newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

కోవిడ్‌ను పూర్తిగా రూపుమాపలేం.. తేల్చిచెప్పిన చైనా, భారత్ వైద్య నిపుణులు

29-04-202029-04-2020 14:49:06 IST
Updated On 29-04-2020 15:00:47 ISTUpdated On 29-04-20202020-04-29T09:19:06.115Z29-04-2020 2020-04-29T09:18:43.427Z - 2020-04-29T09:30:47.543Z - 29-04-2020

కోవిడ్‌ను పూర్తిగా రూపుమాపలేం.. తేల్చిచెప్పిన చైనా, భారత్ వైద్య నిపుణులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనాతో సహజీవనం చేయడం అనే భావన ఎంత విమర్శలకు దారితీస్తున్నా.. మనకు ఇష్టమున్నా లేకున్నా మానవాళిని కరోనా వంటి వైరస్‌లు అంటిపెట్టుకునే ఉంటాయని చైనా, భారత్ వైద్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఏ వైరస్‌ని అయినా పూర్తిగా రూపుమాపటం అసాధ్యమని, అపి ప్రతి సంవత్సరమూ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట తమ ఉనికిని చాటుతూనే ఉంటాయని వీరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుుడు ప్రపంచ మహమ్మారిగా మారి విధ్వంసం సృష్టిస్తున్న కరోనా వైరస్ ఈ శీతాకాలంలో  ఫ్లూ అవతారం దాల్చి మన జీవితంలో భాగమవుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మనిషి జీవితంలో సుదీర్ఘకాలంపాటు కోవిడ్‌ ఉంటుందని చైనాలోని అత్యున్నత పరిశోధన సంస్థ పాథోజెన్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ జిన్‌కి పేర్కొన్నారు. ఇక ఇదే అభిప్రాయాన్ని అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ, ఇన్‌ఫెక్చువస్‌ డైరెక్టర్‌ ఆంథోని ఫాసీ కూడా వ్యక్తం చేశారు. కోవిడ్‌-19ను పూర్తిగా రూపుమాపలేమని చైనాకు చెందిన వైద్యశాస్త్ర నిపుణులు అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌కు కారణమైన సార్స్‌-కోవ్‌-2 సీజనల్‌ ఫ్లూ మాదిరిగా ప్రతియేడు ఉనికి చూపెడుతుందని వెల్లడించారు. కరోనా వైరస్‌ శీతాకాలం ఫ్లూగా మానవ జీవితంలో భాగమవుతుందన్నారు. ఇక ప్రతి సంవత్సరం ఫ్లూ కారణంగా మూడు లక్షల నుంచి 6 లక్షల 50 వేల మంది మరణిస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న సంగతి తెలిసిందే.

దీర్ఘకాలం కోవిడ్ మనుగడ: డాక్టర్ దిలీప్ మావ్లంకర్

లక్షణాలు లేకుండా పాజిటివ్‌గా ఉన్న వ్యక్తులను గుర్తించడం కష్టమవుతుందని, వారి ద్వారా వైరస్‌ వ్యాప్తి అధికంగా జరిగే అవకాశాలున్నాయిని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌ డాక్టర్‌ దిలీప్‌ మావ్లంకర్‌ తెలిపారు.

భారత్‌లోని వైద్యశాస్త్ర నిపుణులు కూడా ప్రపంచ మానవాళిపై సార్స్‌-కోవ్‌-2 తిష్ట వేసుకు కూర్చుందని చెప్తున్నారు. అత్యధిక ట్రాన్స్‌మిషన్‌ రేటు కలిగిన కోవిడ్‌ చాలాకాలం మనుగడలో ఉంటుందని అంటున్నారు.  

వైరస్‌కు గురైన వ్యక్తుల్లో తొలివారం పాటు పెద్దగా లక్షణాలు బయటపడకపోవడంతో.. దాదాపు 44 శాతం వైరస్‌ వ్యాప్తి అలాంటి కేసుల వల్లే జరగుతుందని పలు అధ్యయనాలు కూడా చెప్పిన సంగతి తెలిసిందే. రోగ నిరోధక శక్తి లేని వ్యక్తులపై కోవిడ్‌ మళ్లీ మళ్లీ దాడి చేస్తుందని భారత వైద్య పరిశోధన మండలిలో పనిచేసిన ఎపిడెమాలజిస్టు డాక్టర్‌ లలిత్‌ కాంత్‌ అభిప్రాయపడ్డారు. అయితే, సమర్థవంతమైన వ్యాక్సిన్‌తో కోవిడ్‌ చెక్‌ పెట్టొచ్చునని తెలిపారు. 

వేడి వాతావరణంలో వైరస్ మనజాలదని కానీ 30 నిమిషాలపాటు 56 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మాత్రమే వైరస్ చస్తుంది కానీ సాధారణంగా భూమ్మీద వాతావరణం అంత ఎక్కువ వేడిని కలిగి ఉండదని పెకింగ్ యూనివర్శిటీ ఫస్ట్ హాస్పిటల్‌కి చెందిన వాంగ్ గ్వికియాంగ్ తెలిపారు. కోవిడ్-19 వైరస్‌ వాతావరణాన్ని ఎలా ప్రభావితమవుతుందనేది ఈ శీతాకాలంలోనే తేలుతుందని చైనా వైద్యులు చెబుతున్నారు.

కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి జేవీఅర్ ప్రసాద్ రావు కూడా చైనా వైద్యుల అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. కరోనా వైరస్ రెండో దశ దాడి నవంబర్‌లో శీతాకాలంలోనే మొదలవుతుందని, అప్పటికి ప్రపంచంలో తొలి దశ వైరస్ ముగిసిపోయి ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు కూడా కోలుకుని ఉంటాయి. అయితే వాక్సిన్ అందుబాటులోకి వచ్చేంతవరకు మానవులు భౌతిక దూరం పాటించడం, ఫేస్ మాస్కులు ధరించడం, చేతులు శుభ్రపర్చుకోవడం తప్పనిసరి, ఇదే మన సామాజిక వాస్తవంగా మారుతుందని ప్రసాదరావు చెబుతున్నారు.

 

మిస్ యు సుశాంత్ భూమి పెడ్నేకర్

మిస్ యు సుశాంత్ భూమి పెడ్నేకర్

   4 minutes ago


అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

   16 minutes ago


బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   5 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   20 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle