newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

జనతా కర్ఫ్యూకి పెరుగుతున్న మద్దతు

22-03-202022-03-2020 08:36:01 IST
2020-03-22T03:06:01.054Z22-03-2020 2020-03-22T03:05:45.108Z - - 11-08-2020

జనతా కర్ఫ్యూకి పెరుగుతున్న మద్దతు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కట్టడికి భారత్ నడుం బిగించింది. ప్రధాని నరేంద్రమోడీ పిలుపుమేరకు జనతా కర్ఫ్యూ ఇవాళ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయింది. దేశంలో 14 గంటలు, తెలంగాణలో 24 గంటలు ఈ స్వీయనిర్బంధ కర్ఫ్యూ కొనసాగనుంది. భారత్‌లో 328కి  చేరింది కరోనా బాధితుల సంఖ్య. దీంతో కరోనా వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 

ఈ వైరస్‌ ప్రపంచ యుద్ధాలకంటే తీవ్రమైన ఆందోళన రేపుతోందని మోదీ అన్నారు. మొత్తం మానవజాతినే ప్రమాదంలోకి నెట్టేసిందని మోదీ వ్యాఖ్యానించారు. గత రెండు నెలలుగా ఈ సంక్షోభం ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తోందన్నారు. అయితే ఈ విషయంలో భారతదేశం విజయం సాధిస్తుందని  ప్రధాని భరోసా ఇచ్చారు.

అయితే కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రస్తుతానికి ఎలాంటి వాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు రేగడం సహజం. కానీ ప్రజలు అప్రమత్తంగా వుండి, ఈ వైరస్‌ బారినుంచి సురక్షితంగా బయటపడవచ్చు అని ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు.  మనం ఆరోగ్యంగా వుంటే.. ప్రపంచం ఆరోగ్యంగా వుంటుంది. సంకల్పం, అప్రమత్తత మాత్రమే కరోనాకు మందు అని ప్రధాని మోడీ సూచించారు.

భారత్‌ పై  కరోనా ప్రభావం లేదనుకోవడం తప్పు. విదేశాలనుంచి వచ్చేవారి ద్వారా ఇది ఇతరులకు వ్యాపిస్తోంది. దయచేసి కరోనా నిరోధానికి జనతా కర్ఫ్యూ పాటించాలని సూచించారు. గ్రూపులుగా తిరగవద్దు. స్వీయ నియంత్రణ అవసరమని, సామూహిక కార్యక్రమాలకు దూరంగా వుండాలన్నారు. కుటుంబంలోని సీనియర్ సిటిజన్లందరూ ఇళ్ళ నుండి బయటకు రావద్దన్నారు. చాలా అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని దేశ ప్రజలందర్ని కోరుతున్నానన్నారు మోడీ. 

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అంతా సహకరించాలన్నారు మోడీ. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూకి మద్దతు తెలిపాయి. మందుల షాపులు, హాస్పిటల్స్ తప్ప మూతపడ్డాయి. కరోనావైరస్ నుండి ఉత్పన్నమయ్యే ఆర్థిక సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో కోవిడ్‌-19 ఎకనామిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్‌ వివిధ రాష్ట్రాలకు కోవిడ్ నిరోధం కోసం అవసరమయిన మౌలిక వసతుల కోసం నిధులు విడుదల చేసింది. 

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   4 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   4 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   7 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   15 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle