newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఖర్చు తక్కువ... ఢిల్లీ ఐఐటీ టెస్టింగ్ కిట్

25-04-202025-04-2020 09:04:06 IST
Updated On 25-04-2020 09:40:23 ISTUpdated On 25-04-20202020-04-25T03:34:06.582Z25-04-2020 2020-04-25T03:33:57.998Z - 2020-04-25T04:10:23.435Z - 25-04-2020

ఖర్చు తక్కువ... ఢిల్లీ ఐఐటీ టెస్టింగ్ కిట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా రోగులను పరీక్షించేందుకు కోట్లాది కిట్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం విదేశాల నుంచి టెస్టింగ్ కిట్లు మనం దిగుమతి చేసుకుంటున్నాం. అయితే భారతదేశంలోనే మేడిన్ ఇండియా స్ఫూర్తితో తక్కువ ఖర్చుతో కరోనాను నిర్ధారించే టెస్ట్‌ కిట్‌ను ఐఐటీ ఢిల్లీ రూపొందించింది. ఈ కిట్ తయారీకి అంతా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించడం విశేషం. ఈ కిట్‌ను ఐసీఎంఆర్‌ సైతం ఆమోదించింది. ఈ కిట్‌లో రియల్‌ టైమ్‌ పీసీఆర్‌(పాలిమర్స్‌ చైన్‌ రియాక్షన్‌) డయాగ్నస్టిక్‌ విధానాన్ని అనుసరిస్తారు.

ఈ విధానంపై నిర్వహించిన పరీక్షల్లో వంద శాతం కచ్చితత్వం వచ్చిందని ఐఐటీ ఢిల్లీ తెలిపింది. దేశంలో ఎక్కువ మందికి తక్కువ ధరకే కరోనా పరీక్షలు నిర్వహించడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈ ప్రక్రియకు ఐసీఎంఆర్‌ నుంచి అనుమతి పొందిన తొలి విద్యా సంస్థ ఐఐటీ ఢిల్లీనే. వివిధ పరిశ్రమలతో చర్చించి తక్కువ ధరకే కిట్స్‌ను పెద్ద ఎత్తున మార్కెట్‌లోకి తీసుకొస్తామని ఢిల్లీ ఐఐటీ వెల్లడించింది.

ప్రోబ్‌ బేస్డ్‌ పద్ధతిలో టెస్టులు చేస్తున్నారు. ఈ కిట్ ధర చాలా తక్కువగానే వుంటుందని, ఈకిట్ అందుబాటులోకి వస్తే లక్షలాదిమందికి టెస్ట్ లు చేసి వ్యాధి నిర్దారించే అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోరా మహమ్మారికి వ్యాక్సిన్ తయారీలో వివిధ ఫార్మా సంస్థలు తలమునకలై వున్నాయి. 

కరోనా వణుకుతున్న అమెరికాలో వృక్ష ఆధారిత టీకాను అభివృద్ధి చేస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన నానో ఇంజనీర్లు ఈ ప్రాజెక్టుకి రూపకల్పన చేస్తున్నారు. ఈ టీకా ఎక్కడైనా ఉపయోగించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీనికి ప్రత్యేకత ఏమిటంటే చిన్నసైజు సూదితో ఎవరికి వారే ఈ టీకా వేసుకోవచ్చు. అంతేకాదు ఫ్రిజ్ లు లేనిచోట కూడా ఇది నిల్వ వుండేలా రూపొందించనున్నారు.

ఇంత చిన్న సూదులు పిట్స్ బర్గ్ వర్శిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్ తయారుచేసింది. చక్కెరతో ఈ సూదులు తయారుచేశారు. ఈ సూది ప్యాచ్ ను చర్మంపై కొంచెం నొక్కితే చాలు. చర్మంలోని తేమ ఈ టీకాను లాగేసుకుంటుంది. పని ప్రారంభిస్తుంది. ఇది అందుబాటులోకి వస్తే మానవాళికి ఎంతో ఉపయోగం ఉంటుందని అంటున్నారు. 

 

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

   19 hours ago


దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

   21 hours ago


హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

   25-07-2021


పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   25-07-2021


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   24-07-2021


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle