newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

‘జలియన్ వాలాబాగ్’ గాయానికి వందేళ్ళు

13-04-201913-04-2019 17:56:28 IST
Updated On 13-04-2019 18:06:10 ISTUpdated On 13-04-20192019-04-13T12:26:28.403Z13-04-2019 2019-04-13T12:26:26.344Z - 2019-04-13T12:36:10.451Z - 13-04-2019

‘జలియన్ వాలాబాగ్’ గాయానికి వందేళ్ళు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మనదేశ చరిత్రలో జలియన్ వాలాబాగ్ ఘటన చెరిగిపోని మచ్చగా మిగిలిపోయింది. వందలాది మంది అమాయక భారతీయులు బ్రిటీష్ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఈ చేదు సంఘ‌ట‌న‌కు ఇవాళ్టితో వందేళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా అమరవీరులకు రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ,ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల త్యాగాలను భారత్ ఎప్పటికీ మర్చిపోదని కోవింద్ అన్నారు.  అమృత్‌స‌ర్‌లో ఉన్న జ‌లియ‌న్ వాలాబాగ్ స్మార‌కం దగ్గర పలువురు ప్రముఖులు,పెద్ద సంఖ్యలో ప్రజలు అమరులకు నివాళులు అర్పించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జలియన్ వాలాబాగ్ మెమోరియల్‌ను సందర్శించి అమరులకు నివాళులర్పించిన అనంతరం 100రూపాయల స్మారక కాయిన్, స్మారక పోస్టల్ స్టాంప్‌లు విడుదల చేశారు.

రూ.100 స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్ విడుదల 

బ్రిటీష్ హై క‌మిష‌న‌ర్ స‌ర్ డామినిక్ అస్క్విత్ కూడా జలియన్ వాలాబాగ్ స్మారకం దగ్గర పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. స్మార‌కం వ‌ద్ద ఉన్న విజిట‌ర్స్ బుక్‌ లో కూడా ఆయ‌న సంత‌కం చేశారు. శుక్రవారం రాత్రి కూడా పెద్ద సంఖ్యలో స్థానికులు,పర్యాటకులు,విద్యార్థులు అమృత్ సర్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బ్రిటీష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా 1919 ఏప్రిల్-13న జ‌లియ‌న్‌ వాలాబాగ్‌లో శాంతియుతంగా నిరసన చేస్తున్న భారతీయులపై జ‌న‌ర‌ల్ డ‌య్యర్ అత్యంత క్రూరంగా కాల్పుల‌కు ఆదేశించాడు. మొత్తం 50 మంది సైనికులు పది నిముషాలు పాటు 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. ప్రవేశ మార్గాలను మూసివేసి, గుమిగూడిన జనంపై గుళ్లవర్షం కురిపించారు. నాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. 

ఆ కాల్పుల్లో సుమారు వెయ్యి మందికిపైగా మ‌ర‌ణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు చనిపోయినవారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై అప్పట్లో హంటర్ కమిషన్ విచారణ చేపట్టింది. ఈ విచారణలోనూ డయ్యర్ తన నిరంకుశ వైఖరిని చాటుకున్నాడు. ఆ స్థలంలోనికి వాహనాలు వెళ్ళే అవకాశం లేదని, తాను మెషిన్ గన్లతో కాల్పులు జరిపించి ఉండేవాడినని, కాని ఇరుకైన సందులలోకి సాయుధ వాహనాలు వెళ్ళడం కుదరలేదని .. జనం చెల్లా చెదురైనా గాని కాల్పులు ఆపలేదని, కొద్దిపాటి కాల్పులవల్ల ప్రయోజనం లేదని, జనం అంతా వెళ్ళిపోయేదాకా కాల్పులు జరపడం తన బాధ్యత అని కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చాడు డయ్యర్. గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించడం తన బాధ్యత కాదు గనుక అలాంటి ప్రయత్నమేమీ చేయలేదని, ఆసుపత్రులు తెరచి ఉన్నందున వారే వెళ్ళవచ్చునని కూడా అన్నాడు. డయ్యర్ తీరు అప్పట్లోనే వివాదాస్పదం అయింది. 

Image result for jallianwala bagh 100 coin

బ్రిటీష్ ఆక్రమణకు వ్యతిరేకంగా భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో జలియన్ వాలాబాగ్ క్రూర ఘటన. జ‌లియ‌న్‌ వాలాబాగ్ ఘ‌ట‌న భార‌త్‌, బ్రిటీష్ చ‌రిత్రలో మాయ‌ని మ‌చ్చ అని బ్రిటీష్ ప్రధాని థెరిసా మే తెలిపారు. 1997లోనూ క్వీన్ ఎలిజ‌బెత్ జ‌లియ‌న్‌ వాలాబాగ్‌ సందర్శించి నివాళులర్పించారు. . బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కేమెరూన్ భారత్ పర్యటనకు వచ్చినపుడు జలియన్ వాలా బాగ్ ఉదంతాన్ని బ్రిటీషర్లు చేసిన ఓ సిగ్గులేని చర్యగా అభివర్ణించారు. అయితే వందేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు జలియన్ వాలాబాగ్ ఘటనపై బ్రిటన్ అధికారికంగా భారత్ కు క్షమాపణ చెప్పకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

'హౌడీ మోడీ' తర్వాత ట్రంప్‌, మోడీ ట్రేడ్ డీల్ షురూ!

'హౌడీ మోడీ' తర్వాత ట్రంప్‌, మోడీ ట్రేడ్ డీల్ షురూ!

   29 minutes ago


విమర్శలకు ఒక్క నిర్ణయంతో సమాధానం చెప్పిన విత్త మంత్రి

విమర్శలకు ఒక్క నిర్ణయంతో సమాధానం చెప్పిన విత్త మంత్రి

   17 hours ago


హస్తినను తాకిన అన్నదాత ఆగ్రహం..

హస్తినను తాకిన అన్నదాత ఆగ్రహం..

   20 hours ago


మా హనీమూన్ పాడుచేస్తారా.. చిక్కుల్లో థాయ్ ఎయిర్వేస్

మా హనీమూన్ పాడుచేస్తారా.. చిక్కుల్లో థాయ్ ఎయిర్వేస్

   a day ago


ట్రాఫిక్ ఫైన్ కట్టలేకపోతున్నారా.. ఇలా తప్పించుకోండి మరి.. ట్రాఫిక్ పోలీసు చిట్కా

ట్రాఫిక్ ఫైన్ కట్టలేకపోతున్నారా.. ఇలా తప్పించుకోండి మరి.. ట్రాఫిక్ పోలీసు చిట్కా

   a day ago


ట్రాఫిక్ జరిమానాలపై గడ్కరీ సమర్ధన...!

ట్రాఫిక్ జరిమానాలపై గడ్కరీ సమర్ధన...!

   20-09-2019


ఉల్లి ఘాటుతో ఉక్కిరి బిక్కిరి..!

ఉల్లి ఘాటుతో ఉక్కిరి బిక్కిరి..!

   20-09-2019


మోడీ హయాంలోనైనా మహిళా బిల్లుకు మోక్షం?

మోడీ హయాంలోనైనా మహిళా బిల్లుకు మోక్షం?

   20-09-2019


‘మహా’ ఎన్నికలు- బీజేపీ, శివసేన పొత్తుకు చిక్కులు

‘మహా’ ఎన్నికలు- బీజేపీ, శివసేన పొత్తుకు చిక్కులు

   19-09-2019


ఉరుములేని పిడుగులా..  జర్నలిస్టులపై ప్రగ్యా అనుచిత వ్యాఖ్యలు.!

ఉరుములేని పిడుగులా.. జర్నలిస్టులపై ప్రగ్యా అనుచిత వ్యాఖ్యలు.!

   19-09-2019


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle