newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

చిన్నారులు, మహిళలపై పెరిగిన హింస.. బీహార్లో మహిళపై అఘాయిత్యం

11-04-202011-04-2020 18:38:17 IST
2020-04-11T13:08:17.923Z11-04-2020 2020-04-11T13:08:08.640Z - - 09-08-2020

చిన్నారులు, మహిళలపై పెరిగిన హింస.. బీహార్లో మహిళపై అఘాయిత్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు లాక్ డౌన్, కరోనా భయం వున్నా దేశంలో సాధారణ నేరాలు తగ్గుముఖం పట్టినా దేశవ్యాప్తంగా చిన్నారులు, మహిళలపై హింస, వేధింపులు పెరుగుతున్నాయి. చిన్నారులకు రక్షణ కల్పించాలంటూ జాతీయ చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ కు 11 రోజుల్లో 92 వేల కాల్స్ వచ్చాయని అధికారులు వెల్లడించారు. మహిళలపై గృహ హింస ఫిర్యాదులు కూడా ఎక్కువగా వస్తున్నాయని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖాశర్మ తెలిపారు.

చిన్నారుల రక్షణ కోసం భారత ప్రభుత్వం 1098 నంబరుతో చైల్డ్  హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది. ఈ నంబర్ కు మార్చి 20-31 మధ్య కాలంలో 3.07 లక్షల కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా మహిళలకు సంబంధించి అనేక ఫిర్యాదులు అందినట్లు జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ తెలిపారు. లాక్ డౌన్ విధించినప్పటి నుంచి రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతోందని చెప్పారు. ఈ మెయిల్స్ ద్వారానే ఇప్పటివరకు 69 ఫిర్యాదులు అందాయని వెల్లడించారు.

మొత్తం మార్చి 24 నుంచి ఏప్రిల్ 1 వరకు మహిళలపై నేరాలకు సంబంధించి 257 ఫిర్యాదులు అందినట్లు రేఖా శర్మ చెప్పారు. వీటిలో 69 కేసులు గృహ హింసకు సంబంధించినవేనని తెలిపారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఎక్కువమంది ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నట్లు రేఖా శర్మ వెల్లడించారు. కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు ఎక్కువవుతాయన్న భయం వారిలో ఉందని చెబుతున్నారు.

రోజు రోజుకు కరోనా వైరస్ పెరిగిపోతున్నవేళ మహిళలకు కూడా రక్షణ లేకుండా పోతోంది. మెడికల్ కాలేజీలను ఐసోలేషన్ వార్డులుగా మారుస్తున్నారు.  అయితే, కరోనా కారణంగా దేశంలో నేరాలు తగ్గాయి. అంతా లాక్ డౌన్లో వున్నారు కదాని సంతోషించినంత సేపు ఆగలేదు. మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు.  బీహార్ లో ఓ మహిళపై వైద్యులు అత్యాచారం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. కరోనా నేపథ్యంలో వైరస్ పరీక్షలకు వచ్చిన మహిళను కూడా మృగాళ్ళు వదలలేదు.

బీహార్ లో కరోనా అనుమానంతో హాస్పిటల్ కు వచ్చిన మహిళా ఎక్కువ దూరం నుంచి నడుచుకుంటూ రావడంతో గర్భస్రావం జరిగింది. కరోనా అనుమానంతో రావడంతో ఆమెను ఐసోలేషన్ వార్డులో ఉంచారు.  అయితే, ఆమెపై అక్కడ పనిచేసే వైద్యులు కన్నేశారు.  ఈసమయంలో వైద్యులు దేవుడితో సమానం అని అనుకుంటున్న సమయంలో, హాస్పిటల్ కు వచ్చిన మహిళను, అది కరోనా అనుమానంతో వచ్చిన మహిళపై  అత్యాచారం చేశారని సమాచారం. అనంతరం ఆమెకు కరోనా నెగెటివ్ రాకపోవడంతో ఇంటికి పంపించారు.  

ఇంటికి పంపించిన తరువాత హాస్పిటల్ లో  జరిగిన విషయం భర్తకు, అత్తమామలకు చెప్పింది.  విషయం విని ఆమె బంధువులు షాకయ్యారు.  తీవ్ర అబార్షన్ కు తోడు, వైద్యుల పైశాచిక చర్యతో రక్తస్రావం జరగడంతో  ఆమె కన్నుమూసింది. వెంటనే బంధువులు పోలీసులకు కంప్లైంట్ చేశారు.  పోలీసులు కేసు దర్యాప్తు చేసుకొని విచారణ చేపడుతున్నారు. 

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   13 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   16 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle