newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

గవర్నర్ అయినా సరే హెలికాప్టర్ ఇవ్వం: తెగేసి చెప్పిన మమత

15-11-201915-11-2019 12:33:35 IST
2019-11-15T07:03:35.296Z15-11-2019 2019-11-15T07:03:28.653Z - - 03-08-2020

గవర్నర్ అయినా సరే హెలికాప్టర్ ఇవ్వం: తెగేసి చెప్పిన మమత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజకీయ నేతలకు, కేంద్రం నామినేట్ చేసే గవర్నర్లకు మధ్య సంబంధాలు బెడిసి కొడితే ఏమవుతుందో పశ్చిమ బెంగాల్‌లో తాజా ఉదంతం తేల్చిచెబుతోంది. కేంద్రప్రభుత్వం నామినేట్ చేసిన రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో హద్దుమీరుతున్నారని భావిస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయనకు సహాయ నిరాకరణను కొనసాగిస్తూనే ఉన్నారు. దాంతో గవర్నర్ హెలికాప్టర్‌లో ప్రయాణానికి నోచుకోలేక కారులో వందలాది కిలోమీటర్లు తన సతీమణితో పాటు ప్రయాణంచాల్సిన స్థితి ఏర్పడింది. పైగా ఈ అనుభవం గవర్నర్‌కు రెండోసారి కావడం మరీ విశేషం.

వివరాల్లోకి వెళితే ముర్షిదాబాద్‌లో శుక్రవారం నిర్వహించే ప్రొఫెసర్‌ ఎస్‌ఎన్‌హెచ్‌ కాలేజీ రజతోత్సవ కార్యక్రమానికి గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్కర్‌.. ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సి ఉంది. ఇందు కోసం హెలికాప్టర్‌ సమకూర్చాలని సీఎంవోకు ఆయన కార్యాలయం విజ్ఞప్తి చేసింది. కానీ ఆ విజ్ఞప్తిని అధికారులు తిరస్కరించారని గవర్నర్‌ కార్యాలయం తెలిపింది. దీంతో 600 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాలని గవర్నర్‌ నిర్ణయించుకున్నారు. ఆయనకు ఇలా జరగడం ఇది రెండోసారి. కాగా, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు బీజేపీ ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బెంగాల్‌ గవర్నర్‌కు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇలా ఝలక్‌ ఇవ్వడం రెండోసారి.

ఏ గవర్నర్ కూడా చేయని విధంగా పశ్చిమబెంగాల్ గవర్నర్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై వాకబు చేస్తుండటం.. అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం మమతకు తొలినుంచి కంటగింపుగా మారింది. కొద్ది రోజుల క్రితం హుగ్లీ జిల్లాలోని సింగూర్‌ను గవర్నర్ సందర్శించడం ప్రభుత్వాధినేతను మండించింది.

మమత రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసిన సంగూర్, నందిగ్రామ్ ప్రాంతాల్లో బేజీపీ పాగా వేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సందర్బంలో గవర్నర్ అక్కడికి వెళ్లడం మమతలో ఆగ్రహం కలిగించింది. సింగూర్, నందిగ్రామ్ లలో తాను సుదీర్ఘ కాలం గడపాలనుకుంటున్నాని, ఈ రెండు ప్రాంతాలపై తనకు పూర్తి పరిజ్ఞానం ఉందని గవర్నర్ వ్యాఖ్యానించడాన్ని మమత చాలా సీరియస్‍‌గా తీసుకున్నారు.

అందుకే దసరా సందర్బంగా కాళిమాత ఆలయానికి గవర్నర్ దంపతులను ఆహ్వానించి సమాదరించిన మమత తర్వాత కొన్నాళ్లకే గవర్నర్ వ్యవహారం శ్రుతిమించుతోందని ప్రకటించవలసి వచ్చింది. రాజ్యాంగ పదవుల్లోని వ్యక్తులపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి సిద్ధపడను కానీ రాజ్యాంగ పదవుల్లో ఉన్న కొందరు వ్యక్తులు మాత్రం బీజేపీ వాణిగా వ్యవహరిస్తున్నారని, వీరు రాష్ట్రంలో సమాంతర పాలన నడపాలని ప్రయత్నిస్తున్నారని మమత విమర్శించారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకుంటారు రాజ్యాంగం ప్రకారమే సమాఖ్య వ్యవస్థ పనిచేయాల్సి ఉంటుంది. కాని కొంతమంది నామినేటెడ్ వ్యక్తుల ప్రవర్తన చాలా అతిగా ఉంది. ఈ విషయంలో కేంద్రం తగు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాను అని మమత రాష్ట్ర గవర్నర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   9 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle