newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

కోవిడ్-19 దెబ్బకు పట్టణాలు ఖాళీ.. జనం పరార్

15-02-202015-02-2020 09:30:56 IST
Updated On 15-02-2020 11:03:34 ISTUpdated On 15-02-20202020-02-15T04:00:56.590Z15-02-2020 2020-02-15T04:00:50.024Z - 2020-02-15T05:33:34.222Z - 15-02-2020

కోవిడ్-19 దెబ్బకు పట్టణాలు ఖాళీ.. జనం పరార్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు ప్రపంచంలో కోవిడ్-19 వైరస్ దెబ్బకు పట్టణాలకు పట్టణాలు ఖాళీ అయిపోతున్నాయి. వైరస్ సోకిన వ్యక్తి ఫలానా ఏరియాలో ఉన్నట్లు వార్త వస్తే చాలు చాలా దేశాల్లో ప్రజలు తమ తమ ప్రాంతాలనుంచి పారిపోతున్నారు. ఇది అతిశయోక్తి కాదు ముమ్మాటికీ నిజం.. కరోనా వైరస్ వ్యాపించిన చైనాలోని ఊహాన్ నగరం నుంచి 50 లక్షలమంది చెప్పా పెట్టకుండా సమీప ప్రాంతాలకు పారిపోయారన్న వార్త ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ఇలా వెళ్లిన వారిలో వైరస్ లక్షణాలు ఉంటే ఇంకా ఎంతమందికి దాన్ని అంటిస్తారు అనే భయంతో అంతర్జాతీయ సంస్థలు గజగజలాడుతున్నాయి. ఇకపోతే కోవిడ్ వైరస్‌తో ప్రమాదం లేదని, అదుపులోకి వస్తోందని చైనా ప్రకటిస్తుండగానే ఆ దేశంలో ఒక్కరోజులోనే 270 మంది ఆ వైరస్ దెబ్బకు చనిపోయారన్ని వార్త గుబులు రేపుతోంది. కాగా కరోనా వైరస్ సోకిన వ్యాధిగ్రస్తుడు నిర్బంధం నుంచి బయటకు వస్తే అతగాడిని ఉత్తర కొరియా సైనికులు కాల్చి చంపారన్న వార్త ప్రపంచాన్ని కంపింప చేస్తోంది.

ఆలస్యంగా అందిన సమాచారం ప్రకారం.. లండన్‌లోని చైనా టౌన్‌ గురువారం రాత్రికి రాత్రి ఖాళీ అయిపోయింది. మనుష్య సంచారం లేక వీధులు, కస్టమర్లు కానరాక హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు వెలవెలబోతున్నాయి. లండన్‌లో ఓ మహిళకు కరోనా వైరస్‌ ఉన్నట్లు బుధవారం నిర్ధారణ కావడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు స్పష్టం అవుతోంది. లండన్‌లో అదే తొలి కేసుకాగా, బ్రిటన్‌ దేశమంతా కలిసి తొమ్మిది కేసులు నమోదయ్యాయి. వైరస్‌ సోకిన బాధితురాలిని దక్షిణ లండన్‌లోని గయ్య్‌ అండ్‌ సెయింట్‌ థామస్‌ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

A Chinatown restaurant is almost empty amid widespread coronavirus fears. There is no suggestion that restaurant staff are infected by the virus

గురువారం ఒక్క రోజే 763 మంది బ్రిటిషర్లకు వైద్య పరీక్షలు నిర్వహించగా అదృష్టవశాత్తు ఎవరికీ వైరస్‌ సోకలేదని తేలింది. అయినప్పటికీ ప్రజలు, ముఖ్యంగా చైనా టౌన్‌లో ఇళ్లు కదలడం లేదు. ముఖ్యంగా జనాలు గుంపుగా ఉండే హోటళ్లు, షాపులు, ఇతర పబ్లిక్‌ స్థలాల్లోని అసలు వెళ్లడం లేదని సమాచారం. ఇప్పటి వరకు చైనాలో కరోనా వైరస్‌ సోకిన రోగుల సంఖ్య 59,823 కేసులు నమోదుకాగా, చైనాను కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 60,394 కేసులు నమోదయ్యాయి. ఒక్క చైనాలోనే 1367 మంది మరణించగా, ప్రపంచ వ్యాప్తంగా ముగ్గురే మరణించారు.

మరోవైపున కోవిడ్‌- 19 (కరోనా వైరస్‌) పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ప్రాణాలు బలిగొనే ఆ వైరస్‌ వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ తమ పౌరులను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఉత్తర కొరియా మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. కరోనా వైరస్‌ సోకినట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తిని పాశవికంగా హతమార్చింది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నియంతృత్వ పోకడలకు అద్దంపట్టే ఈ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

చైనాలో కరోనా వైరస్ మూలాలు బయటపడిన నాటి నుంచి.. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దౌత్యపరంగా తమకు మిత్రపక్షంగా ఉన్న ఏకైక దేశం చైనా సరిహద్దును సైతం మూసివేశారు. అంతేకాకుండా... కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తమ దేశ పౌరులతో పాటు విదేశీయులను కూడా ఎప్పటికప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నా.. అధికారులకు సహకరించాలని ఆదేశించారు. అదే విధంగా చైనాకు వెళ్లివచ్చిన తమ దేశ పౌరులు, అధికారులను నిర్బంధిస్తున్నారు.

ఈ క్రమంలో నిర్బంధం నుంచి బయటకు వచ్చి బయట స్నానం చేసేందుకు ప్రయత్నించిన ఓ పేషెంట్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సదరు వ్యక్తిని కాల్చివేశారు. ఈ మేరకు దక్షిణ కొరియాకు చెందిన డాంగ్‌- ఆ ఇల్బో అనే వార్తాపత్రిక ఓ కథనం ప్రచురించింది. ఉత్తర కొరియాలో ఒక్క కరోనా వైరస్‌ కూడా నమోదు కాలేదన్న విషయం అబద్ధమని.. ఇప్పటికే వైరస్‌ కారణంగా అక్కడ పలువురు వ్యక్తులు మృత్యువాత పడ్డారని పేర్కొంది. మరోవైపు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఉత్తర కొరియాలో కరోనా కారణంగా మరణాలు సంభవించినట్లు తమకు ఎటువంటి సమాచారం అందలేదని తెలిపింది.

 

కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   9 hours ago


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   11 hours ago


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   15 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   17 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   19 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   20 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   21 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle