newssting
BITING NEWS :
*సమ్మెపై మధ్యవర్తిత్వానికి కెకె రెడీ.. స్వాగతించిన ఆర్టీసీ జేఏసీ *అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

గ్లోబల్ వార్మింగ్ పై సర్జికల్ స్ట్రైక్ ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ఆఫ్ ఇండియా!

09-10-201909-10-2019 18:31:41 IST
Updated On 09-10-2019 18:31:35 ISTUpdated On 09-10-20192019-10-09T13:01:41.039Z09-10-2019 2019-10-09T12:15:56.831Z - 2019-10-09T13:01:35.218Z - 09-10-2019

గ్లోబల్ వార్మింగ్ పై సర్జికల్ స్ట్రైక్ ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ఆఫ్ ఇండియా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పర్యావరణ పరిరక్షణ విషయంలో మోడీ సర్కార్ చిత్తశుద్ధికి మరో తార్కాణంగా కేంద్రం తీసుకున్న గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఇండియా నిర్ణయాన్ని అభివర్ణించాల్సి ఉంటుంది. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కేంద్రం గుజరాత్ నుంచి ఢిల్లీ – హర్యానా సరిహద్దుల వరకూ 1400 కిలోమీటర్ల మేర గ్రేట్ గ్రీన్ వాల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అఫ్రికాలోని సెనెగల్ నుంచి జిబూతీ వరకూ ఉన్నహరిత కంచెకు నమూనాగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడానికి కేంద్రం నిర్ణయించింది. 5 కిలోమీటర్ల వెడల్పుతో 1400 కిలోమీటర్ల నిర్మించనున్న గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఇండియా పర్యావరణ పరిరక్షణతో హరిత క్షేత్ర వృద్ధి కూడా లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తున్నది.

అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు వివరాలను కేంద్రం వెల్లడించడం లేదు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక అధికారి ఇచ్చిన సమాచారం మేరకు ఈ యోచన ఇంకా మొగ్గ దశలోనే ఉంది. ఇటీవల జరిగిన ఐక్యరాజ్య సమితి సదస్సులో ఎడారీకరణను నిరోధించే ఎజెండాలో భాగమని పేర్కొన్నారు. గత దశాబ్దంగా చర్చల దశలోనే ఉన్న ఈ ప్రణాళికను తెరమీదకు తీసుకువచ్చి ఆచరణలో పెట్టాలని కేంద్రం భావిస్తున్నది. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఇండియా ద్వారా ఎడారీకరణ చెందిన 26 మిలియన్ హెక్టార్ల భూమిని 2030 నాటికిపునరుద్ధరించాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.  

గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాలలో 50శాతానికి మించి భూములు సార క్షీణతకు లోనయ్యాయి. ఏడారీకరణ దిశలో ఉన్నాయన్నది 2016లో ఇస్రో నివేదిక తేటతెల్లం చేస్తున్నది. గ్రీన్ బెల్ట్ ద్వారా భూముల ఏడారీకరణను నిరోధించి వాటిని పునరుద్ధరించే సవాల్ ను కేంద్రం స్వీకరించిందని సదరు అధికారి తెలిపారు. ఇప్పటికింకా మొగ్గ దశలోనే ఉన్నప్పటికీ...కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక పలు మంత్రిత్వ శాఖల అధికారులలో ఉత్సాహాన్నీ ఉద్వేగాన్ని నింపింది. పోరుబందర్ నుంచి పానిపట్ల వరకూ గ్రీన్ బెల్ట్ ఏర్పాటు వల్ల డిగ్రేడెడ్ భూముల పునరుద్ధరణ,అరావళి పర్వత శ్రేణులలో పచ్చదనాన్ని పెంచడమే కాకుండా గుజరాత్, రాజస్థాన్, హర్యాణా, ఢిల్లీలను ధూళి, కాలుష్యం బారి నుంచి కూడా కాపాడడానికి అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

గ్రీన్ బెల్ట్ కారణంగా పశ్చిమ భారత్, పాకిస్థాన్ ల లోని ఎడారుల నుంచి వచ్చే ధూళిని గ్రీన్ బెల్ట్ రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు.  దీనితో పాటు గుజరాత్, రాజస్థాన్, హర్యానాలు మొదలుకొని ఢిల్లీ వరకూ వ్యాపించివున్న ఆరావళి పర్వతశ్రేణి వెంబడి తరిగిపోతున్న పచ్చదనాన్ని కాపాడేందుకు ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుంది. ఇప్పుడే ఈ ప్రాజెక్టుపై చర్చలు చేయడం   తొందరపాటు చర్య అవుతుందనీ, ఇంకా ఇది ఆమోద దశలోనే ఉందని అధికారులు చెబుతున్నారు. ఒక సారి ఇందుకు ఆమోదముద్ర పడితే...అరావళీ ప్రాంతంలో భారీ ఎత్తున అటవీకరణతో కార్యాచరణ ప్రారంభం అవుతుంది.

దేశంలో 2030 నాటికి 26మిలియన్ హెక్టార్ల భూమిలో అటవీకరణ చేపట్టాలన్న లక్ష్యంలో అరావళి కీలక జోన్ గా ఉందని అధికారులు అంటున్నారు. అయితే గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఇండియా ప్రాజెక్టుపై అధికారికంగా సమాచారం ఇచ్చేందుకు అధికారులెవరూ ముందుకు రావడం లేదు. ‘గ్రేట్ గ్రీన్ వాల్ ’ ఆఫ్ ఇండియాను అమలు చేస్తే గ్లోబల్ వార్మింగ్ పై భారత్ సర్జికల్ స్ట్రైక్ అవుతుందనడంలో సందేహం లేదు.

కాశ్మీర్ లో ఆంక్షల ఎత్తివేత-రాజకీయ విమర్శకుల నోటికి తాళం!

కాశ్మీర్ లో ఆంక్షల ఎత్తివేత-రాజకీయ విమర్శకుల నోటికి తాళం!

   13 hours ago


సంక్షోభం ప్రపంచానికి.. వికాసం భారత్‌కు.. మోదీ

సంక్షోభం ప్రపంచానికి.. వికాసం భారత్‌కు.. మోదీ

   16 hours ago


పీఎస్‌యూ బ్యాంకు సీఈవోలతో ఇవాళ ఆర్థికమంత్రి భేటీ

పీఎస్‌యూ బ్యాంకు సీఈవోలతో ఇవాళ ఆర్థికమంత్రి భేటీ

   20 hours ago


 అయోధ్యలో టెన్షన్.. టెన్షన్

అయోధ్యలో టెన్షన్.. టెన్షన్

   20 hours ago


వేదాలపై సెమినార్.. కమ్యూనిస్టుల సరికొత్త జ్ఞానోదయం

వేదాలపై సెమినార్.. కమ్యూనిస్టుల సరికొత్త జ్ఞానోదయం

   13-10-2019


 మామల్లపురం బీచ్‌లో చెత్త ఏరిన ప్రధాని..

మామల్లపురం బీచ్‌లో చెత్త ఏరిన ప్రధాని..

   13-10-2019


జిన్ పింగ్ భారత పర్యటనలో ప్రస్తావనకు రాని కాశ్మీర్- మోడీ విజయమే!

జిన్ పింగ్ భారత పర్యటనలో ప్రస్తావనకు రాని కాశ్మీర్- మోడీ విజయమే!

   13-10-2019


 హాగిబిస్‌ తుపాన్‌ దెబ్బకు జపాన్ విలవిల

హాగిబిస్‌ తుపాన్‌ దెబ్బకు జపాన్ విలవిల

   13-10-2019


 దేశంలో నిరుద్యోగం అబద్దం... సినిమాలు బాగానే పోతున్నాయి కదా..

దేశంలో నిరుద్యోగం అబద్దం... సినిమాలు బాగానే పోతున్నాయి కదా..

   13-10-2019


బడానేతలు వస్తేనే శుభ్రత గుర్తొస్తుందా? మద్రాస్ హైకోర్టు..

బడానేతలు వస్తేనే శుభ్రత గుర్తొస్తుందా? మద్రాస్ హైకోర్టు..

   12-10-2019


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle