newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ట్రంప్‌కు ఘనస్వాగతం... సబర్మతి ఆశ్రమం సందర్శన

24-02-202024-02-2020 13:50:19 IST
Updated On 24-02-2020 13:50:47 ISTUpdated On 24-02-20202020-02-24T08:20:19.463Z24-02-2020 2020-02-24T08:20:17.129Z - 2020-02-24T08:20:47.454Z - 24-02-2020

ట్రంప్‌కు ఘనస్వాగతం... సబర్మతి ఆశ్రమం సందర్శన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వారికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రెడ్‌ కార్పెట్ స్వాగతం పలికారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ప్రధాని వెంట ఉన్నారు. ట్రంప్‌తో పాటు ఆయన కూతురు, అధ్యక్షుడి సీనియర్‌ సలహాదారు ఇవాంక, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌, అమెరికాకు చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల బృందం కూడా భారత్‌కు విచ్చేసింది. పర్యటన సందర్భంగా 13 రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. 

ఎయిర్‌పోర్టు నుంచి మోతేరా స్టేడియం వరకు 22 కిలోమీటర్ల మేర సాగే రోడ్‌షోలో ఇరు దేశాధినేతలు పాల్గొన్నారు. మార్గమధ్యంలో వారు సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ట్రంప్, మోడీ సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పారు ట్రంప్ దంపతులు. సబర్మతీ ఆశ్రమంలో ట్రంప్ దంపతులకు ఖాదీ వస్త్రాలను కప్పి సాదరంగా ఆశ్రమంలోకి ఆహ్వానించారు. ఆ సమయంలో ఖాదీ వస్త్రాన్ని గురించి ట్రంప్ అక్కడున్న వారితో ఆరా తీయగా... వారు ఖాదీ వస్త్రాన్ని గురించి ఆయనకు వివరించారు. తర్వాత నూలు వస్త్రాలతో గాంధీ బొమ్మకు అలంకరించారు. తర్వాత మోదీ స్వయంగా వారిద్దరికీ ఆశ్రమాన్ని చూపించారు. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ, అధ్యక్షుడి సలహాదారు అయిన ఇవాంకాట్రంప్ రంగురంగుల పూల ప్రింట్లతో కూడిన మిడ్డీ డ్రెస్ ధరించి అహ్మదాబాద్ నగరంలో అడుగుపెట్టారు. తన తండ్రితోపాటు యూఎస్ ఎయిర్ ఫోర్స్ ఏ వన్ విమానంలో వచ్చిన ఇవాంకా వెంట ఆమె భర్త జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు. ఇవాంకా ట్రంప్ ఎరుపురంగు పూలతో కూడిన తెల్లటి మిడ్డీని ధరించి మెరిసిపోయారు.

రెండోసారి భారత పర్యటనకు వచ్చిన ఇవాంకాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కరచాలనం ఇచ్చి పలకరించారు. మోతెరా స్టేడియంలో ట్రంప్ కు జయజయధ్వానాలతో స్వాగతం పలికారు జనం. బాలీవుడ్ గీతాలతోపాటు జానపదనృత్యాలతో కళాకారులు ఇవాంకా ట్రంప్ కు ఘనస్వాగతం పలికారు. డోనాల్డ్ ట్రంప్ కోసం కనివినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది భారత ప్రభుత్వం. 

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   13 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   17 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle