newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

గూగుల్ ఉచిత వై-ఫై ఎత్తివేతకు ఇదా కారణం?

19-02-202019-02-2020 13:15:53 IST
2020-02-19T07:45:53.707Z19-02-2020 2020-02-19T07:45:51.005Z - - 29-11-2020

గూగుల్ ఉచిత వై-ఫై ఎత్తివేతకు ఇదా కారణం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలోని రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై అందించేందుకు ఉద్దేశించిన ‘గూగుల్ స్టేషన్’ ప్రోగ్రాంను క్రమక్రమంగా ఎత్తివేయనున్నట్లు ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ ప్రకటించింది. ప్రస్తుతం భారత్‌లో ఇంటర్నెట్ సేవలు చాలా చవగ్గా మారిపోయాయని, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు గూగుల్ పేర్కొంది. ఈ కారణం వల్లనే భారత్‌తోపాటు నైజీరియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఇండోనేషియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లోనూ ఉచిత వై-ఫై సేవలను ఎత్తివేయనున్నట్టు పేర్కొంది. అయితే గూగుల్ వైఫై ఉచిత సేవలనుంచి తప్పుకున్నప్పటికీ రైల్‌టెల్ సాంకేతికత ద్వారా 400 రైల్వేస్టేషన్లలో కొనసాగుతున్న వైఫై సైవలను తాము కొనసాగస్తామని భారతీయ రైల్వే ప్రకటించింది.

అయితే భారత్‌లో గూగుల్ భాగస్వామి అయిన రైల్ టెల్ ద్వారా 400 రైల్వే స్టేషన్ల వద్ద ప్రస్తుతం కొనసాగుతున్న ఉచిత వైఫై సేవలను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. 2020 సంవత్సరంలో తన భాగస్వామ్య సంస్థలకు ప్రస్తుతం ఉనికిలో ఉన్న వైఫై సైట్ల సాంకేతికతను బదలాయిస్తామని, దీనివల్ల ఇవి భారతీయ రైల్వే వినియోగదారులకు ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉంటాయని టెక్ దిగ్గజం గూగుల్ తెలిపింది.

ఐదేళ్ల క్రితం ‘గూగుల్ స్టేషన్లు’ ప్రారంభించినప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆన్‌లైన్‌లోకి రావడం చాలా సులభతరంగా, చవగ్గా మారిందని గూగుల్ ఉపాధ్యక్షుడు సీజర్ గుప్తా తెలిపారు. భారత్‌లో మొబైల్ డేటా ప్లాన్లు చాలా చవగ్గా అందుబాటులో ఉన్నాయని, దానికి తోడుగా మొబైల్ కనెక్టివిటీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత చవగ్గా భారత్‌లో మొబైల్ డేటా లభ్యమవుతోందని సీజర్ అన్నారు.

ఐదేళ్ల క్రితంతో పోలిస్తే మొబైల్ డేటా ధర 95 శాతం తగ్గిందన్నారు. ట్రాయ్ గణాంకాల ప్రకారం దేశంలోని వినియోగదారులు నెలకు సగటున 10 జీబీ డేటాను వినియోగిస్తున్నట్టు వివరించారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే గూగుల్ స్టేషన్ల ఎత్తివేత నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు.

భారతీయ రైల్వే, రైల్ టెల్ భాగస్వామ్యంతో 2015లో గూగుల్ వేగవంతమైన, ఉచిత పబ్లిక్ వై-ఫై సేవలను ప్రారంభించింది. 2020 నాటికి 400కు పైగా రైల్వే స్టేషన్లలో అమర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, జూన్ 2018 నాటికే ఆ లక్ష్యాన్ని అధిగమించినట్టు సీజర్ తెలిపారు. 2020 ప్రారంభం నాటికే దేశవ్యాప్తంగా 1600 రైల్వే స్టేషన్లలో వైఫై సేవలను గూగుల్ అందించింది. అంతేకాదు, టెలికం కంపెనీల భాగస్వామ్యం, ఐఎస్‌పీలు, స్థానిక అధికార యంత్రాంగంతో కలిసి వందలాది వై-ఫై స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు సీజర్ తెలిపారు. ఇండియన్ రైల్వే, భారత ప్రభుత్వం, ఇతర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని సీజర్ పేర్కొన్నారు. 

వైపై ఉచిత సేవల నుంచి గూగుల్ వైదొలిగినప్పటికీ దేశవ్యాప్తంగా రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్లన్నింటిలో వైఫై ఉచిత సేవలను కొనసాగిస్తామని రైల్ టెల్ ప్రతినిధి నిర్ధారించారు. అనేక భాగస్వామ్య సంస్థలతో తాము ప్రయాణిస్తున్నామని ఈ అయిదేళ్లలో దేశంలోని 5,600 స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. తాము అయిదేళ్ల వ్యవధికిగాను గూగుల్ సంస్థతో 415 స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని, ఈ కాంట్రాక్టు త్వరలో ముగియనుందని చెప్పారు. ఈ అయిదేళ్లలో మా ఉచిత వైఫై సేవల ప్రయాణంలో గూగుల్ నుంచి అందుకున్న మద్దతుకు తాము ఎంతో విలువ ఇస్తున్నామని చెప్పారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle