newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

చైనాలో మళ్లీ లాక్ డౌన్.. గృహ నిర్బంధంలో 25 కోట్లమంది జనం..!

20-05-202020-05-2020 14:55:23 IST
Updated On 20-05-2020 15:57:10 ISTUpdated On 20-05-20202020-05-20T09:25:23.275Z20-05-2020 2020-05-20T09:25:21.471Z - 2020-05-20T10:27:10.021Z - 20-05-2020

చైనాలో మళ్లీ లాక్ డౌన్..  గృహ నిర్బంధంలో 25 కోట్లమంది జనం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనాతో సహజీవనం తప్పదు. వైరస్ వస్తుంటుంది.. పోతుంటుంది. దానికి అలవాటు పడాల్సిందే అంటూ మన రాజకీయ నాయకులు చెబుతుంటే నోళ్లు తెరిచేశాం కానీ అది నిజమేనని చైనా మరోసారి నిరూపించింది. కరోనా వైరక్ కేంద్రమైన వూహాన్‌లో 76 రోజుల పాటు కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేసిన చైనా ప్రభుత్వం వైరస్ ప్రభావం సద్దుమణగటంతో ప్రస్తుతం ఆ నిబంధనల్ని నగరంలో పూర్తిగా సడలించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా జిలిన్‌ ప్రావిన్స్‌లో కొత్తగా 34 కేసులు బయట పడటంతో అప్రమత్తమైన ప్రభుత్వం‌ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 10.8 కోట్ల మంది జనాభా ఉండే జిలిన్‌ ప్రావిన్స్‌లో ఈ రోజు నుంచి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. జిలిన్, లియావోనింగ్, హైలోంగ్జియాంగ్ ప్రాదేశిక ప్రాంతాల్లో మొత్తంమీద  25 కోట్లమంది మళ్లీ లాక్ డౌన్ ప్రభావంలో పడ్డారని సమాచారం. చైనాలో పుట్టిన కరోనా అక్కడ అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ అక్కడ కలకలం సృష్టిస్తోంది. ఇది ప్రపంచానికంతటికీ కరోనాతో జాగ్రత్త అంటూ హెచ్చరికలు పంపుతోంది.

తాజా పరిణామంతో ఈశాన్య చైనాలో భాగమైన జిలిన్ ప్రాంతంలో బస్సులు, రైళ్లు రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. పాఠశాలలు, కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. గత శని, ఆదివారాల్లో మొత్తం 5 కేసులు నమోదవడంతోపాటు మొత్తం కేసులు సంఖ్య 34కి పెరగటంతో ప్రమాదాన్ని శంకించిన చైనా ప్రభుత్వం దాదాపు 25 కోట్లమందిని మళ్లీ గృహనిర్బంధంలోకి నెట్టేసింది.

కరోనా వైరస్ కట్టడికి మళ్లీ కఠిన చర్యలకు చైనాలోని ప్రాదేశిక ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. కరోనా బాధితులు, అనుమానితులు ఉన్నట్లు తేలిన ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. నిత్యావసరాలను కొనుగోలు చేసేందుకు కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుందని, అది కూడా రెండురోజులకు ఒకసారి రెండు గంటలపాటు మాత్రమే అనుమతిస్తామని చైనా అధికారులు తేల్చిచెప్పారు.

వైరస్ కట్టడి అయినట్లే భావిస్తున్న తరుణంలో మళ్లీ పెద్దసంఖ్యలో కేసులు పెరగడం అనూహ్యంగా ఉంది. అయితే రష్యాలో ఉండే చైనా పౌరులు స్వదేశానికి తిరిగిరావడంతో వారిద్వారానే ఈ కొత్త కేసులు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. చైనాలో ఇప్పటివరకు దాదాపు 84 వేలకు పైగా కేసులు నమోదు కాగా, 4,638 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పుడు చైనాలో యాక్టివ్ కేసులు 2 వేలే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

మరోసారి వైరస్ దాడి చేస్తుండటంతో అప్రమత్తమైన చైనా కేంద్ర నాయకత్వం ఉన్న ఫళాన పోలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, ఉప ప్రధాని సన్ చులాన్‌ని జిలిన్ నగరానికి పంపింది. మే 13నే జిలిన్ చేరుకున్న చులాన్ ప్రజలకు ధైర్యం చెబుతూ జాగ్రత్తలు పాటించాల్సిందేనని హెచ్చరించారు. మరుసటి రోజు 12 టీములుతో కూడిన మెడికోలను పొరుగు రాష్ట్రమైన లియావోనింగ్ నుంచి తరలించారు. అదేసమయంలో వూహాన్‌లో కొత్తగా ఆరు కేసులు నమోదవడంతో మాస్ పరీక్షలకు  సిద్ధమయ్యారు. 

కరోనాతో సహజీవనం అంటే మళ్లీ మళ్లీ లాక్ డౌన్ అని ప్రపంచం మెల్లమెల్లగా తెలుసుకుంటోంది.

 

 

లాక్ డౌన్ నియంత్రణ ఇక చాలు.. కరోనాకు భయపడం అంటున్న అమెరికన్లు

లాక్ డౌన్ నియంత్రణ ఇక చాలు.. కరోనాకు భయపడం అంటున్న అమెరికన్లు

   16 hours ago


భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగే రోజు సాకారం.. దేశ ప్రజలకు మోదీ లేఖ

భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగే రోజు సాకారం.. దేశ ప్రజలకు మోదీ లేఖ

   17 hours ago


 లాక్ డౌన్ పై రాష్ట్రాలదే నిర్ణయం ..ఆ నగరాలపైనే  ఫోకస్

లాక్ డౌన్ పై రాష్ట్రాలదే నిర్ణయం ..ఆ నగరాలపైనే ఫోకస్

   30-05-2020


ఒక్కరోజే 7,466 కరోనా కేసులు.. కరోనా మరణాల్లో చైనాను దాటేసిన భారత్?

ఒక్కరోజే 7,466 కరోనా కేసులు.. కరోనా మరణాల్లో చైనాను దాటేసిన భారత్?

   30-05-2020


ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్‌.. తిప్పికొట్టిన సంస్థ సీఈఓ

ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్‌.. తిప్పికొట్టిన సంస్థ సీఈఓ

   29-05-2020


కరోనా ఆందోళన.. ప్రపంచంలో 9వ స్థానానికి ఇండియా

కరోనా ఆందోళన.. ప్రపంచంలో 9వ స్థానానికి ఇండియా

   29-05-2020


నేపాల్ ప్రధానికి భారత్ గట్టి కౌంటర్.. కొత్త మ్యాపులకు బ్రేక్

నేపాల్ ప్రధానికి భారత్ గట్టి కౌంటర్.. కొత్త మ్యాపులకు బ్రేక్

   29-05-2020


కాశ్మీర్లో ఐఈడీతో భారీ కుట్ర.. భగ్నం చేసిన భద్రతాదళాలు

కాశ్మీర్లో ఐఈడీతో భారీ కుట్ర.. భగ్నం చేసిన భద్రతాదళాలు

   28-05-2020


లాక్ డౌన్ 5.O.. మరో రెండువారాలు గ్యారంటీనా?

లాక్ డౌన్ 5.O.. మరో రెండువారాలు గ్యారంటీనా?

   28-05-2020


కరోనా వ్యాప్తిలోనే కాదు వేసవి తీవ్రతలోనూ మనమే టాప్

కరోనా వ్యాప్తిలోనే కాదు వేసవి తీవ్రతలోనూ మనమే టాప్

   27-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle