newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

జామియా ఘటనలో పోలీసుల ఓవరాక్షన్ ..కలకలం రేపుతున్న వీడియో

17-02-202017-02-2020 09:29:22 IST
Updated On 17-02-2020 09:29:19 ISTUpdated On 17-02-20202020-02-17T03:59:22.724Z17-02-2020 2020-02-17T03:58:30.617Z - 2020-02-17T03:59:19.163Z - 17-02-2020

జామియా ఘటనలో పోలీసుల ఓవరాక్షన్ ..కలకలం రేపుతున్న వీడియో
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. . ఈనేపథ్యంలో పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించి లాఠీచార్జీ చేయడం తెలిసిందే. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేసిన వీడియో వెలుగులోకి రావడంతో సంచలనం రేగుతోంది.  జామియా సమన్వయ కమిటీ (జేసీసీ) విడుదల చేసిన ఈ వీడియోలో.. గత డిసెంబర్‌ 15న పారామిలటరీ, పోలీసు సిబ్బంది లైబ్రరీలో విద్యార్థులను కొడుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. 

48 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో 8 మంది భద్రతా సిబ్బంది పాత రీడింగ్‌ హాల్‌లోకి వచ్చి విద్యార్థులను కర్రలతో కొడుతున్నారు. ఈ వీడియోలో కనబడకుండా వుండేందుకు పారామిలటరీ, పోలీసు సిబ్బంది కనబడకుండా ఉండేందుకు ముఖాలకు చేతిరుమాలును కట్టుకున్నారు.

ఈ వీడియోపై విచారణ జరుపుతున్నట్లు ప్రత్యేక పోలీస్‌ కమిషనర్‌ ప్రవీర్‌ రంజన్‌ తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా డిసెంబరు 15న విద్యార్ధులు నిరసనలు నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్ధులు తమపై రాళ్ళు రువ్వారని, బస్సులకు నిప్పు పెట్టారని పోలీసులు ఆరోపిస్తూ లాఠీఛార్జి చేయడంతో నిరసన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. 

పోలీసులు కాలేజీ  లైబ్రరీలోకి ప్రవేశించి ఆందోళనతో సంబంధం లేని విద్యార్ధులను చితకబాదినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియోను జామియా సమన్వయ కమిటీ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. కాలేజిలోని పాత రీడింగ్‌ హాల్‌లోని ఫస్ట్‌ఫ్లోర్‌లో ఉన్న ఎం.ఎ, ఎంఫిల్‌ సెక్షన్‌లో డిసెంబరు 15న జరిగినట్లు ట్విట్టర్‌లో పేర్కొంది. ఇది ఢిల్లీ పోలీసులు సిగ్గుపడాల్సిన విషయమని వ్యాఖ్యానించింది. 

తాజాగా విడుదలైన వీడియోపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తీవ్రంగా స్పందించారు. లాఠీఛార్జీ విషయలో పోలీసులు, పాలకులు అబద్ధం చెప్పారని ఆమె విమర్శించారు. తాజా వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ ''చదువుకుంటున్న విద్యార్ధులపై పోలీసులు విచక్షణా రహితంగా ఎలా ప్రవర్తించారో చూడండి. తాను చదువుకుంటున్నట్లు ఒక విద్యార్ధి పుస్తకాన్ని చూపించినప్పటికీ, పోలీసులు అతనిపై లాఠీ ప్రయోగించారని మండిపడ్డారు. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   2 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   3 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   5 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   13 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle