newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

జనతా కర్ఫ్యూ ఉద్దేశం.. కావాలి అందరి భాగస్వామ్యం

21-03-202021-03-2020 08:45:25 IST
2020-03-21T03:15:25.116Z21-03-2020 2020-03-21T03:11:08.730Z - - 03-08-2020

జనతా కర్ఫ్యూ ఉద్దేశం.. కావాలి అందరి భాగస్వామ్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహమ్మారి వైరస్ కరోనా కట్టడికి యావత్ దేశం నడుం బిగించింది. కరోనా వైరస్ పై యుద్ధం చేద్దామని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఆదివారం జనతా కర్ఫ్యూ స్వచ్ఛందంగా పాటిద్దామని కోరారు. కరోనా వైరస్ పబ్లిక్ ప్లేసుల వద్ద 12 గంటలు జీవించి వుంటుంది. ఈ 12 గంటలు గనక ఈ బయటి ప్రాంతాల వద్దకు ఎవరూ వెళ్ళకుండా ఉండగలిగితే, ఈ వైరస్ 12 గంటల తర్వాత వెంటనే మరణిస్తుంది.

కానీ ప్రస్తుతం ఏం జరుగుతోందంటే 1 లేదా 2 గంటల్లోనే అందరూ ఈ వైరస్ వున్న స్థలాల్లో వుండడం తాకడం చేయడం వల్ల ఈ వైరస్ గణనీయంగా వ్యాప్తి చెందుతుంది. 12 గంటల పాటు దేశమంతా ఇంటిలోపలే వుండగలిగి ఈ పబ్లిక్ ప్లేసులల్లోని వైరస్ మరణించి దీని వ్యాప్తి చెందే చైన్ ప్రక్రియని మనం మన దేశంలో నియంత్రించగలిగితే మన దేశంలో ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయగలం. 

దేశ ప్రజలందరూ ఈ ఆదివారం అనగా మార్చి 22 న, ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఇళ్ళకే పరిమితమవ్వాలి. ఏమైనా తప్పని పరిస్థితుల్లో ఇళ్ళు వదిలి బయటకు వెళ్ళాల్సి వస్తే ఉదయం 7 గంటల లోపు మరియు రాత్రి 9 గంటల తర్వాత వెళ్ళవచ్చు. కొన్ని దేశాల్లో అన్ని పబ్లిక్ ప్లేసుల్లో సానిటైసర్స్ ని వెదజల్లడం అన్ని ప్రదేశాలను వీటితో తుడువడం మనం చూస్తూనే వున్నాం.

అది ఎంతవరకు ప్రాక్టికల్ అనేది సంశయమే! కానీ మనం ఇలా 12 గంటలు పబ్లిక్ ప్లేసుల్లోకి వెళ్ళకుండా దానంతట అదే మరణించేట్టు చేయగలిగితే 100 శాతం నిర్మూలించగలం... అందుకే 14 గంటల జనతా కర్ఫ్యూ ప్లాన్ చేయబడింది. ఏ మందులూ పబ్లిక్ ప్లేసుల్లో పిచికారి చేయక్కర్లేదు, తుడవక్కర్లేదు... 14 గంటలు వదిలేస్తే దానంతట అదే మరణిస్తుంది.

అందరూ సహకరిస్తే మనకు ఈ వైరస్ రాకుండా మనం మన పిల్లలని మన వృద్ధులని మన కుటుంబాలని మన సమాజాన్ని మన దేశాన్ని కాపాడుకోగలం. మర్చిపోకండి, ఎలాంటి కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవద్దు. జనతా కర్ఫ్యూ ఈ ఆదివారం ఉదయం 7 గంటలనుండి రాత్రి 9 గంటల వరకు, అంటే 14 గంటలు. సహకరిద్దాం, ఇది మన భవిష్యత్తు కోసమేనని గుర్తిద్దాం.సామూహిక కార్యక్రమాలకు దూరంగా వుండండి. 

కుటుంబంలోని సీనియర్ సిటిజన్లందరూ ఇళ్ళ నుండి బయటకు రావద్దు. చాలా అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని ప్రధాని కోరారు. ఇంటి నుండే అన్ని పనులు చక్క బెట్టుకోవాలని, కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడంలో సామాజిక దూరం చాలా ముఖ్యమైందని ప్రధాని పిలుపునిచ్చారు. సాయంత్రం 5 గంటలకు అందరూ బైటికి వచ్చి 5 నిమిషాలు చప్పట్లు కొట్టండి. కరోనా వ్యాప్తికి వ్యతిరేకంగా కృషి చేస్తున్న సిబ్బందికి కృతజ్ఞతగా ఇలా చేయాలి. నిత్యావసరాలు, అత్యవసర మందుల కొరత రాదు,  ఈ విషయంలో ప్రజలకు ఆందోళన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గ దర్శకాలను తప్పకుండా పాటించాలి.

కరోనావైరస్ నుండి ఉత్పన్నమయ్యే ఆర్థిక సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో కోవిడ్‌-19 ఎకనామిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనేక కష్టసమయాల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఇపుడు కూడా ఇలాంటి సంయమనాన్నే ప్రజలు పాటించాలి. కరోనా మహమ్మారిపై  మానవజాతి తుది విజయం సాధించాలి.

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   4 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   20 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle