newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

చైనా పేరెత్తితే మండిపడుతున్న పశ్చిమదేశాలు... చర్యలకు సిద్ధం

04-04-202004-04-2020 10:25:14 IST
Updated On 04-04-2020 10:33:30 ISTUpdated On 04-04-20202020-04-04T04:55:14.690Z04-04-2020 2020-04-04T04:55:12.254Z - 2020-04-04T05:03:30.622Z - 04-04-2020

చైనా పేరెత్తితే మండిపడుతున్న పశ్చిమదేశాలు... చర్యలకు సిద్ధం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచానికి కరోనా వైరస్‌ను సోకించి తమాషా చూస్తున్న చైనాను ఇక ఏమాత్రం ఉపేక్షించేది లేదని పశ్చిమదేశాలు కారాలు, మిరియాలు నూరుతున్నాయి. ప్రత్యేకించి చైనా దేశీయుల ఆహారపు అలవాట్లపై పశ్చిమదేశాల ప్రజల్లో నాయకుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్ ఎపిసెంటర్‌గా తయారై యావత్ ప్రపంచానికి దాన్ని అంటించి తాను మాత్రం బయటపడిన వూహాన్ నగరం లాక్ డౌన్ ఎత్తివేసిన రెండురోజులకే రకరకాల పక్షులు, జంతువుల మాంసాహార కొట్లను తిరిగి తెరవడంపై మండిపడుతున్న పాశ్చాత్య దేశాలు ఇక చైనాపై అంతర్జాతీయ స్థాయిలో చర్యలు తీసుకోక తప్పదని నిర్ణయానికి వచ్చేశాయి.

దాంట్లో భాగంగానే చైనా ఆహార మార్కెట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ), ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేశారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ పుట్టుకకు కారణమైన సదరు మార్కెట్లు ప్రపంచానికి సమస్యగా పరిణమించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ ఆనవాళ్లు తొలిసారిగా చైనాలో బయటపడిన విషయం తెలిసిందే. వుహాన్‌ నగరంలో గతేడాది డిసెంబరులో పురుడు పోసుకున్న ఈ ప్రాణాంతక వైరస్‌ ధాటికి ప్రస్తుతం ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. 

ఈ నేపథ్యంలో చైనీయుల ఆహారపుటలవాట్లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చైనా మార్కెట్లలో ఇబ్బడిముబ్బడిగా కుక్కలు, పిల్లులు, గబ్బిలాలు ఇతర జంతువుల మాంసం అపరిశుభ్ర వాతావరణంలో అమ్ముతుండటం వల్లే ప్రాణాంతక వైరస్‌ పుట్టుకొచ్చిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్‌ మారిసన్‌ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

‘‘తడి మార్కెట్ల (అపరిశుభ్ర మాంసం మార్కెట్లు) కారణంగా ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో మనందరికీ తెలుసు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని డబ్ల్యూహెచ్‌ఓ, ఐరాస చర్యలు తీసుకోవాలి. ఈ వైరస్‌ చైనా మార్కెట్లో ఉద్భవించి ప్రపంచం మొత్తం విస్తరించింది. దీని కారణంగా ప్రపంచ మానవాళి మనుగడకు ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచానికి ఇది సవాలు విసిరింది. ఇలాంటి పరిస్థితుల్లో సదరు మార్కెట్లపై చర్యలు తీసుకోనట్లయితే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది’’ అని మారిసన్‌ హెచ్చరించారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 51 వేల మంది మరణించగా.. పది లక్షల మంది పైగా దీని బారిన పడ్డారు. 

మానవాళి మనుగడను ప్రమాదంలోకి నెట్టిన మహమ్మారి కరోనా సృష్టిస్తున్న అలజడి కారణంగా అమెరికా- చైనాల మధ్య తలెత్తిన మాటల యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. ప్రాణాంతక వైరస్‌  ప్రపంచమంతా విస్తరించడానికి చైనానే కారణమంటూ అమెరికా ఆరోపిస్తుండగా.. అమెరికా వల్లే ఈ దుస్థితి దాపురించిందని చైనా ఎదురుదాడికి దిగుతోంది. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనాను చైనీస్‌ వైరస్‌ అని సంబోధించడం సహా చైనా వెల్లడిస్తున్న కరోనా గణాంకాలపై అనుమానం వ్యక్తం చేస్తుండటంతో అధికార రిపబ్లికన్లు కూడా అదే పంథాను అనుసరిస్తున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీపై విమర్శల పర్వానికి తెరలేపారు. దీంతో కరోనా సంక్షోభం క్రమక్రమంగా రాజకీయ రంగు పులుముకుంటోంది. 

ఇక తాజాగా ఐరాసలో అమెరికా మాజీ రాయబారి, భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ సైతం చైనాపై వాగ్యుద్ధానికి దిగారు. కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలపై చైనా చెప్పే లెక్కలను నమ్మలేమని అనుమానాలు వ్యక్తం చేశారు. బీజింగ్‌ గణాంకాలను నమ్మకూడదంటూ అమెరికా సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీ శ్వేతసౌధ వర్గాలకు సూచించడాన్ని సమర్థించారు. 

ఈ మేరకు... ‘‘1.5 బిలియన్‌ జనాభా ఉన్న చైనాలో కేవలం 82,000 వేల కరోనా కేసులు, 3300 మరణాలు మాత్రమే సంభవించాయి. ఇవి కచ్చితంగా నిజమైన లెక్కలు కావు’’ అని ఆమె ట్వీట్‌ చేశారు. చైనాకు ప్రపంచ దేశాల సంక్షేమం కంటే కూడా తమ పరువే ముఖ్యమని.. అందుకే వైరస్‌పై గోప్యత పాటించిందని విమర్శించారు. తమ దేశంలో పుట్టిన వైరస్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాలకు సహాయం చేయడం కంటే చైనాకు పేరు ప్రఖ్యాతులపైనే ఎక్కువ దృష్టి ఉందని దుయ్యబట్టారు. 

కాగా చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ గణాంకాల ప్రకారం బుధవారం నాటికి అక్కడ 81,589 కరోనా బాధితులు ఉండగా... 3318 మంది మృత్యువాతపడ్డారు. ఇక అమెరికాలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. జాన్‌ హ్యాప్కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం అగ్రరాజ్యంలో 2,36,339 కరోనా కేసులు నమోదు కాగా.. 5 వేల మందికి పైగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది కరోనా బారిన పడగా... 51,485 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   13 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   16 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle