newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

చైనా కొట్టిన కరోనా దెబ్బకు భారత్‌ సహాయంపై 30 దేశాల కన్ను

08-04-202008-04-2020 12:59:52 IST
Updated On 08-04-2020 13:06:01 ISTUpdated On 08-04-20202020-04-08T07:29:52.667Z08-04-2020 2020-04-08T07:03:10.470Z - 2020-04-08T07:36:01.695Z - 08-04-2020

చైనా కొట్టిన కరోనా దెబ్బకు భారత్‌ సహాయంపై 30 దేశాల కన్ను
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొదట కరోనాతో యావత్ ప్రపంచానికి చైనా గట్టిగా వాతపెట్టింది. ఇప్పటికీ దాని దెబ్బనుంచి కోలుకోలేక ప్రపంచం విలవిల్లాడుతోంది. ప్రస్తుతం నాసిరకం వెటిలేటర్లు, అండర్‌వేర్‌లతో తయారు చేసిన నాసిరకం మాస్క్‌లు ఇతర వైద్య సామగ్రిని ప్రపంచానికి సప్లయ్ చేస్తూ ఇతర దేశాలను ఉసూరు మనిపిస్తోంది చైనా. ఈ రెండు దాడుల తాకిడిని తట్టుకోలేక కరోనా వైరస్ నివారణకు అవసరమైన ఔషధాల కోసం దాదాపు 30 దేశాలు భారత్‌ను అభ్యర్థిస్తున్నాయి. మన దేశం కూడా ఎవరినీ కాదనకుండా తన అవసరాలకు కాస్త మిగిల్చుకుని అమెరికాతో సహా ఇతర దేశాలకు తప్పకుండా ఔషధాలను పంపుతానని హామీ ఇచ్చింది. చరిత్ర కనీవినీ ఎరుగని మహమ్మారితో తలపడలేక తలలువాల్చేస్తున్న దేశాలను భారత్ ఏదో ఒకరకంగా ఆవసరానికి ఆదుకోవడం మనకు గర్వకారణమనే చెప్పాలి,

కరోనా వైరస్‌ ధాటికి చిగురుటాకులా వణుకుతున్న ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్‌వైపు చూస్తున్నాయి. ఇతర దేశాలతో పోల్చుకుంటే మహ్మమారి కరోనా వైరస్‌ భారత్‌పై ప్రభావం చూపినా.. కొంతమేర కట్టడి చేయగలిగాం అనేది అందరికీ తెలిసిందే. వైరస్‌ వ్యాప్తి చెందకుండా భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అగ్రరాజ్యం అమెరికా కూడా ప్రశంసలు కురిపించింది. అయితే కోవిడ్‌-19కు ఇప్పటి వరకు విరుగుడు కనిపెట్టక పోవడం ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో మలేరియా నిరోధానికి వాడే హైడ్రాక్సీ ‍ క్లోరోక్వీన్‌తో పాటు పారాసిట్‌మాల్‌ ఔషధాన్ని కరోనా బాధితులకు అందిస్తున్నారు. 

ఈ క్రమంలోనే వైరస్‌ విజృంభణతో వేలసంఖ్యలో ప్రాణాలను కోల్పోతున్న అమెరికాకు భారత్‌ ఆపద్భాందవుడిలా కనిపింది. హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ మెడిసిన్‌ను తమకు కూడా ఎగుమతి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత ప్రభుత్వానికి కోరారు. ప్రధాని నరేంద్ర మోదీకి ట్రంప్‌ స్వయంగా ఫోన్‌ చేసి.. ఈ మెడిసిన్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా అమెరికన్‌ కంపెనీలు మెడిసిన్‌ కోసం భారత్‌కు అర్డర్‌ కూడా పెట్టుకున్నాయి.  

అయితే భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజరోజుకూ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ముందుగానే హైడ్రా​క్సీ ‍క్లోరోక్వీన్‌ ఔషధ అవసరాన్ని గుర్తించింది. ఇతర దేశాలకు ఆ మెడిసన్‌ ఎగుమతులను నిషేధిస్తూ మార్చి 24న ఉత్తర్వులు జారీచేసింది. 

మరోవైపు అమెరికా, సార్క్‌ దేశాలతో పాటు మరో 30 దేశాలు భారత్‌ సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ మేరకు హైడ్రా​క్సీ ‍క్లోరోక్వీన్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి.. తమకు సహాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే వీటికి కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది. ప్రస్తుతం టాబ్లెట్ల వినియోగం పెద్ద ఎత్తున ఉండటంతో.. వీలైనంత స్టాక్‌ను తమ వద్ద ఉంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 

దీంతో అమెరికాతో పాటు ఇతర దేశాలకు తీవ్ర నిరాశ ఎదురైంది. కాగా భారత్‌లో కరోనా బాధితులకు ప్రస్తుతం​ హైడ్రాక్సీ ‍ క్లోరోక్వీన్‌ మెడిసిన్‌ను వినియోగిస్తున్న విషయం తెలిసిందే.

ఒకవైపు డొనాల్డ్‌ ట్రంప్ ప్రతీకారం తీర్చుకుంటామంటూ చేస్తున్న హెచ్చరికలు, మరోవైపు మిత్రదేశాలు చేస్తున్న అభ్యర్థనల ప్రభావంతో భారత్ అమెరికాతో సహా 30 దేశాలకు హైడ్రా​క్సీ ‍క్లోరోక్వీన్‌ మాత్రలను అందచేస్తానని హామీ ఇచ్చింది. విధానపరమైన చర్చలు ముగిశాక వీలైనంత త్వరలోనే భారత్ తన ఆపన్నహస్తం అందించడానికి సిద్ధంగా ఉంది.

కరోనా విరుగుడుకు నిర్దిష్టమైన మందేమీ లేకున్నప్పటికీ  హైడ్రాక్సీ క్లోరోక్విన్ తప్ప మరో దిక్కులేదని, అది దేవుడిచ్చిన కానుక అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన రోజునుంచి యావత్ ప్రపంచం దృష్టి ఈ మందుపైనే పడింది. కానీ ఈ డ్రగ్ తయారీలో భారత్ నంబర్ వన్. ప్రధానంగా కీళ్లవాతానికి, మలేరియాకు భారత్‌లో వాడే ఈ మందు కరోనాపై కూడా ప్రభావవతంగా పనిచేస్తుందని తేలడంతో దేశాలకు దేశాధినేతలు భారత ప్రధానికి పోన్లు చేయడం మొదలెట్టారు. 

అటు అమెరికా ఒత్తిడి, ఇటు ప్రపంచ దేశాల అభ్యర్థనల ప్రభావంతో మన అవసరాలకు 25 శాతం కలుపుకుని ఆ మాత్రం నిల్వ ఉండేలా చూసుకుంటూ మిగతా ఉత్పత్తిని బయటి దేశాలకు ఎగుమతి చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది.

కొసమెరుపు:

ప్రాణాంతక కరోనా వైరస్‌తో అల్లాడుతున్న దేశాలకు అత్యవసరమైన మందులను సరఫరా చేస్తామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. మహమ్మారిని కట్టడి చేయడంలో సత్ఫలితాలు అందిస్తున్న పారాసిటమోల్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎగుమతి చేస్తామని పేర్కొంది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘‘అంటువ్యాధి ప్రబలుతున్న తరుణంలో మానవతా దృక్పథంతో పారాసిటమోల్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలను మన శక్తిసామర్థ్యాలపై ఆధారపడిన పొరుగు దేశాలకు సరఫరా చేయాలని నిర్ణయించాం. నిర్దిష్ట స్థాయిలో ఎగుమతి చేస్తాం. కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశాలకు కూడా సహాయం అందిస్తాం. ఇందులో రాజకీయాలకు ఎటువంటి తావులేదు. విపత్కర పరిస్థితుల్లో భారత్‌ అంతర్జాతీయ సమాజానికి సంఘీభావం తెలుపుతోంది. అన్ని దేశాలు పరస్పర సహాయసహకారాలు అందించుకోవాలి’’ అని అనురాగ్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. 

పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   7 hours ago


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   a day ago


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


చైనాలో తీవ్రమైన వరదలు మధ్య రైలు లోపల ప్రయాణికులు చిక్కుకున్నారు, 12 మంది మరణించారు

చైనాలో తీవ్రమైన వరదలు మధ్య రైలు లోపల ప్రయాణికులు చిక్కుకున్నారు, 12 మంది మరణించారు

   21-07-2021


Monkey B: చైనా లో మంకీ బి అనే మరో కొత్త వైరస్.. 60 కేసులు, ఒకరి మరణం నమోదు

Monkey B: చైనా లో మంకీ బి అనే మరో కొత్త వైరస్.. 60 కేసులు, ఒకరి మరణం నమోదు

   20-07-2021


యూనిఫాం సివిల్ కోడ్‌ గురించిన తెలియని కొన్ని విషయాలు... వారిలో వారు

యూనిఫాం సివిల్ కోడ్‌ గురించిన తెలియని కొన్ని విషయాలు... వారిలో వారు

   19-07-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle