newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

‘కోడ్ ఉల్లంఘనపై చర్యలేవి?’ ఈసీపై సుప్రీం సీరియస్

15-04-201915-04-2019 15:25:35 IST
Updated On 15-04-2019 17:28:38 ISTUpdated On 15-04-20192019-04-15T09:55:35.978Z15-04-2019 2019-04-15T09:53:32.865Z - 2019-04-15T11:58:38.998Z - 15-04-2019

‘కోడ్ ఉల్లంఘనపై చర్యలేవి?’ ఈసీపై సుప్రీం సీరియస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఈసీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తుంటే మీరేం చేస్తున్నారని సుప్రీం ఈసీని ప్రశ్నించింది. అంతేకాదు మంగళవారం కోర్టుముందుకి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల వేళ కోడ్‌ను కచ్చితంగా అమలు చేసే విషయంలో... అధికారుల సేవల్ని ఉపయోగించుకోవడంలో కేంద్ర ఎన్నికల సంఘం విఫలమవుతున్నట్లు కనిపిస్తోందని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని తీవ్రంగా మండిపడింది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, మాజీ ముఖ్యమంత్రి మాయావతిలు మతపరమైన వ్యాఖ్యలు చేశారనీ.... దీనిపై ఈసీ ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదంటూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

ఎన్నికల కోడ్‌ అమలు చేయడంలో సీఈసీ పనితీరుపై దృష్టిసారించిన సుప్రీంకోర్టు ఎన్నికల అధికారులను వివరణ కోరింది. దీనిపై స్పందించిన ఈసీ అధికారులు... నేతల వ్యాఖ్యల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామనీ... ఎవరైనా అభ్యంతరకరంగా మాట్లాడితే చర్యలు తీసుకుంటున్నామనీ తెలిపారు. ఆ చర్యలెక్కడ అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు... ఇలాంటి సమాధానాలు కుదరదని తేల్చిచెప్పింది. నేతలెంతటివారైనా చర్యలు తీసుకోవాల్సి వస్తే, కచ్చితంగా తీసుకోవాలని తెగేసి చెప్పింది. మంగళవారం ఈసీ అధికారి చెప్పే సమాధానాన్ని బట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

యోగి, మాయావతిపై ఈసీ చర్యలు

ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సరిగా పనిచెయ్యట్లేదనీ, కేంద్రం చెప్పు చేతల్లో పనిచేస్తోందనీ, పక్షపాతంతో వ్యవహరిస్తోందనీ టీడీపీ ఆరోపణలు చేస్తోంది. 23పార్టీలతో కలిసి ఢిల్లీలో సమావేశం నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు కూడా సీఈసీని తప్పుపట్టడం చర్చకు దారితీస్తోంది.

ఇదిలా ఉంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మాజీ సీఎం మాయావతి ఎన్నికల ప్రచారంపై ఈసీ ఆంక్షలు విధించింది. యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంపై మూడురోజులు, మాయవతి ఎన్నికల ప్రచారంపై రెండురోజుల నిషేధం విధించింది. 

లాక్ డౌన్ నియంత్రణ ఇక చాలు.. కరోనాకు భయపడం అంటున్న అమెరికన్లు

లాక్ డౌన్ నియంత్రణ ఇక చాలు.. కరోనాకు భయపడం అంటున్న అమెరికన్లు

   8 hours ago


భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగే రోజు సాకారం.. దేశ ప్రజలకు మోదీ లేఖ

భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగే రోజు సాకారం.. దేశ ప్రజలకు మోదీ లేఖ

   8 hours ago


 లాక్ డౌన్ పై రాష్ట్రాలదే నిర్ణయం ..ఆ నగరాలపైనే  ఫోకస్

లాక్ డౌన్ పై రాష్ట్రాలదే నిర్ణయం ..ఆ నగరాలపైనే ఫోకస్

   30-05-2020


ఒక్కరోజే 7,466 కరోనా కేసులు.. కరోనా మరణాల్లో చైనాను దాటేసిన భారత్?

ఒక్కరోజే 7,466 కరోనా కేసులు.. కరోనా మరణాల్లో చైనాను దాటేసిన భారత్?

   30-05-2020


ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్‌.. తిప్పికొట్టిన సంస్థ సీఈఓ

ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్‌.. తిప్పికొట్టిన సంస్థ సీఈఓ

   29-05-2020


కరోనా ఆందోళన.. ప్రపంచంలో 9వ స్థానానికి ఇండియా

కరోనా ఆందోళన.. ప్రపంచంలో 9వ స్థానానికి ఇండియా

   29-05-2020


నేపాల్ ప్రధానికి భారత్ గట్టి కౌంటర్.. కొత్త మ్యాపులకు బ్రేక్

నేపాల్ ప్రధానికి భారత్ గట్టి కౌంటర్.. కొత్త మ్యాపులకు బ్రేక్

   29-05-2020


కాశ్మీర్లో ఐఈడీతో భారీ కుట్ర.. భగ్నం చేసిన భద్రతాదళాలు

కాశ్మీర్లో ఐఈడీతో భారీ కుట్ర.. భగ్నం చేసిన భద్రతాదళాలు

   28-05-2020


లాక్ డౌన్ 5.O.. మరో రెండువారాలు గ్యారంటీనా?

లాక్ డౌన్ 5.O.. మరో రెండువారాలు గ్యారంటీనా?

   28-05-2020


కరోనా వ్యాప్తిలోనే కాదు వేసవి తీవ్రతలోనూ మనమే టాప్

కరోనా వ్యాప్తిలోనే కాదు వేసవి తీవ్రతలోనూ మనమే టాప్

   27-05-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle