newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

గాంధీ విగ్రహ విధ్వంసం ప్రజలను ఏకం చేస్తుందా.. అమెరికన్ నేతల ఖండన

07-06-202007-06-2020 07:14:43 IST
Updated On 07-06-2020 09:56:11 ISTUpdated On 07-06-20202020-06-07T01:44:43.877Z07-06-2020 2020-06-07T01:44:41.839Z - 2020-06-07T04:26:11.658Z - 07-06-2020

గాంధీ విగ్రహ విధ్వంసం ప్రజలను ఏకం చేస్తుందా.. అమెరికన్ నేతల ఖండన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికా రాజధానిలోని భారతీయ దౌత్యకార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహాన్ని ఆగంతకులు ధ్వంసం చేయడాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పాటు పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలు ప్రజలను ఏకం చేయవని వారు స్పష్టం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమైందని అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్‌లోని భారత దౌత్యకార్యాలయం సమీపంలో ఉన్న ఈ విగ్రహాన్ని కొందరు దుండగులు బుధవారం ధ్వంసం చేసి, రంగులు పూసిన విషయం తెలిసిందే.

ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణం నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అయితే, ఈ ఘటనకు ఆందోళనలతో సంబంధం లేదని మార్కో రూబియో అనే సెనెటర్‌ గురువారం తెలిపారు. నార్త్‌ కరొలినా సెనేటర్‌ టామ్‌ టిల్లిస్‌ కూడా ఇది అమర్యాదకరమైందని అభివర్ణించారు. శాంతికి మారుపేరుగా చెప్పుకునే గాంధీ ప్రతిరూపాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్రంప్‌ సలహాదారు కింబర్లీ గుయిఫోలే చెప్పారు.  

జార్జ్‌ ఫ్లాయిడ్‌ సంస్మరణ సభలు

‘‘మా గొంతులపై మీ మోకాళ్లు తొలగించండి’’ అన్న నినాదాల మధ్య మినియాపోలిస్‌లో గురువారం జార్జ్‌ ఫ్లాయిడ్‌ సంస్మరణ సభలు జరిగాయి. శవపేటిక చుట్టూ గుమికూడిన పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు  ఫ్లాయిడ్‌ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఒకవైపు ఈ సభ జరుగుతూండగా కొంత దూరంలోనే ఉన్న న్యాయస్థానంలో ఫ్లాయిడ్‌ హత్యకు కారణమైన ముగ్గురు పోలీసు అధికారులకు న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేస్తూ.. పూచీకత్తుగా సుమారు రూ.5 కోట్ల చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఫ్లాయిడ్‌ ఘటనకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ప్యారిస్, లండన్, సిడ్నీ, రియో డిజెనిరోల్లో నిరసనలు జరిగాయి. 

అమెరికాలో 2013లో జరిగిన ఘటన ఇది. 17 ఏళ్ల నల్ల జాతీయుడైన ట్రెవోన్‌ మార్టిన్‌ను కాల్చి చంపిన కేసులో జిమ్మర్‌సన్‌ అనే శ్వేత జాతీయుడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిందే ‘బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌’ సంస్థ. ఈ సంస్థ కార్యవర్గం, సభ్యుల్లో నల్ల జాతీయులే కాకుండా శ్వేత జాతీయులు కూడా ఉన్నారు. అలిసియా గార్జా అనే కార్యకర్త అప్పట్లో ‘బ్లాక్‌ పీపుల్‌. ఐ లవ్‌ యు. ఐ లవ్‌ అజ్‌. అవర్‌ లైవ్స్‌ మేటర్‌’ అంటూ నినాదం చేసింది. ఆ నినాదమే ఈ ఉద్యమ సంస్థ ఏర్పాటుకు దారితీసింది.

ఇప్పుడు కూడా అమెరికాలో అదే పరిస్థితి! ఆఫ్రికన్‌- అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యపై అమెరికా రగిలిపోతోంది. దేశంలోని 140 నగరాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. 40 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. ‘మాకు ఊపిరి ఆడటం లేదు’.. అంటూ ఫ్లాయిడ్‌ చివరి మాటలే ఆ దేశ ప్రజల నినాదంగా మారాయి. ఇప్పుడు కూడా నల్ల జాతీయులకు శ్వేత జాతీయులు మద్దతు తెలుపుతున్నారు. బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌, సిరియా, బ్రెజిల్‌, మెక్సికో, ఐర్లాండ్‌, న్యూజిలాండ్‌, కెనడా, పోలాండ్‌, ఆస్ర్టేలియా వంటి శ్వేత జాతీయులు అధికంగా నివసించే దేశాల్లోనూ నిరసనకారులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. శ్వేతజాతీయులు వేల సంఖ్యలో పాల్గొంటున్నారు. బ్రిటన్‌లో కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలను సైతం ఉల్లంఘించి వందలాది మంది అమెరికా రాయబార కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శనలు చేశారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో మాస్క్‌లు ధరించి మరీ వందలాది మంది నిరసనల్లో పాల్గొన్నారు.

‘మేమంతా జార్జి ఫ్లాయిడ్స్‌మే... జాత్యహంకారం మాకు ఊపిరి ఆడనివ్వడం లేదు’ అంటూ ఫ్రాన్స్‌ రాజధాని పారి స్‌లో మాస్క్‌లు ధరించి, మోకాళ్లపై నిలబడి వందలాది మంది నినాదాలు చేశారు. ‘న్యాయం లేనిదే శాంతి లేదు’ అంటూ డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగన్‌లో నిరసనలు మిన్నంటాయి. బ్రెజిల్‌లోనూ ప్రదర్శనలు నిర్వహించారు. ‘ఇక్కడా అక్కడా అని లేదు.. ప్రపంచమంతటినీ జాత్యహంకారం చంపుతోంది’ అంటూ మెక్సికో నగరంలో నిరసనకారులు నినదించారు. ‘జాత్యహంకారం ప్రపంచానికే సవాల్‌ విసురుతోంది. దాని అంతాన్ని మేము కోరుకుంటున్నాం’ అంటూ ఐర్లాండ్‌లోని డబ్లిన్‌ నగర వీధుల్లో నిరసనకారులు నినాదాలు చేశారు. న్యూజిలాండ్‌లో వేలాది మంది ప్రదర్శనల్లో పాల్గొన్నారు. కెనడా, పోలాండ్‌, ఆస్ర్టేలియాల్లో జరిగిన ర్యాలీల్లో వందలాది మంది పాల్గొన్నారు. ఈ ప్రదర్శనల్లో పాల్గొంటున్నవారిలో అధిక సంఖ్యాకులు శ్వేతజాతీయులే. 

అమెరికాలో జరుగుతున్న ఆందోళనలపై పదవీ విరమణ తర్వాత రాజకీయాలపై పెద్దగా స్పందించని మాజీ అధ్యక్షుడు జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రముఖ క్రికెటర్‌ క్రిస్‌గేల్‌, స్విట్జర్లాండ్‌, సెర్బియా, స్పెయిన్‌ దేశాలకు చెందిన ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారులు రోజర్‌ ఫెదరర్‌, జకోవిచ్‌, రఫెల్‌ నడల్‌ తదితరులు జాత్యంహకారానికి వ్యతిరేక ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.

కాలిఫోర్నియా మేయర్‌ రాజీనామా

అమెరికాలో నల్లజాతీయుల నిరసనలు కొనసాగుతున్నాయి. వాషింగ్టన్‌, న్యూయార్క్‌, షికాగో, లాస్‌ ఏంజెలిస్‌ సహా.. అనేక నగరాల్లో వేల మంది రహదారులను దిగ్బంధించారు. కొన్ని ప్రాంతాల్లో లూటీలు, ఆస్తుల విధ్వంసం కొనసాగాయి. ఆందోళనల నడుమ మేయిన్‌ రాష్ట్రంలోని కరోనా నివారణ మందులు తయారు చేసే ఓ కంపెనీని  ట్రంప్‌ సందర్శించనున్నారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ జెనెత్‌ మీల్స్‌ ఇటీవల ట్రంప్‌కు కొన్ని సూచనలు చేశారు. ‘‘మీరు వాక్చాతుర్యాన్ని పక్కన పెట్టండి. విభేదాలను సృష్టించే వ్యాఖ్యలు చేయవద్దు’’ అన్నారు. ట్విటర్‌ మరోమారు ట్రంప్‌కు షాకిచ్చింది. ఫ్లాయిడ్‌ మరణాన్ని ఖండిస్తూ ట్వీట్‌ చేసిన ఓ వీడియోను తొలగించింది. దక్షిణ కాలిఫోర్నియాలోని టమాక్యోలా నగర మేయర్‌ జేమ్స్‌ స్టెవార్ట్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శలు రాగా తన పదవికి రాజీనామా చేశారు. 

నల్లజాతీయుల ఆందోళనలకు ట్రంప్‌ కుమార్తె సంఘీభావం

జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యకు నిరసనగా అమెరికాలోని నల్లజాతీయులు చేస్తున్న ఆందోళనలకు అనూహ్య మద్దతు లభించింది. అధ్యక్షుడు ట్రంప్‌ చిన్న కుమార్తె టిఫానీ ట్రంప్‌.. నల్లజాతీయుల ఆందోళనలకు సంఘీభావం తెలిపారు. బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బ్లాక్‌ స్ర్కీన్‌ ఫొటోను షేర్‌ చేసిన ఆమె.. దాని కింద ‘ఒంటరిగా కొంతే సాధించగలం. కలిసుంటే అద్భుతాలు చేయగలం’ అంటూ హెలెన్‌ కిల్లెర్‌ మాటలను ఉదహరించారు. అలాగే.. ‘బ్లాకౌట్‌ ట్యూస్‌డే’, ‘జస్టిస్‌ ఫర్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌’ హ్యాష్‌ ట్యాగ్‌లనూ ఆమె షేర్‌ చేశారు. టిఫానీకి ఆమె తల్లి, ట్రంప్‌ రెండో భార్య మర్లా మాపుల్స్‌ కూడా మద్దతుగా నిలిచారు.  ఆందోళనలు చేస్తున్న నల్లజాతీయులను ‘దుండగులు’గా అభివర్ణిస్తూ.. వారిపై సైన్యాన్ని ప్రయోగించేందుకు కూడా వెనుకాడనని అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించిన మరునాడే ఆయన కుమార్తె నుంచే ఆందోళనకారులకు మద్దతు లభించడం విశేషం.

 

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   13 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   16 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle