newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

జార్జ్ ఫెర్నాండెజ్ సహాయాన్ని మర్చిపోలేం.. చైనా కృతజ్ఞతలు

20-02-202020-02-2020 16:54:22 IST
2020-02-20T11:24:22.758Z20-02-2020 2020-02-20T11:24:17.593Z - - 08-08-2020

జార్జ్ ఫెర్నాండెజ్ సహాయాన్ని మర్చిపోలేం..  చైనా కృతజ్ఞతలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సార్స్ అంటువ్యాది చైనాను అతలాకుతలం చేసిన రోజుల్లో 2003లో ఆరోగ్యపరంగా దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ప్రకటించిన సందర్భంగా నాటి భారత రక్షణమంత్రి జార్జి ఫెర్నాడజ్ చైనాకు చేసిన సహాయాన్ని ఎన్నటికీ మర్చిపోలేమని భారత్‌లో చైనా రాయబారి సన్ వీడాంగ్ చెప్పారు. చైనాలో అడుగుపెట్టాలంటేనే ప్రపంచ దేశాలు భయపడిపోతున్న రోజుల్లో జార్జి స్వయంగా చైనాను సందర్శించడమే కాకుండా చైనా పట్ల ప్రదర్శించిన సహానుభూతిని చైనీయులు ఏనాటికీ మర్చిపోరని వీడాంగ్ కృతజ్ఞతలు తెలిపారు.

''2003లో సార్స్ సాంక్రమిక వ్యాధి చైనాను కుదిపోసిన రోజుల్లో నేను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెంది ఆసియా విభాగం డైరెక్టరుగా ఉండేవాడిని. ఆ సమయంలో నాటి భారత రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండజ్ ఎలాంటి శంకలూ, భయాలు లేకుండా చైనాను సందర్శించారు. ఆయన ప్రదర్శించిన వైఖరిని చూసి ఎంతగానో కదిలిపోయాను'' అని భారత్‌లో చైనా రాయబారి వీడాంగ్ తెలిపారు.

పాశ్చాత్య మీడియా సార్స్ వ్యాధి నేపథ్యంలో చైనాలో ఆరోగ్యపరంగా తలెత్తిన సంక్షోభాన్ని మితిమీరి ప్రచారం చేయడం పట్ల జార్జి ఫెర్నాండజ్ మండిపడ్డారని, ప్రపంచమంతటా ప్రజలు సార్స్ అంటేనే భీతిల్లిపోయే వాతావరణాన్ని సృష్టించిన పాశ్చాత్య మీడియా ద్వంద్వ వైఖరిని జార్జ్ ఎండగట్టారని వీడాంగ్ తెలిపారు. చైనాను సందర్శిస్తున్నారు. సార్స్ వ్యాధి అంటుకుంటుందని మీకు భయం వేయడం లేదా అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు జార్జి ఫెర్నాండజ్ సమాధానమిస్తూ చైనా ప్రజలే ఈ వ్యాధి పట్ల భయపడనప్పుడు నేనెందుకు భయపడాలి అని బదులిచ్చారని వీడాంగ్ గుర్తు చేసుకున్నారు.

అంతేకాకుండా చైనా పర్యటన నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన జార్జ్ చైనాకు అవసరమైన మందులను విరాళంగా ఇవ్వాలని భారతీయ సైన్యాన్ని ఆదేశించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్న ఆ రోజుల్లో ఆయన ప్రదర్శించిన ఈ కారుణ్య దృష్టిని చైనా ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని వీడాంగ్ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా జార్జి ఫెర్నాండజ్ స్వయంగా 17 కార్టన్లలో యాండీ వైరల్ మందులను, మాస్కులను నాటి చైనా రాయబారి హువా జుండావోకు అందించి సార్స్ వ్యాధిగ్రస్తులకు అందించాలని చెప్పారు. 

ఇప్పుడు చైనా మరో ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోంది. కరోనా వైరస్ లేక దాని అధికారిక పేరు అయిన కోవిడ్19 విస్తరణతో చైనా ప్రస్తుతం తల్లడిల్లుతోంది. దాదాపు 75,000 మంది ఇంతవరకు చైనాలో కోవిడ్19 వ్యాధి భారినపడగా 2000కు పైగా వ్యాధిగ్రస్తులు చనిపోయారని అధికారిక సమాచారం. మొదటగా చైనాలోని ఊహాన్ నగరంలోని హుబై ప్రావిన్స్‌లో బయటపడిన కోవిడ్19 ఇప్పుడు 25 దేశాలకు విస్తరించింది.  

ప్రస్తుతం కూడా భారత ప్రభుత్వం చైనాకు అవసరమైన మందులు పంపించాలని నిర్ణయించుకుంది. ఊహాన్ ప్రజలకు అవసరమైన ఔషధాలతో కూడిన కన్‌సైన్‍‌మెంటును త్వరలో భారత్ నుంచి పంపించడానికి సిద్ధంగా ఉన్నామని చైనాలో భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.

కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   9 hours ago


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   12 hours ago


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   16 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   18 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   20 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   20 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   21 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle