newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

కోవిడ్ 19 ఇప్పుడు విశ్వవ్యాప్త వ్యాధి: ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

12-03-202012-03-2020 17:36:06 IST
2020-03-12T12:06:06.922Z12-03-2020 2020-03-12T12:06:00.490Z - - 05-08-2020

కోవిడ్ 19 ఇప్పుడు విశ్వవ్యాప్త వ్యాధి: ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేవలం 3 నెలల కాలంలో వందదేశాలకు విస్తరించిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్త వ్యాధిగా మారిపోయిందని, ఈ విశ్వమారిని నిరోధించడానికి ప్రపంచం యావత్తు కలిసి కృషి చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనా వైరస్ వ్యాప్తి, దాని తీవ్రత, దాన్ని అరికట్టడంలో ఆయా దేశాల అసమర్థతా స్థాయిలను చూశాక కరోనా వైరస్ పట్ల తీవ్రంగా కలత చెందుతున్నట్లు డబ్ల్యుహెచ్ఓ అధ్యక్షుడు పేర్కొన్నారు.

అయితే ఇన్నాళ్లుగా కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్త వ్యాధిగా మారిందని ప్రకటించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు తటపటాయిస్తూ వచ్చారు. ఎందుకంటే ఒక వ్యాధి లేక వైరస్ విశ్వమంతా వ్యాపించిందని ప్రకటిస్తే ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన రాజకీయ, ఆర్థిక ప్రభావాలు ఉంటాయని ప్రపంచ ఆరోగ్య నిపుణులు తెలిపారు.

మూడు నెలల క్రితం అంతుబట్టని వ్యాధిగా మాత్రమే బయటపడిన కరోనా వైరస్ ఆసియా నుంచి మధ్యప్రాచ్యం వరకు, యూరప్ నుంచి యునైటెడ్ స్టేట్స్ వరకు 3 నెలల్లోనే లక్షా 21 వేలమందికి సోకింది. ప్రత్యేకించి గత రెండు వారాల్లో చైనాకు వెలుపల 13 రెట్ల వేగంతో వ్యాప్తి చెందుతోందని, పైగా కరోనా బారినపడిన దేశాల సంఖ్య ముూడు రెట్లకు చేరుకుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అద్నామ్ గెబ్రెయెసస్ పేర్కొన్నారు. 

బుధవారం జెనీవాలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్సులో మాట్లాడిన టెడ్రోస్ రాబోయే రోజుల్లో కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య పెరుగుతుందని, ప్రభావిత దేశాల్లో మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశముందని ఆయన హెచ్చరించారు. పైగా వ్యాధి బారిన పడే దేశాల సంఖ్య రానురాను పెరుగుతూ వస్తుందని కూడా తెలిపారు

ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్‌ను అడ్డుకుని నియంత్రించడంలో విజయం సాధించాయని కానీ ఇతర ప్రపంచ దేశాధినేతలు ఈ వైరస్ గురించి వేగంగా స్పందించడంలో వెనుకబడిపోయారని టెడ్రోస్ నిందించారు. వీరి అసమర్థత, నిర్లక్ష్యం వల్లే కరోనా వైరస్ తక్కువ కాలంలో విశ్వమారిగా అవతరించిందిని ఆయన విమర్శించారు

వ్యాధికి మూలమైన చైనా, దక్షిణ కొరియా దేశాల్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని, 81 దేశాల్లో కరోనా కేసులు నిర్ధారణ కాలేదని, మరో 57 దేశాల్లో మాత్రం పది కంటే తక్కువ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఏదైనా వ్యాధిని విశ్వవ్యాప్త వ్యాధిగా మారిందని ప్రకటిస్తే రాజకీయంగా, ఆర్థికంగా తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా ప్రకటిస్తే ఇప్పటికే కునారిల్లిపోయిన ప్రపంచ మార్కెట్లు కుప్పగూలిపోతాయని దీంతో అన్ని దేశాలు ప్రయాణ, వాణిజ్య ఆంక్షలను మరింతగా పెంచుతాయని వీరు చెబుతున్నారు. అందుకే ఇప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు కరోనా వైరస్‌ని విశ్వమారిగా అభివర్ణించడానికి సాహసించలేకపోతున్నారు. 

కరోనా వైరస్ సోకిన కేసులు ప్రపంచమంతటా గంటగంటకూ మారుతున్నాయి. బుధవారం ఉదయం నాటికి ఈ వైరస్ ప్రపంచంలో 121,564 మందికి సోకగా 4,373 మంది మరణించారు. ఇక చైనా వెలుపల 109 దేశాల్లో 32,778 కేసులు నమోదయ్యాయి. అమరికాలోని 36 రాష్ట్రాలకు పాకిన కరోనా వైరస్ 1,050మందికి వ్యాపించిందని సమాచారం.

2009లో హెచ్1ఎన్1 స్వైన్ ఫ్లూను విశ్వమారిగా పేర్కొన్న తర్వాత ఒక వైరస్ మళ్లీ ప్రపంచవ్యాప్త వ్యాధిగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం ఇదే తొలిసారి  కావడంతో ప్రపంచం తల్లడిల్లిపోతోంది

 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   an hour ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   6 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   7 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   8 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   10 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   a day ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle