ల వ‌ల్లే’ అని పిచాయ్ తెలిపారు. 

విదేశీ టెకీల‌కు వీసాలు జారీ చేయ‌బోమ‌ని ట్రంప్ చేసిన ప్ర‌క‌ట‌న నిరుత్సాహాప‌రిచినా.. తాము మాత్రం ఇమ్మిగ్రాంట్స్‌కు మ‌ద్ద‌తుగా ఉంటామ‌ని, అన్ని ర‌కాలుగా అవ‌కాశాలు క‌ల్పిస్తూనే ఉంటామ‌ని పిచాయ్ త‌న ట్విట్‌లో తెలిపారు. ట్రంప్ నిర్ణయాన్ని పిచాయ్ మాత్రమే కాక మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ కూడా వ్యతిరేకించాయి.

మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్‌ ట్రంప్ చర్యను విమర్శిస్తూ.. ‘అమెరికాకు ఇప్పుడు వలసదారులు మరింత అవసరం. ప్రస్తుతం మన దేశాన్ని ప్రపంచ ప్రతిభ నుంచి విడదీయడానికి లేదా ఆందోళనను సృష్టించే సమయం కాదు. వలసదారులు మా కంపెనీలో కీలక పాత్ర పోషిస్తారు. వారు మన దేశం క్లిష్టమైన మౌలిక సదుపాయాలకు మద్దతు ఇస్తారు. మనకు చాలా అవసరమైన సమయంలో వలసదారులు ఈ దేశానికి ఎంతో సహకరించారు’ అని ఆయన అన్నారు. బ్రాడ్‌ స్మిత్‌ ట్వీట్‌ను మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల కూడా రీట్వీట్‌ చేశారు.

ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ప్రకటనపై ట్విట్టర్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు వరుస ట్వీట్లతో ట్రంప్‌ చర్యలను విమర్శించింది.  ‘ఈ చర్య అమెరికా ఆర్థిక ఆస్తిని, దాని వైవిధ్యాన్ని బలహీనపరుస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు మన శ్రమశక్తిలో చేరడానికి, పన్నులు చెల్లించడానికి.. ప్రపంచ వేదికపై మన పోటీతత్వానికి తోడ్పడటానికి ఇక్కడకు వస్తారు. వారిని ఇబ్బంది పెట్టే ఆలోచనలు మంచివి కావు’ అని ట్వీట్‌‌ చేసింది. 

కొంతకాలం క్రితం వరకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో భాగమైన ఆలిస్ జి వెల్స్ కూడా ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ‘హెచ్1-బీ వీసా ప్రోగ్రాం ద్వారా ఉత్తమమైన, ప్రతిభావంతులను దేశంలోకి ఆహ్వానించి.. వారి కృషితో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. విదేశీ ప్రతిభను ఆకర్షించడం అమెరికా బలం. బలహీనత కాదు’ అని ఆయన ట్విట్‌ చేశారు.

కాగా కరోనా వైరస్ ప్రభావం వల్ల కలిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునేందుకు ఇమిగ్రేషన్ వీసాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై సర్వత్రా  నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దిగ్గజ టెక్ కంపెనీలు సహా టెక్ నిపుణులు, రాజకీయవేత్తలు ట్రంప్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ కొత్త విధానం అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని ట్విట్టర్ పబ్లిక్ పాలసీ హెడ్ జెస్సికా తెలిపారు. ‘ఇమిగ్రేషన్ అమెరికాకు ఉన్న అతి పెద్ద సంపద. దాన్ని ట్రంప్ తక్కువగా అంచనా వేశారు’ అని వ్యాఖ్యానించారు. 

శాశ్వత వీసాలపై మరో 60 రోజుల పాటు, తాత్కలిక వీసాలపై ఈ ఏడాది చివరి వరకూ నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం వైట్ హోజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా వల్ల దెబ్బతిన్న అమెరికన్లకు ఉపశమనం కలిగించేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది. అమెరికా తాత్కాలికంగా నిషేధించిన వాటిలో పాపులర్ వీసాలైన హెచ్1బీ, హెచ్2బీ, హెచ్4, జే, ఎల్ కూడా ఉన్నాయి. ట్రంప్ సంతకం చేసిన కొత్త రూల్స్ రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. వాషింగ్టన్ కు చెందిన ఓ థింక్ ట్యాంక్ లెక్కల ప్రకారం 2.19 లక్షల మంది తాత్కాలిక వర్కర్లు కొత్త పాలసీ వల్ల ఉద్యోగాలు కోల్పోతారు. 

అమెజాన్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, టెస్లా, ఉబర్, పేపాల్ తదితర కంపెనీలు కూడా హై స్కిల్డ్ వర్కర్లను దేశం నుంచి పంపేయడాన్ని వ్యతిరేకించాయి. దీని వల్ల దేశం నష్టపోతుందని తప్ప ఒరిగే లాభమేమీ ఉండదని అభిప్రాయపడ్డాయి. 

వర్క్ వీసాల జారీపై తాత్కాలిక నిషేధాన్ని ఎత్తేయాలని భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కోరారు. కరోనా తర్వాతి ఫేజ్ ను ఎదుర్కొనేందుకు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న హై స్కిల్డ్ వర్కర్లు అవసరం ఉందని పేర్కొన్నారు. హెచ్1బీ ప్రొగ్రాం ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగులు దేశ హెల్త్ కేర్ సిస్టంను కాపాడుకుంటూ వస్తున్నారని తెలిపారు. హెచ్ 1బీ తో పాటు ఎల్ 1బీ వీసాల జారీని నిలిపేసే బదులు వాటికి కొన్ని మార్పులు చేయాలని సూచించారు. 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   5 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   13 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   14 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle