newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

చైనా వెళుతున్నారా.... ఆ వైరస్‌తో తస్మాత్ జాగ్రత్త!

20-01-202020-01-2020 09:23:55 IST
2020-01-20T03:53:55.457Z20-01-2020 2020-01-20T03:53:51.016Z - - 12-08-2020

చైనా వెళుతున్నారా.... ఆ వైరస్‌తో తస్మాత్ జాగ్రత్త!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విద్యాసంబంధమయిన పనులు, వివిధ వ్యాపారాల నిమిత్తం చైనా వెళ్లేవారికి ఇది హెచ్చరికే. సార్స్‌ లక్షణాలతో  కొత్తరకం వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే 21 మందికి ఈ వైరస్ వ్యాపించింది. బాధితుల్లో భారతీయులు కూడా వుండడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ వైరస్ కారణంగా ఇద్దరు మరణించారు. దీంతో వివిధ దేశాలు అలర్ట్ ప్రకటించాయి. చైనాకి వెళ్లి తిరిగి స్వదేశాలకు వచ్చేవారి విషయంలో వివిధ రకాల పరీక్షలు తప్పనిసరి చేసింది.

ఈ వైరస్‌ సోకినవారిలో న్యుమోనియా, సార్స్‌ (సివియర్‌ ఎక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) వ్యాధుల లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనిని ప్రాథమికంగా ‘నావల్‌ కరోనా వైరస్‌'గా పిలుస్తున్నారు. ఈ వైరస్‌ను ఎలా నియంత్రించాలో వైద్యులకు అంతుచిక్కడం లేదు. ఇది మొదటిసారిగా సెంట్రల్‌ చైనాలోని వూహాన్‌ నగరంలో ప్రబలినట్టు వార్తలు వచ్చాయి. అందుకే ఈ వైరస్‌ను ‘వూహాన్‌ వైరస్‌'గానూ పిలుస్తున్నారు. నగరంలోని చేపల మార్కెట్‌లో ఈ వైరస్‌ ప్రబలిందని అధికారులు తెలిపారు. 

వూహాన్‌లోని మెడికల్‌ కాలేజీల్లో దాదాపు 500 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. దీంతో వైరస్‌ వ్యాప్తితో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. 62 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారని వుహాన్‌ వైద్య విభాగం తెలిపింది. ఆదివారం ఒక్కరోజే 17 మంది బాధితులను గుర్తించారు.  చైనా అధికారిక లెక్కల ప్రకారం 139మంది బాధితులు ఉంటే.. విదేశీ సంస్థలు 3వేల మంది వరకూ ఉంటారంటున్నాయి. 

ఈ వైరస్ 2002లో దక్షిణ చైనాలో ప్రబలింది. అది కొన్ని రోజుల్లోనే 25కు పైగా దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 మందిని ఈ వైరస్ కు బలయ్యారు. ఇప్పుడు కరోనా వైరస్‌ కూడా విదేశాలకు వేగంగా విస్తరిస్తున్నది. ఈ వైరస్ విషయంలో అన్ని దేశాలు తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దీంతో అమెరికాతోపాటు ఆసియా దేశాలు అప్రమత్తమయ్యా యి.

అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని నియమించాయి. చైనా నుంచి ముఖ్యంగా వుహాన్‌ నగరం నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు ఈ వైరస్‌ లక్షణాలున్నాయేమో తెలుసుకునేందుకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అమెరికాలోని మూడు విమానాశ్రయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వందమంది వైద్యసిబ్బంది ఈ విధుల్లో నిమగ్నమయ్యారు, ఇటు ఇండియా కూడా హెచ్చరికలు జారీచేసింది.

చైనాకు వెళ్లేవారు, తిరిగి వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇదిలా ఉంటే.. చైనాలో న్యూ ఇయర్ సంబరాలు వచ్చేవారం ప్రారంభం అవుతాయి. ఈనెల 25నుంచి ఫిబ్రవరి 8 వరకు ఇవి జరుగుతాయి. ఈ వేడుకల నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. వైరస్‌ ఇప్పటికే ఎన్ని ప్రాంతాలకు విస్తరించిందో అర్థంకావడంలేదంటున్నారు వైద్యాధికారులు. 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   10 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   12 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   20 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle