newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ట్రంప్‌కు అక్కరలేని ఫౌసీని కళ్లకు అద్దుకుంటాం.. ఇటలీ ఆహ్వానం

16-04-202016-04-2020 14:39:54 IST
Updated On 16-04-2020 14:41:27 ISTUpdated On 16-04-20202020-04-16T09:09:54.307Z16-04-2020 2020-04-16T09:09:52.466Z - 2020-04-16T09:11:27.836Z - 16-04-2020

ట్రంప్‌కు అక్కరలేని ఫౌసీని కళ్లకు అద్దుకుంటాం.. ఇటలీ ఆహ్వానం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మనుషుల ప్రాణాల విలువ తెలియని ట్రంప్‌కు అమెరికన్ కరోనా టాస్క్ ఫోర్స్ చీఫ్ ఆంథోనీ పౌసీ విలువ ఏం తెలుస్తుందని ఇటలీ మండిపడింది. మనుషుల ప్రాణాల పట్ల అపారమైన గౌరవం చూపిన ఫౌసీని ట్రంప్ పదవినుంచి తొలగిస్తే ఆయన సేవలు యావత్ మానవాళికి ఉపయోగపడతాయని ఇటలీ అంటువ్యాధుల ఆస్పత్రి సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ గియుసెఫ్ ఇప్పోలిటో పేర్కొన్నారు. మహమ్మారి కరోనా నుంచి ఇటలీతో పాటు ప్రపంచం మొత్తాన్ని కాపాడేందుకు ఆయన మార్గదర్శకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు. 

ఇటలీ మూలాలున్న అమెరికన్ అయిన ఫౌసీని ఉద్యోగం నుంచి తొలగించాల్సిన అవసరం వచ్చిందని తనకు వచ్చిన ట్వీట్‌కు మద్ధతుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రీట్వీట్‌ చేయడంతో ఫౌసీకి త్వరలో ఉద్వాసన తప్పదని అనుమానాలు బయలుదేరాయి. దీంతో ట్రంప్‌పై విమర్శలు పరాకాష్టకు చేరాయి.

కరోనా వైరస్ మహమ్మారి దాడికి అతలాకుతలమవుతున్న అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ ఏర్పాటు చేసిన కరోనా టాస్క్ ఫోర్స్‌లో ఫౌసీ కీలక సభ్యుడు. అమెరికాలో వైరస్ నియంత్రణ చర్యలు ముందుగానే చేపట్టి ఉంటే మరికొందరి ప్రాణాలు కాపాడేవాళ్లమని ఫౌసీ ఇటీవలే సీఎన్ఎన్‌తో చెప్పడం ట్రంప్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అదే సమయంలో ఇది ఫౌసీని తొలగించాల్సిన సమయం అంటూ మరొకరు చేసిన ట్వీట్‌ను ట్రంప్ రీట్వీట్ చేశారు. దీంతో ఇక ఫౌసీకి ఉద్వాసన తప్పదని అందరూ భావించారు. కానీ ఆయన ఉద్యగానికి ఇప్పటికైతే ముప్పులేదని, స్పష్టం చేసిన ట్రంప్ మీడియా వ్యవహారాల్లో తలదూర్చవద్దని చెప్పినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఇటలీ అంటువ్యాధుల ఆస్పత్రి సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ గియుసెఫ్ ఇప్పోలిటో ఆయనకు బాసటగా నిలిచారు. అమెరికా అధ్యక్షుడు నిజంగా ఫౌసీని తొలగిస్తే అది అమెరికాకు అశుభవార్త అవుతుందని, అదే సమయంలో ఇటలీకి, అంతర్జాతీయ సమాజానికి మరొకరకంగా మేలు చేస్తుందని ఇప్పోలిటో చెప్పారు. 

ఫౌసీ ఇటాలియన్ వారసత్వానికి తామెల్లప్పుడూ గర్వపడతామని ఇప్పాలిటో పేర్కొన్నారు. అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది పురుషులను, మహిళలను, చిన్నారులను ఆయన కాపాడారు. అమెరికా లేక మరెక్కడైనా సరే కరోనాపై పోరాడేందుకు మాకు ఆంధోనీ ఫౌసీ అవసరం. మా సంస్థకు ఆయన సలహాదారుగా ఉంటే మేమెంతో గౌరవిస్తాం. ఆయన ఆరోగ్య సంరక్షణ అంశాలపై ఆయన దార్శనికత ఇటలీకి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అని ఇప్పాలిటో చెప్పారు. 

ఇటలీలోని ఆస్పత్రులకే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఆయన నిస్వార్థంతో, ఉదారతతో సేవచేయగలరని ప్రశంసించారు. ఔషధాలు, సాంక్రమిక వ్యాధులపై ఫౌసీ రాసినంత విస్తృతంగా మరెవరూ రాయలేదని, సాంక్రమిక వ్యాధులపై పనిచేయాలంటే ఆయన్ని మించిన వ్యక్తి ఈ ప్రపంచంలోనే లేరని ఇటలీ అంటువ్యాధుల ఆస్పత్రి సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ గియుసెఫ్ ఇప్పోలిటో పేర్కొన్నారు. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కనుక ఇటలీ మూలాలున్న ఆంథోనీ ఫౌసీని పదవినుంచి తొలగిస్తే ఆయన్ని ఇటలీ రెండుకళ్లతో అద్దుకుని స్వీకరించాలని, సాదరంగా ఇటలీ ఆయన్ని ఆహ్వానించాలని ఇప్పోలిటో చెప్పారు. ఈ విషయమై ఇటలీ అధ్యక్షుడు, తదితర ఉన్నతాధికారులకు ఉత్తరం కూడా రాశారు. అలాంటి పరిస్థితే ఉత్పన్నమయితే రెండు చేతులతో ఆయన్ని ఆహ్వానించాలని చెప్పారు.

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   4 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   7 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   20 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle