newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

క‌రోనా పుట్టింది ఆ మార్కెట్‌లో కాదా..? వెలుగులోకి సంచ‌ల‌న క‌థ‌నం

19-04-202019-04-2020 08:04:08 IST
2020-04-19T02:34:08.112Z19-04-2020 2020-04-19T02:34:05.163Z - - 03-08-2020

క‌రోనా పుట్టింది ఆ మార్కెట్‌లో కాదా..? వెలుగులోకి సంచ‌ల‌న క‌థ‌నం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న‌లుదిక్కులా విజృంభిస్తూ ప్ర‌పంచాన్ని వణికిస్తున్న క‌రోనా వైర‌స్ ఎక్క‌డ పుట్టింది అనేది ఇప్ప‌టికీ ఒక ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింది. చైనాలోని వుహాన్ న‌గ‌రంలో ఓ స‌ముద్ర జంతువుల మార్కెట్‌లో ఈ వైర‌స్ పుట్టింద‌నేది ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న వాద‌న‌. చైనా కూడా అదే చెబుతూ వ‌స్తోంది. అయినా ఈ వైర‌స్‌పై అనేక అనుమానాలు, ఆరోప‌ణ‌లు వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ప్ర‌ఖ్యాత మీడియా సంస్థ ఫాక్స్ న్యూస్ క‌రోనా వైర‌స్ పుట్టుక‌పై సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌సారం చేసింది.

ఇప్ప‌టివ‌ర‌కు చైనా చెబుతున్న‌ట్లుగా, అంద‌రూ అనుకుంటున్న‌ట్లుగా క‌రోనా వైర‌స్ పుట్టింది చైనాలోని వుహాన్ స‌ముద్ర ఉత్ప‌త్తుల మార్కెట్‌లో కాద‌నేది ఈ క‌థ‌నం సారాంశం. అయితే, చైనాపై ఆరోప‌ణ‌లు ఉన్న‌ట్లుగా ఇది చైనా త‌యారు చేసి ప్ర‌పంచంపై వ‌దిలిన జీవాయుధం కూడా కాదు అంటోంది ఫాక్స్ న్యూస్‌.

క‌రోనా వైర‌స్ పుట్టింది వుహాన్ న‌గ‌రంలోనే అని, కానీ మార్కెట్‌లో కాద‌ట‌. ఈ మార్కెట్‌కు అతి స‌మీపంలో ఉన్న ఓ వైరాల‌జీ ల్యాబ్‌లో నుంచి క‌రోనా వైర‌స్ సోకిందంని ఫాక్స్ న్యూస్ అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు క‌థ‌నాన్ని ప్ర‌సారం చేసింది.

2019 డిసెంబ‌ర్ మొద‌ట్లో చైనాలోని వుబెయ్ ప్రావిన్స్‌లోని వుహాన్ న‌గ‌రంలో మొద‌టి క‌రోనా పాజిటీవ్ కేసు న‌మోదైంది. మొద‌టి క‌రోనా వైర‌స్ బాధితుడిని జీరో పేషెంట్ అంటారు. అత‌డు అంత‌కుముందు వుహాన్ స‌ముద్ర జంతువుల మార్కెట్‌కు వెళ్ల‌డంతో అక్క‌డి నుంచే ఈ వైర‌స్ అత‌నికి సోకింది అనేది ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న అంచ‌నా. చైనా కూడా ఇదే చెబుతోంది. అయితే, క‌రోనా వైర‌స్ పుట్టుక ద‌గ్గ‌ర నుంచి సంభ‌వించిన మ‌ర‌ణాల వ‌ర‌కు చైనా అనేక అబద్ధాలు ఆడుతోంద‌ని, కొన్ని విష‌యాల‌ను దాచిపెడుతోంద‌ని అమెరికా ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అందుకే ఈ వైర‌స్‌ను చైనీస్ వైర‌స్ అని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ప‌దేప‌దే పిలుస్తున్నారు. దీంతో చైనా కూడా అమెరికాకు కౌంట‌ర్ ఇస్తోంది. ఒకానొక స‌మ‌యంలో అమెరికానే ఈ వైర‌స్‌ను చైనాకు తెచ్చింద‌ని కూడా ఆరోపించింది. కాగా, ఈ వైర‌స్‌ను చైనా అభివృద్ధి చేసి ప్ర‌పంచంపైకి జీవాయుధంలా వ‌దిలిందని కొంద‌రు అనుమానిస్తున్నారు. వుహాన్‌లోని ఓ వైరాల‌జీ ల్యాబ్‌లో ఈ వైర‌స్‌ను సృష్టించార‌నే అనుమానాలు ఉన్నాయి.

ఇప్పుడు ఫాక్స్ న్యూస్ కూడా వుహాన్‌లోని ఓ వైరాల‌జీ ల్యాబ్ నుంచే ఈ వైర‌స్ మొద‌ట సోకింద‌ని చెబుతోంది. అయితే, ఇది చైనా సృష్టించిన జీవాయుధం కాద‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌మాద‌క‌ర వైర‌స్‌ల‌పై ఈ ల్యాబ్‌లో ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతుంటార‌ని, అక్క‌డ ప‌ని చేసే ఓ ఉద్యోగినికి మొద‌ట క‌రోనా వైర‌స్ సోకింద‌ని అంటోంది. గ‌బ్బిలాల్లో ఈ వైర‌స్ స‌హ‌జంగానే ఉంటుంద‌ని, గ‌బ్బిలంపై ప‌రిశోధ‌న చేస్తున్న స‌మ‌యంలోనే స‌ద‌రు మ‌హిళ‌కు ఈ వైర‌స్ సోకింద‌నేది ఈ క‌థ‌నం చెబుతున్న క‌థ‌.

త‌ర్వాత ఆ మ‌హిళ త‌న బాయ్‌ఫ్రెండ్‌ను క‌లిసింద‌ని, ఆ వ్య‌క్తి వుహాన్ మార్కెట్‌కు వెళ్ల‌డంతో అక్క‌డ చాలా మందికి ఈ వైర‌స్‌ను అంటించార‌ని ఫ్యాక్స్ న్యూస్ చెప్పింది. అయితే, ఈ క‌థ‌నంపై స్పందించేందుకు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇష్ట‌ప‌డ‌లేదు.

క‌రోనా వైర‌స్‌పై ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు వింటున్నామ‌ని, అస‌లు ఈ వైర‌స్ ఎక్క‌డ పుట్టింద‌నేది తెలుసుకునేందుకు మ‌రింత లోతేనా ప‌రిశోధ‌న జ‌రుగుతుంద‌ని ట్రంప్ చెప్పారు. మొత్తంగా, ఐదు నెల‌లు అవుతున్నా క‌రోనా వైర‌స్ ఎక్క‌డ పుట్టింద‌నేది కూడా ఇప్ప‌టికీ అంతు చిక్క‌డం లేదు.

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   6 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   9 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   a day ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle