newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

గత 60 ఏళ్లలో అతిపెద్ద మాంద్యం కోరల్లో భారత్.. ఐఎమ్ఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీత

26-06-202026-06-2020 06:44:54 IST
Updated On 26-06-2020 11:28:46 ISTUpdated On 26-06-20202020-06-26T01:14:54.470Z26-06-2020 2020-06-26T01:14:49.902Z - 2020-06-26T05:58:46.406Z - 26-06-2020

గత 60 ఏళ్లలో అతిపెద్ద మాంద్యం కోరల్లో భారత్.. ఐఎమ్ఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే చాలా లోతైన మాంద్యంలోకి వెళ్లిపోతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ వ్యాఖ్యానించారు.  కరోనాతో దాదాపు అన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు కుదేలవ్వడంతో వృద్ధిరేటు తగ్గునుందని పేర్కొన్నారు.

ముఖ్యంగా 2020 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు ఏకంగా 4.5 శాతం పడిపోయిందని, భారతదేశం వృద్ధి 2 సంవత్సరాలలో ఒక శాతం కంటే కొద్దిగా ఎక్కువ  ఉంటుందన్నారు.  కానీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో భారత్‌ కూడా నెమ్మదిగా కోలుకుంటుందని పేర్కొన్నారు. 

కరోనా కట్టడి విషయంలో భారత్ బాగానే వ్యవహరించినప్పటికీ, పరీక్షల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే ప్రస్తుత సంక్షోభ సమయంలో పేదలకు నగదు బదిలీ, ప్రతి ఒక్కరికి అవసరమైన ఉద్యోగాలను సృష్టించడం చాలా ముఖ్యం అని గీతా గోపీనాథ్ పేర్కొన్నారు.

గీతా గోపీనాథ్ పేర్కొన్న కొన్ని కీలక అంశాలు

దేశాలు ప్రపంచీకరణపై పునరాలోచనలో ఉన్నప్పటికీ  ప్రపంచ సంక్షోభం ప్రపంచ సహకారంతోనే పరిష్కారమవుతుంది. 

రానున్న సమీపకాలంలో దేశాలు వైద్య ఎగుమతులపై ఆంక్షలు పెట్టబోతున్నాయి. కానీ ఈ విషయంలో ప్రపంచ దేశాల మధ్య  సహకారం అవసరం.

ప్రస్తుతం ప్రధాన సవాలు ఆరోగ్య సంక్షోభం. అధిక జనాభా గల దేశంలో పడకల సంఖ్య అంతర్జాతీయ సగటుకు దూరంగా ఉంది. కానీ, తీసుకున్న చర్యలు బావున్నాయి. ఇది చాలా కష్టమైన సమయం. ప్రధాన నగరాలన్నీ కరోనాతో  పోరాడుతున్నాయి.

ఆరోగ్య సామర్థ్యాలను, పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలి. సామాజిక భద్రతా చర్యల్ని చేపట్టాలి. పేదలకు నగుదును అందుబాటులో వుంచాలి. ఎక్కువ ఉద్యోగ కల్పన అవసరమయ్యే సమగ్ర విధానాన్ని అవలంబించాలి. వలస కార్మికులు తిరిగి నగరాలకు రావటానికి ప్రస్తుతం ఇష్టపడరు. ఇది సమస్య అవుతుంది. ప్రభుత్వం వారికి నగదును అందించాల్సిన అవసరం ఉంది. స్థానికంగా వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి.  ఇది ఆర్థికవ్యవస్థ రికవరీకి చాలా సహాయపడుతుంది.

అంతర్జాతీయ వాణిజ్యంలో భారతదేశం పాత్ర పెద్దది కనుక భారీ సంస్కరణలు అవసరం. డిజిటల్ ఫ్రంట్‌లోభారత్ చాలా బాగా రాణించింది. అదే తరహాలో వైద్యపరంగా కూడా రాణించాలి.  సంస్కరణలను వేగవంతం చేయడం కచ్చితంగా దేశానికి సహాయపడుతుంది. 

కాగా చరిత్రలోనే తొలిసారిగా 2020లో అన్ని ప్రాంతాల్లో ప్రతికూల వృద్ధిరేటును అంచనా వేస్తున్నామని బుధవారం గీతా గోపీనాథ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి త్రైమాసికంలో కాస్త రికవరీ ఉన్నప్పటికీ చైనా వృద్ధిరేటును ఒక శాతంగా అంచనా వేశామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ 4.5 శాతం తగ్గుతుందని, 1961 తర్వాత ఇదే అత్యంత తగ్గుదల అని ఆమె పేర్కొన్నారు. అయితే, 2021లో వృద్ధిరేటు 6 శాతానికి పుంజుకుంటుందన్నారు.

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   3 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   19 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   a day ago


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


జూన్ 26 న  రాజ్ భవన్ వద్ద  రైతుల నిరసన

జూన్ 26 న రాజ్ భవన్ వద్ద రైతుల నిరసన

   12-06-2021


కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle