newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ట్రంప్‌ను వెంటాడుతున్న మొతేరా జ్ఞాపకాలు..

01-03-202001-03-2020 14:24:19 IST
2020-03-01T08:54:19.907Z01-03-2020 2020-03-01T08:53:46.896Z - - 05-08-2020

ట్రంప్‌ను వెంటాడుతున్న మొతేరా జ్ఞాపకాలు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తన భారత సందర్శన ముగిసి అయిదురోజులు కావస్తున్నా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను భారత్ జ్ఞాపకాలు వదలిపెట్టనట్లుంది. అమెరికాలో ఏ సదస్సులో పాల్గొన్నా తన భారత పర్యటన పట్ల ప్రశంసల వర్షం కురిపంచకుండూ ట్రంప్ ఉండలేకపోతున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో కొత్తగా నిర్మించిన అతిపెద్ద స్టేడియంలో భారత ప్రధాని నరేంద్రమోదీ, లక్షకు పైగా ప్రజలు తనను స్వాగతించినతీరును ఎన్నటికీ మర్చిపోలేనని ట్రంప్ కృతజ్ఞతలు తెలుపుతూనే ఉన్నారు. 

శనివారం సౌత్ కరోలినా రాష్ట్రంలో ఒక ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్ భారత్‌లో నమస్తే ట్రంప్ పేరిట జరిగిన భారీ  కార్యక్రమం గురించి సభికులతో పంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప వ్యక్తి అని భారత ప్రజల ప్రేమాభిమానాలను మోదీ చూరగొంటున్నారని పేర్కొన్నారు.

సహజంగా అమెరికాలో ఎవరి సభకు రానంత ఎక్కువమంది తన సభలకు హాజరవుతుంటారని అయితే 60 వేలమందికి మించి తనసభలకు అమెరికాలో హాజరు కారని ట్రంప్ చెప్పారు. కానీ భారత్‌లో అంత మంది జనాన్ని చూశాక మళ్లీ అంత ఉద్వేగాన్ని నేనికి ఎన్నటికీ పొందలేకపోవచ్చని ట్రంప్ పేర్కొన్నారు.  

భారత జనాభా 150 కోట్లు. మన అమెరికా జనాభా 35 కోట్లు. జనాభా తక్కువ కాబట్టి మనం అనేక పనులు సమర్థంగా చేసుకుంటున్నాం. కానీ అమెరికాలో ఇప్పుడు హాజరైన జనాన్ని నేను ప్రేమిస్తాను. అలాగే ఇండియాలో కూడా నా స్వాగత కార్యక్రమానికి హాజరైన జనం అంటే నాకెంతో ఇష్టం. నా భారత పర్యటన నిజంగానే ఎంతో విలువైనది అని ట్రంప్ చెప్పారు.

ఫిబ్రవరి 25న భారత పర్యటనలో బాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధమ మహిళ మెలానియా, కుమార్తె ఇవాంకా  తదితర కుటుంబ సభ్యులతో అహ్మదాబాద్ వచ్చినప్పుడు అక్కడి నూతన క్రికెట్ స్టేడియంలో లక్షా పాతికవేలమందికి పైగా జనం ట్రంప్ దంపతులకు సాదరంగా ఆహ్వానం పలికారు. ప్రపంచంలోనే అతిపెద్దదిగా రికార్రుకెక్కిన మొతేరా క్రికెట్ స్టేడియంలో అంత మంది ప్రజలను చూసిన ట్రంప్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తన 40 నిమిషాల  ప్రసంగంలో భారత్ గురించి ప్రధాని మోదీ గురించి, భారత ప్రజల గురించి ప్రశంశల వర్షం కురిపించారు. 

తర్వాత ఆగ్రాలోని తాజ్ మహల్ సందర్శించిన ట్రంప్ దంపతులు తమ ఉద్వేగాన్ని, ఆనందాన్ని దాచుకోలేకపోయారు. అనంతరం న్యూఢిల్లీలో హైదరాబాద్ హౌస్‌లో వాణిజ్య చర్చలు విజయవంతంగా పూర్తి చేశారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో విందు కార్యక్రమం తర్వాత ట్రంప్ దంపతులు అమెరికాకు బయలుదేరి వెళ్లారు.

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   10 hours ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   18 hours ago


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   19 hours ago


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   03-08-2020


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   02-08-2020


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle