newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

క‌రోనా వ‌చ్చింద‌ని తెలియ‌గానే వ‌ణికిపోయాను: బాధితురాలి సందేశం

03-04-202003-04-2020 16:21:59 IST
Updated On 03-04-2020 16:40:54 ISTUpdated On 03-04-20202020-04-03T10:51:59.596Z03-04-2020 2020-04-03T10:51:54.993Z - 2020-04-03T11:10:54.131Z - 03-04-2020

క‌రోనా వ‌చ్చింద‌ని తెలియ‌గానే వ‌ణికిపోయాను: బాధితురాలి సందేశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి కూడా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తేలినప్పుడు భయంతో కంపించిపోయాయని ఇంగ్లండులో విద్యనభ్యసిస్తున్న కోల్‌కతా యువతి మోనమి బిశ్వాస్ చెప్పింది. ప్రాణాంతక వ్యాధి సోకగానే మొట్టమొదట మనం భయాన్ని అధిగమిస్తే చాలు.. తర్వాత కుటుంబ సభ్యుల అండతో, వైద్యులు నూరిపోసిన ధైర్యంతో వైరస్‌ను జయించవచ్చని ఆ యువతి తన రెండువారాల చికిత్స అనుభవంతో ధైర్యం చెబుతోంది.

కోల్‌క‌తాకు చెందిన 24యేళ్ల‌ మోన‌మి బిశ్వాస్ ఈడెన్‌బ‌ర్గ్‌లో విద్య‌న‌భ్య‌సిస్తోంది. ప్ర‌పంచ దేశాల‌కు క‌రోనా పాకుతున్న వేళ ఆమె సొంత‌గూటికి చేరుకుంది. అదే స‌మ‌యంలో త‌న‌కు వ‌చ్చిన జ్వ‌రం మామూలుది కాద‌ని తెలుసుకుని షాక్‌కు లోనైంది. రెండు వారాల చికిత్స అనంత‌రం వైర‌స్‌ బారి నుంచి బ‌య‌ట‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో కరోనాతో చేసిన పోరాటం గురించి ఆమె మాట‌ల్లోనే విందాం.

మార్చి 19న నేను ముంబై మీదుగా కోల్‌క‌తాకు చేరుకున్నాను. అప్ప‌టికే నాకు జ్వ‌రం ఉండటంతో పారాసిట‌మాల్ మాత్ర‌ వేసుకున్నాను. కానీ బాగా ఒంట‌రిత‌నం ఫీల‌య్యాను. అయితే అక్క‌డి అధికారులు నిబంధ‌న‌ల ప్ర‌కారం నాకు కోవిడ్‌-19 టెస్ట్ చేయాల‌న్నారు. దానికి నేను అంగీక‌రించ‌గా ప‌రీక్ష‌లో పాజిటివ్ అని తేలింది. దీంతో న‌న్ను ఐసోలేష‌న్ రూమ్‌కు త‌ర‌లించారు. నేనున్న గ‌దిలో అన్నిర‌కాల వైద్య ప‌రిక‌రాలున్నాయి, కానీ నేను ఒంట‌రిగా ఉన్నాను. అయితే మొబైల్ ఫోన్ వాడుకోడానికి ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌లేదు. పైగా వార్తాప‌త్రిక‌లు కూడా పంపారు, కావాలంటే ల్యాప్‌టాప్ కూడా వాడుకోమ‌న్నారు. 

డాక్ట‌ర్లు త‌ర‌చూ వ‌చ్చి నాలో ధైర్యాన్ని నింపేవారు, అయితే న‌న్ను స‌మీపించే ప్ర‌తీసారి మాస్క్ ధ‌రించమ‌ని కోరేవారు. అలాంటి క‌ష్ట కాలంలో నా కుటుంబం కూడా నాకు ఎంతో మ‌ద్ద‌తుగా నిలిచింది. వారితో అప్పుడ‌ప్పుడు ఫోన్‌లో మాట్లాడేదాన్ని. నెట్‌ఫ్లిక్స్ కూడా చూసేదాన్ని. 

వైద్య స‌దుపాయాల‌తో పోల్చితే యూకే క‌న్నా కూడా భార‌త‌దేశ‌మే ఎంతో న‌యం. క‌రోనా గురించి విన్నాక నేను మార్చి 17న యూకే ఎంబ‌సీ అధికారుల‌ను సంప్ర‌దించాల‌ని చూశాను, కానీ వాళ్ల ద‌గ్గ‌ర నుంచి క‌నీస స్పంద‌న క‌రువైంది. దీంతో నేను భార‌త్‌కు తిరిగి రావ‌డ‌మే అత్యుత్త‌మ‌ని నిశ్చ‌యించుకున్నాను. క‌రోనా సోకింద‌ని తెలియ‌గానే మొద‌టి రోజు భ‌యంతో వ‌ణికిపోయాను. అయితే నాకు రోగ‌నిరోధ‌క‌శ‌క్తి ఎక్కువ‌గా ఉంద‌ని, ఈ వైర‌స్‌ను అధిగ‌మిస్తాన‌ని వైద్యులు నిరంత‌రం నాలో ధైర్యం నూరిపోసేవారు.

ప్ర‌జ‌ల‌కు నేను చెప్ప‌ద‌ల్చుకునేదేంటంటే.. క‌రోనా గురించి అతిగా భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేదు. జ్వ‌రం, ద‌గ్గు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించండి, ఎందుకంటే మ‌న‌కు స‌హాయం చేయ‌గ‌లిగేది వాళ్లు మాత్ర‌మే. కానీ ప్రాణాంత‌క‌మైన‌ వ్యాధి కాబ‌ట్టి కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించండి. అందులో భాగంగా త‌ర‌చూ చేతులు శుభ్రం చేసుకోండి, ఇంట్లోనే ఉండండి. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోండి అంటూ ప‌లు సూచ‌న‌లు చేసింది. 

ఇక‌ క‌రోనాతో యుద్ధంలో త‌మ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి మరీ పోరాడుతున్న‌ వైద్యులు, న‌ర్సులు, ఇంకా అనేక‌మందికి మోన‌మి మ‌న‌స్ఫూర్తిగా హ్యాట్సాఫ్‌ చెప్పింది.

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   6 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   9 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   a day ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle