newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జేఎన్‌యూలో అర్థరాత్రి అలజడి...దుండగుల దాడి

06-01-202006-01-2020 08:16:01 IST
Updated On 06-01-2020 12:34:57 ISTUpdated On 06-01-20202020-01-06T02:46:01.850Z06-01-2020 2020-01-06T02:45:54.485Z - 2020-01-06T07:04:57.474Z - 06-01-2020

జేఎన్‌యూలో అర్థరాత్రి అలజడి...దుండగుల దాడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఢిల్లీ జెఎన్‌యూలో అర్థరాత్రి అలజడి రేగింది. ఢిల్లీ జేఎన్‌యూలో.ముసుగులు ధరించి క్యాంపస్ లోకి వచ్చిన 50 మంది అగంతుకులు విచక్షణా రహితంగా విద్యార్ధులు, ప్రొఫెసర్లపై రాళ్ళు, కర్రలతో దాడి చేశారు. దీంతో వారు తీవ్రంగా గాయాల పాలయ్యారు. వర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు.

అర్థరాత్రి సమయంలో ప్రశాంతంగా ఉండే జెఎన్ యూలోకి ముసుగులు ధరించి కర్రలు, రాడ్‌లతో విద్యార్థులు, టీచర్లపై దాడి చేయడంతో జేఎన్‌యూఎస్‌యూ ప్రెసిడెంట్‌ ఆయిషీ ఘోష్‌ సహా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఎయిమ్స్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

ఈ దాడి ఘటనపై ఏబీవీపీ, జేఎన్‌యూఎస్‌యూల పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. దాదాపు రెండు గంటల పాటు కర్రలు, ఇనుప రాడ్లతో దుండగులు వర్సిటీలో భయోత్పాతం సృష్టించారు.

వర్శిటీలో తాజా పరిస్థితిని సమీక్షించిన హోంమంత్రి అమిత్‌ షా పోలీసులను అప్రమత్తం చేశారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఎయిమ్స్‌లో విద్యార్థులను పరామర్శించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నందువల్లే విద్యార్ధులపై బీజేపీ అనుబంధ సంఘాలు దాడులకు తెగబడుతున్నాయని కాంగ్రెస్ మండిపడింది. 

ఇదిలా ఉంటే.. జేఎన్‌యూఎస్‌యూనే ఈ దాడికి పాల్పడిందని, ఈ దాడిలో తమ సభ్యులు పాతిక మందికి గాయాలయ్యాయని, మరో 11 మంది జాడ తెలియడం లేదని ఏబీవీపీ ఆరోపించింది. వామపక్ష విద్యార్థి సంస్థలు ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ, డీఎస్‌ఎఫ్‌ విద్యార్థులు ఈ దాడుల వెనుక ఉన్నారని ఆరోపించింది.

మరోవైపు.. ఇది ఏబీవీపీ గూండాల పనేనని, ముసుగులు వేసుకుని లాఠీలు, ఇనుప రాడ్‌లతో వారే ఈ దాడికి తెగబడ్డారని జేఎన్‌యూఎస్‌యూ పేర్కొంది. ఏబీవీపీ వారు చేసిన రాళ్లదాడిలోనే తమ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్‌ ఘోష్‌ తీవ్రంగా గాయపడ్డారని ఆరోపించింది. 

దాడికి భయపడి హాస్టళ్లలోని తమ రూముల్లో దాక్కున్నామని పలువురు విద్యార్థులు తెలిపారు. ముఖం కనిపించకుండా కప్పుకుని, హాకీ స్టిక్స్‌తో ఒక భవనంలోపల తిరుగుతున్న కొందరు దుండగుల వీడియోను పలు వార్తాచానెళ్లు ప్రసారం చేశాయి.  ఈదాడికి పాల్పడిన దుండగులను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రమోద్‌ కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. 

ఈఘటనను పలువురు కేంద్రమంత్రులు, మాజీ విద్యార్ధులు తీవ్రంగా ఖండించారు. జేఎన్‌యూ మాజీ విద్యార్థులు, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్‌ జైశంకర్‌ జేఎన్‌యూలో జరిగిన హింసాత్మక ఘటనలను ఖండించారు. ఢిల్లీ పోలీసులు, జేఎన్‌యూ అధికారుల నుంచి మానవ వనరుల మంత్రిత్వ శాఖ వివరణ కోరింది.

జేఎన్‌యూలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు దారుణమని, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ అన్నారు. జేఎన్‌యూ ఘటనపై ఢిల్లీ సీఎం, ఆప్‌ నేత అర్వింద్‌ కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ను కోరానన్నారు. ఇటు జేఎన్ యూ ఘటనకు నిరసనగా హైదరాబాద్ లోని సెంట్రల్ వర్శిటీలో విద్యార్దులు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు విద్యార్థులు. 

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

   11 hours ago


నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   16 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   14-05-2021


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   14-05-2021


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   13-05-2021


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle