newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

చిక్కుల్లో కమల్ హాసన్.. కామెంట్లపై కేసు

15-05-201915-05-2019 14:50:15 IST
2019-05-15T09:20:15.470Z15-05-2019 2019-05-15T09:20:09.200Z - - 21-08-2019

చిక్కుల్లో కమల్ హాసన్.. కామెంట్లపై కేసు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (ఎమ్‌ఎన్‌ఎమ్‌) పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌ చిక్కుల్లో పడ్డారు. స్వాతంత్య్ర భారత్‌లో తొలి తీవ్రవాది ఒక హిందువు. అతని పేరు నాథూరాం గాడ్సే అంటూ ఆయన ఎన్నికల ప్రచారంలో చేసిన కామెంట్లపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

తమిళనాడులో అరవకురిచ్చిలో ఈనెల 12న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమల్‌ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కమల్ కామెంట్లతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్న కారణంతో ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని కరూర్‌ జిల్లా పోలీసులు తెలిపారు.

కమల్ హాసన్ వ్యాఖ్యలకు నిరసనగా తమిళనాడులో పలు చోట్ల హిందూ సంఘాలు నిరసన తెలిపాయి. దీంతో పోలీసులు చెన్నై ఆళ్వార్‌పేట, ఈసీఆర్‌ రోడ్డులోని కమల్‌ నివాసాలు, పార్టీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన ఎమ్‌ఎన్‌ఎమ్‌ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కమల్‌పై నిషేధం విధించాలంటూ బీజేపీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ ఢిల్లీ హైకోర్టులో  పిల్‌ దాఖలు చేశారు.

ఇదిలా ఉంటే కమల్ నాలుక తెగకోయాలని తమిళనాడు మంత్రి తీవ్రంగా స్పందించారు. తమిళనాడు బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూంటే అక్కడి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మాత్రం కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు 1000 శాతం నిజమేనని అన్నారు. తమిళనాడు మంత్రి రాజేంద్ర బాలాజీ మాత్రం ఆయన నాలుక కోయాలి అన్నారు. ఒక వ్యక్తి కారణంగా మొత్తం మతాన్ని నిందించలేమని రాజేంద్ర బాలాజీ అన్నారు.

కమలహాసన్ చేసిన వ్యాఖ్యలను అటు రాజకీయ నాయకులే కాకుండా సినిమా రంగానికి చెందిన వివేక్ ఒబేరాయ్ తీవ్ర అభ్యంతరం చేశారు. ముస్లింల ఓట్లు రాబట్టుకోవడం కోసం ఇలాంటీ వ్యాఖ్యలు చేశారంటూ వివేక్ ఒబేరాయ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మొత్తం మీద కమల్ వ్యాఖ్యలు ఇటు రాజకీయరంగాన్నే కాదు, సినీ రంగాన్ని కూడా కుదిపేస్తోంది. 

Image may contain: 1 person


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle