newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

గ్రీన్ కార్డు కొత్తగా కోరుకునే వారిపైనే నిషేధం. అందరికీ వర్తించదన్న ట్రంప్

23-04-202023-04-2020 18:34:34 IST
Updated On 23-04-2020 18:38:43 ISTUpdated On 23-04-20202020-04-23T13:04:34.620Z23-04-2020 2020-04-23T13:04:32.513Z - 2020-04-23T13:08:43.839Z - 23-04-2020

గ్రీన్ కార్డు కొత్తగా కోరుకునే వారిపైనే నిషేధం. అందరికీ వర్తించదన్న ట్రంప్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికాకు వలస వస్తున్న వారిపై నిషేధం విధిస్తానని బాంబు పేల్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కీలక అంశంపై 24 గంటలు కాకమునుపే మరింత వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అమెరికాలోకి తాత్కాలిక ప్రాతిపదికన వచ్చేవారికి ఈ నిషేధం వర్తించదని, శాశ్వత నివాసం కోరుకునే వారికే ఈ నిషేధం వర్తిస్తుందని, 60 రోజుల తర్వాత ఈ అశంపై మళ్లీ పునస్సమీక్ష చేస్తామని ట్రంప్ స్పష్టత నిచ్చారు. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత.. ఉద్యోగాల్లో స్థానికులకే ప్రథమ ప్రాధాన్యత ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ట్రంప్ స్పష్టం చేశారు.

అమెరికాలోకి అన్ని రకాల వలసలపై తాత్కాలిక నిషేధం విధించనున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా పౌరుల ఉద్యోగాల రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ఆయన చెప్పారు. అయితే ఈ నిషేధం 60 రోజులపాటు అమల్లో ఉంటుందని ట్రంప్‌ తాజాగా ప్రకటించారు. ఈ నిషేధం శాశ్వత నివాసం(గ్రీన్‌ కార్డ్‌) కోరుకునే వారికే వర్తింస్తుందని ట్రంప్‌ అన్నారు. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత.. ఉద్యోగాల్లో స్థానికులకే ప్రథమ ప్రాధాన్యత ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ట్రంప్‌ స్పష్టం చేశారు. కరోనాకు సంబంధించిన రోజువారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్‌ ఈ విషయాలను వెల్లడించారు.

‘ఈ నిషేధం 60 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితులను బట్టి ఈ నిషేధాన్ని పొడిగించడమా.. లేక మార్పులు చేయడమా అనేది నిర్ణయిస్తాం. అమెరికాలో శాశ్వత నివాసం(గ్రీన్‌ కార్డ్‌) కోరుకునే వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. తాత్కాలిక ప్రతిపాదికన అమెరికాలోకి వచ్చేవారికి ఈ నిషేధం వర్తించదు. అమెరికా పౌరులకు ఉద్యోగాల్లో ప్రథమ ప్రాధాన్యత కల్పించాలనేది మా లక్ష్యం. వలసలను నియంత్రించడం వల్ల నిరుద్యోగ అమెరికన్లకు ఉద్యోగాలు లభిస్తాయి’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. 

‘కరోనా మహమ్మారితో 2 కోట్ల మందికి పైగా అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు. విదేశీయుల్ని వారి స్థానంలో ఉద్యోగాల్లో తీసుకుంటే మన పౌరులకు అన్యాయం జరుగుతుంది. అలా జరగనివ్వం’అని ట్రంప్‌ అన్నారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉండాలని వచ్చే వారి వలసలకే అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే వారెవరినీ రెండు నెలలు ఇక్కడ అడుగు పెట్టనిచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడ్డాక ఈ ఉత్తర్వుల్ని సమీక్షిస్తామన్నారు.

అమెరికన్ల ఉద్యోగ భద్రతపై కూడా ట్రంప్‌ ప్రస్తావించినందువల్ల నాన్‌ ఇమిగ్రంట్‌ వీసా అయిన హెచ్‌1బీ పైనా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. అయితే కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి, ఆహార సరఫరా చేస్తున్న విదేశీయులకు ఈ నిషేధం నుంచి మినహాయింపు కల్పించవచ్చని వైట్‌ హౌస్‌ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు కరోనాను అదుపు చేయడంలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 

‘అమెరికా పౌరుల ప్రయోజనాలను పరిరక్షించడం మన బాధ్యత. ఈ రెండు నెలల తర్వాత ఆర్థిక పరిస్థితుల్ని నిపుణుల కమిటీ అంచనా వేసిన తర్వాత దానిని పొడిగించాలా, మార్పులు చేయాలా ఆలోచిస్తాం’’అని ట్రంప్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ప్రతీ ఏడాది అక్కడ ఉద్యోగాలు చేస్తూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని అనుకునేవారికి లక్షా 40 వేల గ్రీన్‌ కార్డులను ఒక్కో దేశానికి 7శాతం వాటా చొప్పున మంజూరు చేస్తూ ఉంటుంది. 

కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీసు (సీఆర్‌ఎస్‌) అంచనాల ప్రకారం విదేశీ వర్కర్లు, వారి కుటుంబసభ్యులు 10 లక్షల మంది గ్రీన్‌ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. భారతీయు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు 5,68,414 మంది వరకు గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తున్నారని సీఆర్‌ఎస్‌ అంచనా. ట్రంప్‌ నిర్ణయంతో ఇక గ్రీన్‌ కార్డు వస్తుందా రాదా అన్న అయోమయంలో అక్కడి భారతీయులు ఉన్నారు.  

గత అధ్యక్ష ఎన్నికల సమయం నుంచి యూఎస్‌ ఇమిగ్రేషన్‌ వ్యవస్థను ట్రంప్‌ లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా పలు సందర్భాల్లో వీసా విధానాన్ని మార్చాలన్న తన ఆలోచనను ఆయన వెల్లడించారు.  ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక అగ్రరాజ్యం జారీ చేసే వీసాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతూ వచ్చింది. కాగా, 2016లో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 6,17,000 వీసాలు జారీ చేసిన అమెరికా.. గతేడాదిలో  4,62,000 వీసాలు మాత్రమే జారీచేసినట్టు అధికారిక గణంకాలు చెప్తున్నాయి.

అమెరికా నిర్ణయంతో ప్రభావితమయ్యే వారు, భారత్‌ టెక్కీలు అత్యధికంగా కలిగి ఉన్న హెచ్‌1బీ వీసాలపై అధ్యక్షుడు విడిగా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందని వైట్‌హౌస్‌ పాలనా యంత్రాంగం అధికారి చెప్పారు. ఈ వలసల నిషేధంలో కొన్ని మినహాయింపులు ఉంటాయని ట్రంప్‌ స్పష్టం చేశారు. అయితే ఆ మినహాయింపులేమిటో ఆయన వివరించలేదు. ‘‘అమెరికాకి పూర్తిగా వలసల్ని నిషేధించం. కొందరికి మినహాయింపులుంటాయ్‌. మానవత్వ అంశాలను కూడా ప్రాతిపదికగా తీసుకుంటాం’’అని ట్రంప్‌ చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో ఆహారం పంపిణీ చేసేవారికి మిహాయింపులిచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కరోనా కట్టడిలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ట్రంప్‌ వలసల అంశాన్ని ఎత్తుకున్నారని డెమోక్రాట్లు డొనాల్డ్‌ ట్రంప్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

   4 minutes ago


బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   5 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   20 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


జూన్ 26 న  రాజ్ భవన్ వద్ద  రైతుల నిరసన

జూన్ 26 న రాజ్ భవన్ వద్ద రైతుల నిరసన

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle