newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

కోవిడ్-19 రోగులకు గుడ్ న్యూస్.. గ్లెన్ మార్క్ మందు రెడీ

21-06-202021-06-2020 09:26:31 IST
2020-06-21T03:56:31.851Z21-06-2020 2020-06-21T03:56:10.592Z - - 11-08-2020

కోవిడ్-19 రోగులకు గుడ్ న్యూస్.. గ్లెన్ మార్క్ మందు రెడీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 రోగుల సంఖ్య భారీగా పెరిగింది. రోగులు, డాక్టర్లు ఈ మహమ్మారినుంచి బయట పడేందుకు వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్లెన్ మార్క్ సంస్థ శుభవార్త వినిపించింది. కోవిడ్-19 వ్యాధిని నయం చేసే మందును కనిపెట్టామని భారత్‌లోని గ్లెన్‌మార్క్ ఫార్మా సంస్థ ప్రకటించింది. స్వల్ప స్థాయి నుంచి ఒక మోస్తరు తీవ్రతతో కోవిడ్-19తో బాధపడుతున్న వారి మీద ఈ మందు ప్రభావం చూపనుంది.

తమ సంస్థ అభివృద్ధి చేసిన ఈ మందు, ఫావిపిరవిర్ కోవిడ్ 19 రోగులపై మెరుగ్గా పని చేసిందని, రోగుల్లో 88 శాతం మెరుగుదల కనిపించిందని గ్లెన్‌మార్క్ తెలిపింది. ఈమేరకు సంస్థ ఒక ప్రకటన విడుదలచేసింది. ఈ ఔషధంతో చేసిన పరిశోధనలలో గర్భిణులను, పాలిచ్చే తల్లులను చేర్చలేదని ఆ సంస్థ వివరించింది. ఈ మందుని నోటి ద్వారా తీసుకోవచ్చు. ఈ ఫావిపిరవిర్ మందును గ్లెన్‌మార్క్ 'ఫ్యాబిఫ్లూ' అనే పేరుతో మార్కెట్లోకి విడుదల చేయడానికి రెడీ అవుతోంది. 

"ఆ యాంటీ వైరల్ మందు రకరకాల ఆర్ఎన్ఏ వైరస్‌పై పని చేస్తుంది. 20 నుంచి 90 ఏళ్ళ మధ్య వయసు వారిలో ఈ మందును పరీక్షించినప్పుడు చెప్పుకోదగిన మెరుగుదల కనిపించింది. ఫావిపిరవిర్ మందును కోమార్బిడ్ పరిస్థితుల్లో అంటే మధుమేహం, హృద్రోగాలతో కూడా బాధపడుతున్న రోగులకు కూడా ఇవ్వవచ్చు" అని గ్లెన్‌మార్క్ తన ప్రకటనలో తెలిపింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ ఈ యాంటీ వైరల్‌ మందు ఫావిపిరవర్‌కు 'నియంత్రిత అత్యవసర ఉపయోగానికి' అనుమతి ఇచ్చింది.

ఈ సంస్థ ఈ మందు ఉత్పత్తికి, పంపిణీకి భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ నుంచి అనుమతి పొందింది. దేశంలో కరోనావైరస్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్న సమయంలో ఈ అనుమతి లభించడంతో డాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మందు వల్ల కోవిడ్ మరణాలు తగ్గుతాయని సంస్థ చెబుతోంది. ఈ సంస్థ ఒక్కో టాబ్లెట్ రూ 103 కి విక్రయించనుంది. 200 ఎంజీ టాబ్లెట్ అందుబాటులో వుంది. 34 టాబ్టెట్లు ఉండే స్ట్రిప్ ధరను రూ.3500గా నిర్ణయించింది. 14 రోజుల పాటు ఈ డ్రగ్ వాడవలసి వుంటుంది. 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   3 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   3 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   5 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   14 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle