newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

చైనాకు బాలాకోట్‌ను గుర్తు చేశాం.. వాయుసేనపై రాజ్‌నాథ్ ప్రశంసలు

23-07-202023-07-2020 08:27:20 IST
2020-07-23T02:57:20.112Z23-07-2020 2020-07-23T02:57:02.963Z - - 12-08-2020

చైనాకు బాలాకోట్‌ను గుర్తు చేశాం.. వాయుసేనపై రాజ్‌నాథ్ ప్రశంసలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చైనాతో సరిహద్దు వివాదం విషయంలో భారత వాయుసేన చురుకుగా వ్యవహరించి ప్రత్యర్థికి బలమైన సందేశాన్ని పంపిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ కొనియాడారు. తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో యుద్ధవిమానాలను వేగంగా మోహరించడం ద్వారా వాయుసేన తన యుద్ధ సన్నద్ధతను చాటిందని, తద్వారా పాకిస్థాన్‌పై భారత్‌ జరిపిన బాలాకోట్‌ దాడిని చైనాకు గుర్తు చేసిందని ఆయన బుధవారం ఢిల్లీలో మొదలైన వాయుసేన సదస్సులో అన్నారు.  రానున్న దశాబ్దాల్లో భారతీయ వాయుసేన అనే థీమ్‌తో మొదలైన ఈ సదస్సులో వాయుసేన ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు. 

తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో దేశ ప్రజలందరి నమ్మకం త్రివిధ దళాలపై ఉందని రాజ్‌నాథ్‌ అన్నారు. సరిహద్దులు దాటి మరీ బాలాకోట్‌పై వాయుసేన జరిపిన దాడిని గుర్తు చేస్తూ వాయుసేన ఈ విషయంలో అత్యంత నైపుణ్యంతో వ్యవహరించిందని అన్నారు. తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో వాయుసేన యుద్ధ విమానాల మోహరింపు ఇలాంటిదేనని మంత్రి పేర్కొన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదలచేసింది. 

వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వివరించిన మంత్రి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా వాయుసేన సిద్ధంగా ఉండాలని కోరారు. శత్రువులను ఎదుర్కొనేందుకు వాయుసేన సన్నద్ధంగా ఉంటుందని సదస్సులో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ బధూరియా స్పష్టం చేశారు.

తూర్పు లద్ధాఖ్‌ సెక్టార్‌లో భారత్‌–చైనా సరిహద్దు నుంచి తమ బలగాలను వెనక్కి మళ్లిస్తున్నామని పైకి చెబుతున్న చైనా ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. బలగాల మళ్లింపుపై ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని చైనా పీపుల్స్‌ రిబరేషన్‌ ఆర్మీ లెక్కచేయడం లేదు. ప్రస్తుతం అక్కడ దాదాపు 40,000 మంది చైనా సైనికులు తిష్ట వేసినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. భారీ ఎత్తున ఆయుధ సామగ్రిని సైతం కలిగి ఉన్నట్లు తెలియజేసింది. 

భారత్‌–చైనా కమాండర్ల స్థాయి చర్చలు గత వారంలోనే జరిగాయి. సరిహద్దు ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి తీసుకోవాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించుకున్నారు. అయినా చైనా తన పంథా మార్చుకోవడం లేదు.

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   8 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   9 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   20 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle