newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

కోవిడ్‌ వారియర్స్‌కు రూ.50 లక్షల బీమా.. సెప్టెంబర్‌ వరకు పెంపు

22-06-202022-06-2020 12:07:36 IST
Updated On 22-06-2020 12:16:34 ISTUpdated On 22-06-20202020-06-22T06:37:36.291Z22-06-2020 2020-06-22T06:37:13.702Z - 2020-06-22T06:46:34.429Z - 22-06-2020

కోవిడ్‌ వారియర్స్‌కు రూ.50 లక్షల బీమా.. సెప్టెంబర్‌ వరకు పెంపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ వారియర్స్ కు మరింతగా భరోసా, రక్షణ కల్పించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. భారత్ లో రోజు రోజుకీ కోవిడ్‌–19 కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గత కొద్ది రోజులుగా రోజూ 15వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా పాటిజివ్‌ కేసుల సంఖ్య 4 లక్షల 25వేల మార్క్‌ను దాటింది.

ఇప్పటివరకూ భారత్‌లో 4,25,282 కరోనా కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 14,821 కొత్త కేసులు నమోదు కాగా, 445మంది మృతి చెందారు. ఇక యాక్టివ్‌ కేసులు 1,74,387 ఉండగా, 2,37,196మంది మహమ్మారి నుంచి కోరుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ వైరస్‌ బారినపడి 13,699మంది ప్రాణాలు కోల్పోయారు. 

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి అధికమౌతుండటంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ బాధితులకు సేవలందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఉద్దేశించిన రూ. 50 లక్షల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను మరో మూడు నెలలు పొడిగించింది. దీంతో సెప్టెంబర్‌ వరకు కోవిడ్‌ వారియర్స్‌కు బీమా కవరేజీ ఉంటుంది. 22 లక్షల వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఈ బీమా వల్ల ప్రయోజనం చేకూరుతుంది. కోవిడ్ 19 కారణంగా రోగులతో పాటు పోలీసులు కూడా మరణిస్తున్నారు. ఈ ఇన్సూరెన్స్‌ను న్యూ ఇండియా అష్యూరెన్స్‌ కంపెనీ ద్వారా అందిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా వైరస్‌ మొదలైన గత మార్చి నుంచి ఈ బీమాను వర్తింపజేస్తున్నారు.

తొలుత జూన్‌ 30వరకూ  ఈ బీమా కవరేజీ వుంది. మరోవారంలో ఈ గడువు ముగియనుండటంతో కేంద్రం ఈ నిర్ణయం వెలువరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ దవాఖానాలు, హెల్త్‌ కేర్‌ సెంటర్లు, వెల్‌నెస్‌ సెంటర్లలోని సిబ్బంది, కమ్యూనిటీ హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఆశ కార్యకర్తలు, శానిటేషన్‌ వర్కర్లకు ఈ బీమా వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కోవిడ్‌ బాధితులకు చికిత్స అందిస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రుల సిబ్బందికి కూడా ఈ బీమా వర్తిస్తుంది. 

Please Subscribe This Link...

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

   18 hours ago


దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

   21 hours ago


హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

   25-07-2021


పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   25-07-2021


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   24-07-2021


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle