newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

గగనతలంపై ఆంక్షలు ఎత్తివేత...అందుకేనా?

16-07-201916-07-2019 12:19:54 IST
Updated On 16-07-2019 12:20:04 ISTUpdated On 16-07-20192019-07-16T06:49:54.256Z16-07-2019 2019-07-16T06:49:34.991Z - 2019-07-16T06:50:04.359Z - 16-07-2019

గగనతలంపై ఆంక్షలు ఎత్తివేత...అందుకేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పాకిస్థాన్ తీసుకునే కొన్ని నిర్ణయాలు ఆ దేశానికే చేటు తెస్తుంటాయి. చివరాఖరికి ఆ నిర్ణయాలను సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది. తమ గగనతలం పై విధించిన ఆంక్షల్ని ఎత్తివేసినట్లు మంగళవారం పాకిస్తాన్ ప్రకటించింది.

దీంతో తమ గగనతలం భారత విమానాలకు అందుబాటులోకి రానున్నట్లు పాకిస్థాన్‌ పౌర విమానయాన సంస్థ తెలియచేసింది. గతంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ సర్వీస్‌ (ఎటిఎస్‌) లో ప్రచురించిన అన్ని మార్గాల్లో విమానాలు వెళ్లవచ్చునని ప్రకటనలో పేర్కొంది.  ఈ నిర్ణయం వల్ల భారత్‌ తో పాటు పలు దేశాలకు చెందిన పౌర విమానాలు పాక్‌ మీదుగా నిర్దేశిత మార్గంలో వెళ్లే వెసులుబాటు కలుగుతుంది. 

ఫిబ్రవరిలో భారత్ వైమానికి దళం బాలాకోట్‌ పై జరిపిన సర్జికల్ దాడుల అనంతరం రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. పాక్‌ తమ గగనతలాన్ని మూసివేసింది. దాదాపు అయిదు నెలల తరవాత పాక్‌ ఆంక్షల్ని ఎత్తివేయడం గమనార్హం. పాక్‌ నిర్ణయం భారత విమానయాన సంస్థలకు ఊరటనిచ్చే విషయంగా చెబుతున్నారు.

దాయాది దేశం నిర్ణయంతో జులై 2 వరకు ఎయిర్‌ ఇండియా దాదాపు రూ.491 కోట్లు నష్టపోయింది. ఢిల్లీ నుంచి ఐరోపా దేశాలకు నడిపే అనేక సర్వీసుల మార్గాలను మార్చాల్సి రావడం వల్ల ఇంధనం ఎక్కువ కావడం, ఆయా దేశాలకు ట్యాక్స్ లు చెల్లించడం వల్ల ఈ నష్టం వాటిల్లింది. 

ఎయిర్ ఇండియాతో పాటు స్పైస్‌జెట్‌ రూ.30.73, ఇండిగో రూ.25.1, గోఎయిర్‌ రూ.2.1 కోట్లు నష్టపోయినట్లు ఇటీవల రాజ్యసభకు అందించిన నివేదికలో పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి తెలిపారు.

పాక్‌ నిషేధం వల్ల అనేక మార్గాలను మార్చడంతో పాటు కొన్ని విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ ఆంక్షలతో పాక్‌ సైతం భారీగా నష్టపోయినట్లు సమాచారం. పాక్‌ నిర్ణయంపై స్పందించిన భారత్‌.. ఇరు దేశాల మధ్య అన్ని మార్గాల్లో విమానయాన ఆపరేషన్లు పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించాయి.

దేశంలో కరోనా కేసులు 23 లక్షలు.. 24 గంటల్లో 60 వేల కేసులు

దేశంలో కరోనా కేసులు 23 లక్షలు.. 24 గంటల్లో 60 వేల కేసులు

   11 hours ago


ట్రంప్ నెత్తిన హారిస్ పిడుగు.. అమెరికన్ భారతీయుల్లో ఆశలు

ట్రంప్ నెత్తిన హారిస్ పిడుగు.. అమెరికన్ భారతీయుల్లో ఆశలు

   14 hours ago


నాన్న ఆరోగ్యం ఇక భగవంతుడి ఇష్టమే.. ప్రణబ్ కుమార్తె ప్రకటన

నాన్న ఆరోగ్యం ఇక భగవంతుడి ఇష్టమే.. ప్రణబ్ కుమార్తె ప్రకటన

   18 hours ago


రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   12-08-2020


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   12-08-2020


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   12-08-2020


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle