newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ఘర్షణకు దిగొద్దు.. రెచ్చగొడితే ఊరుకోవద్దు.. ఆర్మీకి కేంద్రం ఫ్రీ హ్యాండ్

22-06-202022-06-2020 07:21:29 IST
Updated On 22-06-2020 07:53:07 ISTUpdated On 22-06-20202020-06-22T01:51:29.992Z22-06-2020 2020-06-22T01:51:27.436Z - 2020-06-22T02:23:07.614Z - 22-06-2020

ఘర్షణకు దిగొద్దు.. రెచ్చగొడితే ఊరుకోవద్దు.. ఆర్మీకి కేంద్రం ఫ్రీ హ్యాండ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్ చైనా మధ్య ఘర్షణాత్మక వాతావరణం తలెత్తేలా భారత్ సైన్యం ప్రవర్తించకూడదని, కానీ అలాంటి వాతావరణాన్ని చైనా సృష్టిస్తే మాత్రం ఊరుకోవద్దని, దీటుగా సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సైన్యానికి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ విషయంలో మాత్రం భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, చైనాకు తగిన బుద్ధి చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని ప్రభుత్వ వర్గాలు అన్యాపదేశంగా స్పష్టం చేశాయి.

గాల్వాన్ లోయలో భారత, చైనా ఘర్షణాత్మక వైఖరి నేపథ్యంలో ఆర్మీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం సీడీఎస్ బిపిన్ రావత్‌తో పాటు త్రివిధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. నియంత్రణ రేఖ వెంబడి దళాల మోహరింపుతో పాటు, సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై వీరందరూ సమీక్షించినట్లు సమాచారం.

ఇరు దేశాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం తలెత్తేలా ప్రవర్తించకూడదని, ఒకవేళ చైనా మాత్రం అందుకు తగ్గ వాతావరణం కల్పిస్తే మాత్రం... ఏమాత్రం వెనక్కితగ్గకుండా దీటైన రిప్లై ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 

రక్షణ మంత్రి మాస్కో పర్యటనకు బయల్దేరే ఒక్క రోజు ముందు కేంద్రం ఇంతటి కీలక నిర్ణయం తీసుకుంది.  త్రివిధ దళాలూ చైనా విషయంలో అత్యంత జాగరూకతతో ఉండాలని, చైనా విషయంలో కఠిన వైఖరి అవలంబించాని ఈ సమావేశం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సైన్యమే సొంత నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని మోదీ కూడా స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 

అత్యవసర పరిస్థితి నిమిత్తమై ఆర్మీకి 500 కోట్లు

భారత, చైనా మధ్య ఘర్షణాత్మక వైఖరి కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే త్రివిధ దళాల అవసరాల నిమిత్తమై కేంద్ర ప్రభుత్వం ఆదివారం 500 కోట్లను కేటాయించింది. అత్యంత విపత్కర పరిస్థితులు తలెత్తితే నూతన ఆయుధాలు కొనుగోలు, తదితర అవసరాల నిమిత్తమై దీనిని విడుదల చేసినట్లు అత్యున్నత వర్గాలు ప్రకటించాయి.

‘‘త్రివిధ దళాలకూ అత్యవసర సమయంలో ఆయుధాల కొనుగోలుకై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 500 కోట్లను కేటాయించింది. ఇప్పుడు అత్యవసర పరిస్థితి నిమిత్తమై ఎలాంటి ఆయుధాన్నైనా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టు కింద రక్షణ దళాలు సైనిక వ్యవహారాల శాఖతో సంప్రదించి, యుద్ధానికి అవసరమయ్యే, లేదా వారి జాబితాలో ఉండే ఆయుధాల కొనుగోళ్లు చేయవచ్చు.’’  అని అధికారులు ప్రకటించారు. అయితే త్రివిధ దళాలు కూడా ఇప్పటికే తమకు అవసరమైన వాటి జాబితాను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. 

దేశ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సైనిక బలగాలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా పూర్తి స్వేచ్ఛనిచ్చిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చైనా దొంగ దెబ్బతీసి మన సైనికులను పొట్టన పెట్టుకుందని, వారి త్యాగం వృథా కాదన్నారు. ప్రధాని ఆదేశం మేరకే సంతోష్‌బాబు కుటుంబసభ్యులను కలిశానని, మోదీ సందేశం వారికి తెలియజేశానని పేర్కొన్నారు.

గాల్వన్ లోయలో భారత సైనికులను దొంగ దెబ్బతీసి 20మంది సైనికుల ప్రాణాలు బలిగొన్న నేపథ్యంలో ఇరుదేశాల ద్వైపాక్షిక బంధాలు దెబ్బతిన్నాయి. అయితే గత కొన్నిరోజులుగా హింసాత్మక ఘటనలు నమోదు కానప్పటికీ ఇరుదేశాల సరిహద్దుల్లో వేలాది సైనికులను భారత్, చైనా మోహరించాయి. పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ట్యాంకులు, ఆర్టిల్లరీ గన్స్, మిస్సైల్ వ్యవస్థలను కూడా ఇరు సైన్యాలు సిద్ధం చేసుకున్నాయి. లడఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు పొడవునా భారత్ సైన్యం తన స్థానాలను బలోపేతం చేసుకుంది.

కోవిడ్ -19: అంబులెన్స్‌పై జిఎస్‌టి 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు: నిర్మలా సీతారామన్

కోవిడ్ -19: అంబులెన్స్‌పై జిఎస్‌టి 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు: నిర్మలా సీతారామన్

   24 minutes ago


అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

   an hour ago


బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   6 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   21 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle