newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

క్రిమిసంహారక మందులు వైరస్‌లను చంపలేవు.. మనుషులకే ప్రమాదం.. డ‌బ్ల్యూహెచ్‌వో

20-05-202020-05-2020 07:35:20 IST
Updated On 20-05-2020 20:25:50 ISTUpdated On 20-05-20202020-05-20T02:05:20.315Z20-05-2020 2020-05-20T02:05:17.688Z - 2020-05-20T14:55:50.405Z - 20-05-2020

క్రిమిసంహారక మందులు వైరస్‌లను చంపలేవు.. మనుషులకే ప్రమాదం.. డ‌బ్ల్యూహెచ్‌వో
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తూ వీధులు, మార్కెట్ స్థలాలు, బహిరంగ స్థలాల్లో క్రిమిసంహాకర మందులు స్ప్రే చేస్తూ రోజుూ కరోనాపై యుద్ధం చేస్తున్నారు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి కొత్త భాష్యం చెబుతోంది. క‌రోనా వ్యాప్తి క‌ట్ట‌డిలో భాగంగా వీధుల్లో స్ప్రే చేసే క్రిమి సంహారక మందుల వ‌ల్ల ఫ‌లితం శూన్య‌మ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో వెల్ల‌డించింది. కొన్ని దేశాల్లో వీటిని య‌థేచ్చ‌గా వీధుల్లో చ‌ల్లుతున్నార‌ని, దీనివ‌ల్ల క‌రోనా నాశ‌న‌మ‌వ‌ద‌ని పైపెచ్చు మ‌నుషుల్లో ఆరోగ్య స‌మ‌స్య‌లు తలెత్తే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. 

డ‌బ్ల్యూహెచ్‌వో తాజాగా చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌ ప్రకారం.. వీధులు, మార్కెట్ స్థ‌లాలు, ఇత‌ర బ‌హిరంగ ప్ర‌దేశాల్లో క్రిమిసంహార‌క మందులు చ‌ల్ల‌డం ద్వారా అది ధూళి క‌ణాల్లో క్రియార‌హితంగా మారిపోతుంది. దానితో ఆ మందులు క‌రోనానే కాదు, ఇత‌ర వ్యాధి కార‌క క్రిముల‌పై కూడా ఏమాత్రం ప్ర‌భావితం చూప‌లేవు.

వీధుల్లో క‌రోనా వ్యాప్తికి ఎక్కువ‌గా అవ‌కాశ‌ముందన్న భావ‌న‌తో క్రిమి సంహార‌కాల‌ను అధికంగా స్ప్రే చేస్తున్నార‌ని, దీని వ‌ల్ల మానవ ఆరోగ్యానికి ప్ర‌మాదం వాటిల్లే అవ‌కాశం ఉంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రించింది. 

అంతేకాక కొన్నిచోట్ల మ‌నుషుల‌పై క్లోరిన్ వంటి ర‌సాయ‌నాల‌ను నేరుగా ప్ర‌యోగిస్తున్నార‌ని దీనివ‌ల్ల వైర‌స్ వ్యాప్తిని నిలువ‌రించ‌గ‌లం అన్నదాంట్లో ఏమాత్రం నిజం లేద‌ని స్ప‌ష్టం చేసింది. పైగా దీనివ‌ల్ల శారీర‌క‌, మాన‌సిక స‌మ‌స్య‌లు తలెత్తుతాయ‌ని హెచ్చ‌రించింది. ఇలాంటి చ‌ర్య‌లు ఏమాత్రం ఆమోద‌యోగ్యం కాద‌ని పేర్కొంది. 

వాస్తవానికి వీధులు, పేవ్‌మెంట్లు ఇన్ఫెక్షన్లకు రిజర్వాయర్లుగా గుర్తించలేమని, క్రిమిసంహాకర మందులను ఇళ్ల వెలుపల స్ప్రే చేయడం అనేది మానవుల ఆరోగ్యానికి మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

క్లోరిన్ లేక ఇతర విష రసాయనాలను ప్రజలమీద నేరుగా స్ప్రే చేస్తే అది కంటి సమస్యలకు, చర్మం దురదలకు దారితీయవచ్చని, శ్వాస సమస్యలకు కారణం కావచ్చని డబ్ల్యూహెచ్ఓ వివరించింది. అలాగే ఇంటిలోపలి స్థలాలపై కూడా నిత్యం క్రిమిసంహాకర మందులను చల్లడం వల్ల ఏ వైరస్‌లనూ అరికట్టలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.

కాగా, కరోనా వైరస్‌కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)మరో సంచలన హెచ్చరిక చేసింది. మహమ్మారి కరోనా హెచ్ఐవీ లాంటిదని ఎప్పటికీపోదని హెచ్చరించింది. 'ప్రపంచం దానితో జీవించడం నేర్చుకోవలసి ఉంటుంది' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉన్నత నిపుణుడు హెచ్చరించారు. జనవరి 21నుండి వైరస్‌పై రోజువారీ నివేదికను ఇస్తున్న సంస్థ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. 

కరోనా వైరస్ ప్రపంచ సమాజంలో హెచ్ఐవీ లాంటి మరొక స్థానిక వైరస్ కావచ్చని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సోకుతున్న హెచ్ఐవీ మాదిరిగానే కోవిడ్-19 కూడా ఎప్పటికీ పోదని సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ మైఖేల్ ర్యాన్ చెప్పారు. ఈ వైరస్ ఎప్పటికీ దూరంకాకపోవచ్చని ర్యాన్ వ్యాఖ్యానించారు. అలాగే కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు కరోనావైరస్, లాక్‌డౌన్ పరిమితులను ఎత్తివేయడం మరింత సంక్రమణను దారితీస్తుందన్నారు. ప్రాణాంతక మహమ్మారిని అంతం చేసే టీకా కోసం ఎదురు చూడకుండా  జాగ్రత్త  వహించాలన్నారు. 

టీకా లేకుండా ప్రపంచ జనాభా తగినంత స్థాయిలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సంవత్సరాలు పట్టవచ్చు. ఈ వైరస్ ఎప్పటికి అంతమవుతుందో తెలియదు, దీన్ని నిరోధించగలిగే వ్యాక్సిన్  కనుగొని, దాన్ని ప్రతీ ఒక్కరికీ  అందుబాటులోకి తేగలినపుడు మాత్రమే దీన్ని అరికట్టవచ్చని ర్యాన్  స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలను తగ్గించాలని యోచిస్తున్న సమయంలో డబ్ల్యూహెచ్ఓ ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం.

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   5 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   13 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   14 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle