newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

చైనా నుంచి తరలివచ్చే భారీ పెట్టుబడులపై భారత్ కన్ను

14-05-202014-05-2020 08:03:17 IST
Updated On 14-05-2020 08:44:53 ISTUpdated On 14-05-20202020-05-14T02:33:17.704Z14-05-2020 2020-05-14T02:33:15.403Z - 2020-05-14T03:14:53.657Z - 14-05-2020

చైనా నుంచి తరలివచ్చే భారీ పెట్టుబడులపై భారత్ కన్ను
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తి, కట్టడి విషయంలో చైనా యావత్ ప్రపంచాన్ని మోసగించిందనే అభిప్రాయంతో ఆదేశం నుంచి బయటపడాలని భావిస్తున్న అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు ఎర్రతివాచీ పరచడానికి భారత్ శరవేగంగా పావులు కదుపుతోంది. ఒకవైపు లాక్ డౌన్ కారణంగా కుప్పగూలిపోయిన ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప చేయటం, మరోవైపు కొత్తగా పెట్టుబడులతో దేశంలోని వచ్చే కంపెనీలకు భారీగా భూములు కేటాయించడం అనే జంట లక్ష్యాలతో భారత కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రప్రభుత్వాలని అప్రమత్తం చేస్తోంది. విదేశాల నుంచి ప్రత్యేకించి చైనా నుంచి తరలి వచ్చే విదేశీ కంపెనీలకు పదేళ్లపాటు పన్ను విరామం ఇచ్చేందుకు కూడా కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.

మూడో దశ లాక్‌డౌన్‌ ముగింపు దశకు వచ్చిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడుతూ.. జీడీపీలో 10 శాతం పరిమాణం ఉండే విధంగా రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ సిద్ధమైందని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ ప్యాకేజీని బుధవారం నుంచి ప్రకటిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో చైనా నుంచి తరలివచ్చే పరిశ్రమలను ఆకర్షించడంపై ప్రధానంగా ప్రభుత్వం దృష్టి సారించవచ్చంటున్నారు. అందులో భాగంగా కొత్త పెట్టుబడులు తెచ్చే కంపెనీలకు కనీసం 10 సంవత్సరాల పన్ను విరామం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

50 కోట్ల డాలర్లకు (రూ.3,750 కోట్లు) పైబడి పెట్టుబడులు తెచ్చే కంపెనీలకు ఈ రాయితీలను వర్తింపచేయవచ్చు. అదే సమయంలో 10 కోట్ల డాలర్లు (రూ.750 కోట్లు), ఆ పైబడి పెట్టుబడులు తెచ్చే, కార్మిక శక్తి ప్రాధాన్యం గల కంపెనీలకు 4 ఏళ్ల పన్ను విరామం ఇవ్వొచ్చంటున్నారు. అలాగే ఈ రెండు విభాగాల్లోకి వచ్చే కంపెనీలకు కూడా రాబోయే ఆరు సంవత్సరాల కాలానికి 10 శాతం కార్పొరేట్‌ పన్ను మాత్రమే అమలు పరచవచ్చు. 

పెట్టుబడులతో ముందుకు వచ్చే కంపెనీలకు అవసరమైన భూములు కేటాయించడానికి సువిశాలమైన భూములు ఏయే రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నది కూడా గుర్తిస్తున్నట్టు అధికారవర్గాల సమాచారం. ఎక్కడెక్కడ పరిశ్రమల కేటాయింపునకు అవసరమైన విశాలమైన భూములున్నాయన్నది గుర్తించి తెలియచేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని, అలా అందుబాటులో ఉన్న భూములకు సంబంధించిన గణాంకాలు సిద్ధం చేసి ఇన్వెస్టర్లకు ప్రతిపాదించడం తాము చూసుకుంటామని పేరు వెల్లడించడానికి నిరాకరించిన ఒక అధికారి చెప్పారు. 

మోదీ లోక‌ల్‌-వోక‌ల్ నినాదానికి చైనాయే లక్ష్యం

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ త‌ల‌కిందులైపోయిన నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి ప్రధాని మోదీ రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. లాక్‌డౌన్‌ 4.0 ను సూచిస్తూ, దేశంలో లోక‌ల్‌-వోక‌ల్ ఫార్ములా అమ‌లవుతుంద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఈ ఫార్ములా ప్ర‌కారం మ‌న దేశం మునుపటి మాదిరిగా ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. దేశీయంగానే ఉత్ప‌త్తుల‌ను సాగిస్తూ, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ, చైనా ఉత్పత్తుల ఆధిపత్యాన్ని తగ్గించ‌నుంది. 

ఇందుకోసం ఆయా ప్రాంతాల‌లో తయారు చేసిన వస్తువుల వాడకానికి ప్రాధాన్యత క‌ల్పించ‌నున్నారు. దీనికి పీపీఈ కిట్‌ల‌నే ప్ర‌ధాని మోదీ ఉదాహరణగా చూపారు. దేశంలో తయారైన ఉత్పత్తులను అధికంగా ఉపయోగించాలని ప్ర‌ధాని మోడీ నొక్కిచెప్పడానికి చైనాతో భారతదేశ దౌత్య సంబంధమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రపంచ‌మంతా కరోనా వైరస్‌పై యుద్ధం చేస్తూ, ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి ప్రయత్నిస్తుండగా, చైనా ఇతర దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు చేస్తూ, త‌ద్వారా ల‌భించిన ఆదాయంతో తన రహస్య కార్యకలాపాలను కొన‌సాగిస్తున్న‌ద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. 

అలాగే చైనా పొరుగు దేశాలతో క‌య్యానికి కాలు దువ్వుతూ ఉద్రిక్త‌త‌లు సృష్టిస్తోంది. దీనికి చైనా - భారత సైన్యాల‌ మ‌ధ్య లడఖ్, సిక్కింల‌లో చోటుచేసుకున్న ఘ‌ట‌న‌లే ఉదాహ‌ర‌ణ‌లుగా నిలిచాయి. ఇటువంటి పరిస్థితిలో ఆసియాలో చైనాకు పెరుగుతున్న ప్రభావాన్ని తగ్గించే సామర్ధ్యం భారతదేశానికి ఉంది. ఈ నేప‌ధ్యంలో మోదీ చెప్పిన లోకల్‌-ఓక‌ల్ ఫార్ములా అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. 

మొబైల్స్, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్స్, లైటింగ్ సహా అనేక ఉత్పత్తులు చైనా నుండి భార‌త్‌కు దిగుమ‌తి అవుతున్నాయి. చైనా తన ఉత్పత్తులను భారతదేశంలో విక్రయించడం ద్వారా ఆదాయాన్ని స‌మ‌కూర్చుకుంటోంది. ఈ సొమ్మును తన దేశాన్ని అభివృద్ధి చేయడానికి, ఆసియాపై ఆధిపత్యాన్ని కొనసాగించడానికి చైనా ఉపయోగిస్తుంది. దౌత్య స్థాయిలో చైనా చేస్తున్న ఈ చర్యను అధిగమించి, భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకే ప్రధాని మోదీ లోకల్- వోకల్ నినాదం ఇచ్చారు.

దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ మంగళవారం రాత్రి 8 గంటల నుంచి దాదాపు 35 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో కూడా కూడా మోదీ స్వావలంబనకు పెద్ద పీట వేశారు. కరోనా సంక్షోభం కారణంగా అనుకోకుండానే స్వయం సమృద్ధి దిశగా ముందడుగు వేశామన్నారు. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా మారిన పరిస్థితులను, కరోనా సంక్షోభాన్ని భారత్‌ సమర్ధంగా ఎదుర్కొన్న తీరును ప్రధాని తన ప్రసంగంలో వివరించారు. కరోనా చికిత్సకు అవసరమైన ఔషధాలను భారత్‌ అనేక ప్రపంచదేశాలకు సరఫరా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

స్వయం సమృద్ధి సాధించడానికి, ప్రపంచంలోనే అత్యుత్తమంగా రూపొందడానికి భారత్‌కు కరోనా సంక్షోభం ద్వారా అవకాశం లభించిందన్నారు. మనమంతా దేశీయ ఉత్పత్తులను కొనడమే కాదు. వాటికి ప్రచారం కూడా చేయాలి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన సంస్థలన్నీ ఒకప్పుడు స్థానికంగా ఏర్పడినవే. కృషి, పట్టుదల, నాణ్యత, ప్రచారం.. మొదలైన వాటితో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాయి. దేశీయ సంస్థలు ఆ దిశగా ముందుకు వెళ్లాలి. అందుకు మనమంతా ప్రోత్సహించాలి. 

మొత్తంమీద చైనా సాగిస్తున్న ఆర్థిక ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు భారత్ ముందు చక్కటి అవకాశం వేచిచూస్తోంది. ఈ అవకాశాన్ని ఎంత బాగా వినియోగించుకుంటామన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సయోధ్య, సమన్వయంపైనే ఆధారపడి ఉంది. 

రెండు పార్టీలు రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ చేసినా తిరస్కరించాను..

రెండు పార్టీలు రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ చేసినా తిరస్కరించాను..

   an hour ago


ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నెలకు ₹ 1,000 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది: నితిన్ గడ్కరీ

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నెలకు ₹ 1,000 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది: నితిన్ గడ్కరీ

   19-09-2021


సోనూసూద్ రూ.20 కోట్ల పన్ను ఎగవేసారా..?

సోనూసూద్ రూ.20 కోట్ల పన్ను ఎగవేసారా..?

   18-09-2021


గత 24 గంటల్లో దేశంలో 35,662 కొత్త కోవిడ్ కేసులు, నిన్నటి కంటే 3.65% ఎక్కువ

గత 24 గంటల్లో దేశంలో 35,662 కొత్త కోవిడ్ కేసులు, నిన్నటి కంటే 3.65% ఎక్కువ

   18-09-2021


ప్రధాన మంత్రి పుట్టినరోజు నాడు రికార్డు వాక్సినేషన్... ఒక్క రోజులో 2.5 కోట్ల కోవిడ్ టీకాలు

ప్రధాన మంత్రి పుట్టినరోజు నాడు రికార్డు వాక్సినేషన్... ఒక్క రోజులో 2.5 కోట్ల కోవిడ్ టీకాలు

   18-09-2021


పెట్రోల్, డీజిల్ ని GST కింద తీసుకురావడానికి ప్రయత్నించాం: నిర్మలా సీతారామన్.. కానీ

పెట్రోల్, డీజిల్ ని GST కింద తీసుకురావడానికి ప్రయత్నించాం: నిర్మలా సీతారామన్.. కానీ

   17-09-2021


11 వ తరగతి పరీక్షలను నిర్వహించడానికి ఆ రాష్ట్రానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

11 వ తరగతి పరీక్షలను నిర్వహించడానికి ఆ రాష్ట్రానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

   17-09-2021


ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా 20 రోజుల మెగా వాక్సినేషన్ కార్యక్రమం

ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా 20 రోజుల మెగా వాక్సినేషన్ కార్యక్రమం

   17-09-2021


అయోధ్య రామ మందిర నిర్మాణం మొదటి దశ పూర్తైంది

అయోధ్య రామ మందిర నిర్మాణం మొదటి దశ పూర్తైంది

   16-09-2021


థర్డ్ వేవ్ లేదు.. రాబోయే ఆరు నెలల్లో కరోనా వైరస్ మరింత బలహీన పడుతుంది

థర్డ్ వేవ్ లేదు.. రాబోయే ఆరు నెలల్లో కరోనా వైరస్ మరింత బలహీన పడుతుంది

   16-09-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle