newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా బిపిన్ రావత్.. ఆర్మీచీఫ్ గా లెఫ్టినెంట్ మనోజ్ ముకుంద్

31-12-201931-12-2019 15:37:57 IST
Updated On 31-12-2019 16:10:15 ISTUpdated On 31-12-20192019-12-31T10:07:57.434Z31-12-2019 2019-12-31T10:07:53.652Z - 2019-12-31T10:40:15.960Z - 31-12-2019

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా బిపిన్ రావత్.. ఆర్మీచీఫ్ గా లెఫ్టినెంట్ మనోజ్ ముకుంద్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌‌‌కు కీలక బాధ్యతలు అప్పగించింది కేంద్రం. ఇవాళ పదవీ విరమణ చేయనున్న ఆయనను దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా (సీడీఎస్) గా  కేంద్రం నియమించింది. జనరల్ రావత్ మంగళవారం ఆర్మీ చీఫ్ పదవి నుంచి రిటైర్ అవుతున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవి ఏర్పాటుకు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ వారం క్రితమే అంగీకారం తెలిపింది.

రక్షణ శాఖ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మిలటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలను కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ పర్యవేక్షిస్తారు. సీడీఎస్ 65 ఏళ్ళ వయసు వరకూ లేదా మూడేళ్ళపాటు పదవిలో వుంటారు. మరోవైపు బిపిన్ రావత్ స్థానంలో ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నియమితులయ్యారు. బిపిన్ రావత్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. 

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ నాయకత్వంలోని కమిటీ.. చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బాధ్యతలు, పాత్ర గురించి ఫైనలైజ్ చేశాక.. కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ దానికి ఆమోదం తెలిపింది.  ‘మిగతా మూడు విభాగాధిపతులతో సమానంగా సీడీఎస్‌ జీతభత్యాలను అందుకుంటారు. మిలిటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా సీడీఎస్ పని చేస్తారు’ని మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.

భారత త్రివిధ దళాలు మిలిటరీ వ్యవహారాల శాఖ కిందకు వస్తాయి. త్రివిధ దళాలకు వేర్వేరు అధిపతులు ఉండగా.. వీరి ముగ్గురిపైన ఓ అధికారిని నియమించాలని 1980లో జనరల్ కేవీ కృష్ణారావు ప్రతిపాదించారు. 1999 కార్గిల్ యుద్ధం సమయంలో చాలా మంది సైనికులు, సీనియర్ అధికారులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 20 ఏళ్ల తర్వాత ఈ పదవికి ఆమోదం తెలిపింది. తొలి సీడీఎస్ గా నియమితులయిన బిపిన్ రావత్ కు పలువురు అభినందనలు తెలిపారు. సీడీఎస్ ఏర్పాటుతో త్రివిధ దళాలు, ప్రభుత్వం మధ్య సమన్వయం మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు. 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle